Gemini Horoscope : రానున్న 5 రోజులలో మిథున రాశి వారికి భారీ ప్రమాదం తప్పదు…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Gemini Horoscope : రానున్న 5 రోజులలో మిథున రాశి వారికి భారీ ప్రమాదం తప్పదు…!

 Authored By jyothi | The Telugu News | Updated on :10 January 2024,7:00 am

ప్రధానాంశాలు:

  •  Gemini Horoscope : రానున్న 5 రోజులలో మిథున రాశి వారికి భారీ ప్రమాదం తప్పదు...!

Gemini Horoscope : మిథున రాశి వారికి పొంచి ఉన్న ప్రమాదం ఏంటి.? ఈ సమయంలో వారికి ఏ అంశాలు ఎటువంటి గోచార ఫలితాలు కనిపిస్తున్నాయో అనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మిథున రాశి. రాశి చక్రంలో మూడవది. ఈ యొక్క రాశి మరియు కష్టాలు చూస్తారు. అయితే మిధున రాశి వారు సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు. సున్నితమైన స్వభావం కలవారిగా కూడా ఉంటారు. చక్కటి మార్గాలను మీరు అన్వేషిస్తారు. అన్ని లెక్కలు రాతపూర్వకంగా లేకపోయినా కానీ చక్కగా గుర్తుంటుంది. వివాదాలకు వీరు దూరంగా ఉంటారు. కానీ సమస్యలకు మాత్రం దూరంగా పోరు.. అయితే మిధున రాశి వారి యొక్క గోచార ఫలితాలు ఈ సమయంలో చూసినట్లయితే.. కనుక ముఖ్యంగా వారికి ఒక ప్రమాదం మంచి ఉంది. కాబట్టి ఇలా తప్పించుకోటానికి ప్రయత్నం చేయండి. ఈ విధంగా చేస్తే కనుక కచ్చితంగా ఈ ప్రమాదం నుండి బయటపడతారు.

ఈ సమయంలో మీ యొక్క సన్నిహితుల నుండి కానీ బంధువుల నుండి కానీ ఆత్మీయుల నుండి కానీ మీరు ఊహించని సంఘటన అయితే చూస్తారు. అంటే ఎంతో కాలంగా మీకు సన్నిహితులుగా ఉన్నవారు ఈ సమయంలో మిమ్మల్ని అఘోరవపరిచే విధంగా మాట్లాడటం.. అందరితో మీ గురించే చెడుగా చెప్పటానికి ప్రయత్నం చేస్తారు. దానికి కారణం ఏంటో అర్థం కాక మీరు సతమతం అవుతూ ఉంటారు. అయితే ఎంతోకాలంగా మీతో క్లోజ్ గా ఉండేవారు మీ గురించి అపార్థం చేసుకోవడం లాంటి చాలా విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో అపరిచిత వ్యక్తులను నమ్మి మీరు ఆర్థికంగా నష్టపోయే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్త వహించాలి. ఆర్థిక సంబంధమైన లాభాలు గురించి అస్సలు చెప్పకూడదు. ఈ విధంగా చేస్తే కనుక మీరు ప్రమాదాలను కొని తెచ్చుకుంటారు.

ఈ విధంగా మీరు తప్పించుకునే మార్గాలను అన్వేషించండి. ఈ సమస్యల నుండి ఈ యొక్క ప్రమాదాల నుండి కచ్చితంగా బయటపడగలుగుతారు. అలాగే ఈ సమయంలో పొలం పనులు చేసేవారు ఎవరైతే ఉన్నారో రాత్రి సమయంలో మీరు బయటకు వెళ్ళినప్పుడు ముఖ్యంగా పొలాల గట్ల వెంబడి నడుస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే విషం సర్పాల బారి నుండి మీకు ప్రమాదం పొంచి ఉంది. కాబట్టి చాలా జాగ్రత్త వహించండి. అలాగని మీరు ఎటువంటి భయాలు పెట్టుకోకూడదు. సోమవారం రోజు శివాలయానికి వెళ్లి ఆ శివ భగవానుడికి దీపారాధన చేసినట్లయితే కచ్చితంగా ఈ ప్రమాదం నుండి మీరు బయటపడగలుగుతారు.. ఈ విధంగా మిథున రాశి వారికి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ప్రమాదమైతే పొంచింది. చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అలాగే ఈ మిథున రాశి వారు వ్యాపారంలో విజయం కోసం వ్యాపార స్థలం యొక్క దక్షిణ దిశలో ఎరుపు రంగు జార్ ని ఉంచండి. ఉద్యోగస్తులు పనులలో అనుకూలత కోసం ఒక పసుపు కొమ్మును పసుపు రంగు వస్త్రంలో చుట్టి ఆఫీస్ బ్యాగ్ లో పెట్టుకోండి. ఈ విధంగా చేస్తే కనుక మీకు శుభ ఫలితాలు కలుగుతాయి, ప్రతికూలంగా ఉన్న అంశాలు అన్నీ కూడా అనుకూలంగా మారుతాయి…

Advertisement
WhatsApp Group Join Now

jyothi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది