Zodiac Signs : ఏప్రిల్ 23 నుంచి ఈ రాశుల వారికి భారీగా ఆస్తి నష్టం జరగబోతుంది ..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Zodiac Signs : ఏప్రిల్ 23 నుంచి ఈ రాశుల వారికి భారీగా ఆస్తి నష్టం జరగబోతుంది ..!!

Zodiac Signs : ఏప్రిల్ 23 నుంచి సెప్టెంబర్ వరకు ఈ రాశుల వారికి గురు చండాల యోగం వలన భారీగా ఆస్తి నష్టం జరగబోతోంది. గురు చండాల యోగం అంటే గురువు, రాహువు కలిసి మేషరాశిలోకి వస్తున్నారు. వీళ్ళిద్దరూ కలిసినప్పుడు దానిని గురు చండాల యోగం అంటారు. మేషరాశి, వృషభరాశి, కన్యా రాశి, వృశ్చిక రాశి, మకర రాశి వాళ్లకు గురు చండాల యోగ ప్రభావం పడబోతుంది. మేషరాశి వారి తల్లిదండ్రులకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు […]

 Authored By prabhas | The Telugu News | Updated on :16 April 2023,8:00 am

Zodiac Signs : ఏప్రిల్ 23 నుంచి సెప్టెంబర్ వరకు ఈ రాశుల వారికి గురు చండాల యోగం వలన భారీగా ఆస్తి నష్టం జరగబోతోంది. గురు చండాల యోగం అంటే గురువు, రాహువు కలిసి మేషరాశిలోకి వస్తున్నారు. వీళ్ళిద్దరూ కలిసినప్పుడు దానిని గురు చండాల యోగం అంటారు. మేషరాశి, వృషభరాశి, కన్యా రాశి, వృశ్చిక రాశి, మకర రాశి వాళ్లకు గురు చండాల యోగ ప్రభావం పడబోతుంది. మేషరాశి వారి తల్లిదండ్రులకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు లేదా చిన్న చిన్న దెబ్బలు తగిలే అవకాశం ఉంది.

Venu Swamy comments about Aries

Venu Swamy comments about Aries

వృషభ రాశి వారికి తీవ్రమైన సమస్యలు జరగబోతున్నాయి. వృషభ రాశి వారికి పోలీస్ కేసులు, తల్లిదండ్రులకు సంబంధించిన ఇబ్బందులు సంతాన సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు రాబోతున్నాయి. కన్యా రాశి వారి కుటుంబానికి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది. ఏదో ఒక పెద్ద సమస్య అనేది వీరికి కలగబోతోంది. తర్వాత వృశ్చిక రాశి వారికి దెబ్బలు తగలడం, మానసిక ఆందోళన సమస్యలు రాబోతున్నాయి. మకర రాశి వారి తల్లిదండ్రులకు సంబంధించిన ఆర్థికపరమైన ఇబ్బందులు, ఏలినాటి శని ప్రభావంతో పెద్ద అనారోగ్య సమస్యలు రాబోతున్నాయి.

Zodiac Signs Astrologer Venu Swamy Prediction About April 23 Guru Chandala Yogam

Zodiac Signs Astrologer Venu Swamy Prediction About April 23 Guru Chandala Yogam

ఈ ఐదు రాశుల వారికి తీవ్రమైన సమస్యలు కనిపించనున్నాయి. ఈ దోషాలు పోవాలంటే శ్రీకాళహస్తిలో మంగళవారం కానీ శనివారం కానీ రాహు కేతువుల పూజ చేసి బయటికి వచ్చాక గుడి చివర్లో గురుదక్షిణామూర్తి దగ్గర అర్చన చేయించుకుని ఎల్లో కలర్ పువ్వును పంతులు గారిని అడిగి తీసుకొని దగ్గర పెట్టుకోవాలి. దీనివలన తీవ సమస్యలన్నీ తొలగిపోతాయి అలాగే గురువారం నాడు ఎల్లో కలర్ బట్టలు, మంగళవారం నాడు రెడ్ కలర్ బట్టలు ధరించాలి. ఏదో ఒక వారం ఈ పరిహారాన్ని పాటిస్తే మీకు వచ్చే తీవ్రమైన సమస్యలు తొలగిపోతాయి. అమావాస్య తర్వాత 5 రాశుల వారు కచ్చితంగా ఈ పరిహారాలు పాటించండి. ఆనందకరమైన జీవితాన్ని పొందండి.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది