Vrischika rasi : ఆగస్టు నెలలో వృశ్చిక రాశి వారి జీవితంలో జరగబోయేది ఇదే… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Vrischika rasi : ఆగస్టు నెలలో వృశ్చిక రాశి వారి జీవితంలో జరగబోయేది ఇదే…

 Authored By ramu | The Telugu News | Updated on :29 July 2024,6:00 pm

ప్రధానాంశాలు:

  •  Vrischika rasi : ఆగస్టు నెలలో వృశ్చిక రాశి వారి జీవితంలో జరగబోయేది ఇదే...

Vrischika rasi  : ఆగస్టు నెలలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉంటుంది..? అలాగే వీరి ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది…? వీరు చేయవలసిన పరిహారాలు ఏమిటి..? ఈ వివరాలన్ని కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం…ఆగస్టు నెలలో క్రయవిక్రయ వ్యాపారాలు చేస్తూనటువంటి వృశ్చిక రాశి వారికి సానుకూలమైన మాసముగా ఈ ఆగస్టు మాసం ఉంటుంది. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి ఇది చాలా యోగ్యమైనటువంటి మాసం. ఈ రాశి వారికి ఈ నెల బాగా కలిసి వస్తుంది. అలాగే వీరి మాటకి పదును ఏర్పడుతుంది. గతంలో అప్పులు చేసి ఆ అప్పు తీర్చలేనటువంటి వృశ్చిక రాశి వారు ఈ మాసంలో పూర్తిగా తీర్చేటటువంటి సందర్భం ఉన్నది లేదా 50% పైచిలుకు అప్పు తీర్చుకునే సందర్భాలు కూడా కుజ ప్రభావం చేత వృశ్చిక రాశి వారికి గోచరిస్తున్నాయి.

ఆగస్టు మాసంలో కెరియర్ పరంగా సానుకూలంగా ఉంటుంది. పెద్ద లాభాలు లేకపోయినప్పటికీ తృప్తికరమైన లాభాలను పొందుతారు. భూగృహ వ్యాపారాల యందు వృశ్చిక రాశి జాతకులు తగిన జాగ్రత్తలు వహించడం అవసరం. తొందర పాటుతో ఖరీదు పలకనటువంటి భూమిని కానీ వాహనాలు లేదా నిత్య వస్తువులను గాని కొనడం మంచిది కాదు. విదేశాలలో ఉన్నటువంటి వృశ్చిక రాశి ఉద్యోగస్తులకు ఉద్యోగంలో కొంచెం ఒత్తిడి ఉన్నప్పటికీ అధికారుల చేత కొంత ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ మాసంతంలో ప్రశంసలను పొందగలుగుతారు. వృశ్చిక రాశి జాతకులు ఒత్తిడితో కూడుకున్న పనులతో ఈ ఆగస్టు నెలలో ఇబ్బంది పడతారు. అయిష్టంగా దైవారాధన గాని సేవ ను చేయకూడదు. ఏది ఉన్న గాని భక్తిశ్రద్ధలతో చేయడం ద్వారా అది ఉపయుక్తం అవుతుంది. వృశ్చిక రాశి వారికి ఆగస్టు మాసంలో ఏవైతే కోర్టు వ్యవహారాలు ఉన్నాయో అవి కూడా అనుకూలంగా తీర్పులు ఇస్తాయి. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వృశ్చిక రాశి వారు అవమానపాలు అవ్వాల్సి వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించాలి.వృశ్చిక రాశి వారు స్త్రీల విషయాలలో గాని లేదా వీరికి సంబంధం లేని విషయాలలో గాని దూరంగా ఉండడం సలహాలు ఇవ్వకపోవడం శుభప్రదం.

Vrischika rasi ఆగస్టు నెలలో వృశ్చిక రాశి వారి జీవితంలో జరగబోయేది ఇదే

Vrischika rasi : ఆగస్టు నెలలో వృశ్చిక రాశి వారి జీవితంలో జరగబోయేది ఇదే…

పరిహారాలు.

వృశ్చిక రాశి వారు గోసేవను ఎంత చేయగలిగితే అంత ఆనందదాయకాన్ని పొందగలుగుతారు. అలాగే స్థిర లక్ష్మి మీ ఇంట్లో తాండవం ఆడుతుంది. తద్వారా వృశ్చిక రాశి వారు ఆగస్టు నెలలో అమోఘకరమైన గ్రహ ఫలితాలను పొందుతారు.

ramu

Tandu Ramalingaiah ( Ramu ) is experienced in Media field. He worked in various Telugu media houses for about 15 years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Chief Editor of thetelugunews.com website. Contact Details : thetelugunews1@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి