Do you know to blood sugar level reaches 250 mg after eating Diabetes
Diabetes : మీకు షుగర్ ఉందా? అదేనండి.. డయాబెటిస్. చాలామందికి ఈరోజుల్లో షుగర్ అనేది కామన్ వ్యాధి. షుగర్ రాగానే వెంటనే డాక్టర్ దగ్గరికి పరిగెత్తుకెళ్లడం.. డాక్టర్ రాసిచ్చిన మందులను రోజూ వేసుకొని షుగర్ ను కంట్రోల్ చేసుకోవడం. నిజానికి షుగర్ అంటే ఏంటి.. దాంట్లో ఎన్ని రకాలు ఉంటాయి. దాని లక్షణాలు ఏంటి అనే విషయం చాలామందికి తెలియదు.మనం ఏదైనా ఆహారం తింటే.. ఆ ఆహారంలో ఉన్న కార్బోహైడ్రేట్స్ ను బాడీ షుగర్ గా మారుస్తుంది. దాన్నే గ్లూకోజ్ అంటాం మనం. ఇందులో పాంక్రియాస్ అనే గ్రంథి ముఖ్య పాత్ర పోషిస్తుంది. అయితే.. షుగర్ లో రెండు రకాలు ఉంటాయి. ఒకటి టైప్ 1 డయాబెటిస్.. ఇంకోటి టైప్ 2 డయాబెటిస్.టైప్ వన్ డయాబెటిస్ పుట్టుకతోనే వస్తుంది.
టైప్ 2 డయాబెటిస్ మాత్రం పుట్టిన తర్వాత మధ్య వయసులో ఉన్నప్పుడు తినే ఆహారాన్ని బట్టి వస్తుంటుంది.ఈరోజుల్లో చాలామంది ఎదుర్కొనేది టైప్ 2 డయాబెటిస్ నే. అసలు డయాబెటిస్ వచ్చిందని ఎలా తెలుసుకోవాలి. డయాబెటిస్ వస్తే షుగర్ తగ్గుతుందా? పెరుగుతుందా? అనే విషయాలు కూడా చాలామందికి తెలియదు.బాగా దాహం వేయడం, మూత్ర విసర్జన అధికంగా చేయడం, అలసిపోయినట్టు ఉండటం, ఊరికే బరువు తగ్గడం, నోట్లో పుండ్లు అవడం, కంటిచూపు తగ్గడం, కళ్లు మసకగా మారడం, ఏవైనా గాయాలు అయితే తగ్గకపోవడం లాంటి లక్షణాలు ఉంటే షుగర్ వచ్చినట్టే అని అనుకోవాలి.
what are the symptoms of diabetes
అయితే.. శరీరంలో ఉండాల్సిన షుగర్ లేవల్స్ కంటే తక్కువగా ఉంటే దాన్ని హైపోగ్లైసీమియా అంటారు. అంటే.. షుగర్ లేవల్స్ తగ్గడం అన్నమాట. అది కూడా చాలా డేంజర్. షుగర్ లేవల్స్ పడిపోతే.. వణుకు వస్తుంది. నీరసంగా అనిపిస్తుంది. చెమటలు పడుతాయి. చిరాకు వస్తుంది. గుండె వేగంగా కొట్టుకుంటుంది.ఇక ఉండాల్సిన దాని కన్నా ఎక్కువ షుగర్ లేవల్స్ ఉన్నా ప్రమాదమే. అటువంటి వాళ్లు ఎక్కువ పిండి పదార్థాలు ఉన్న వస్తువులను తినడం మానేయాలి. షుగర్ లేవల్స్ తక్కువగా ఉన్నవాళ్లు తక్షణ శక్తి కోసం పిండి పదార్థాలు ఉన్న ఫుడ్ ను తీసుకోవచ్చు.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
This website uses cookies.