Zodiac Signs : ఉగాది పంచాంగం 2022 -2023 మీన రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?

Authored By pavan J | The Telugu News | Published on: April 5, 2022, 4:00 pm

తెలుగు నూతన సంవతర్సరాది ఉగాది కొత్త పంచాంగం ప్రకారం మీన రాశి వారి గోచార రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. మీన రాశి వారికి ఈ ఏడాది అంతా ఆదాయం 2, వ్యయం 8గా ఉన్నాయి. అలాగే రాజ పూజ్యం 1, అవమానం 7గా ఉన్నాయి. అయితే ఈ ఏడు మీన రాశి వారికి ఆదాయం కంటే ఖర్చులు చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే గౌరవించే వారు, ప్రేమించే వారి కంటే… అవమానించే వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంది.

అయితే ఈ సంవత్సరం మీన రాశి వాళ్లకి మిశ్రమ, అమిశ్రమ ఫలితాలు రాబోతున్నాయి. అంటే సగం శుభ ఫలితాలు, సగం అశుభ ఫలితాలు. అయితే ఈ ఏడు ఆథ్యాత్మిక చింతన పెంచుకొని జాగ్రత్తగా ఉండటం వల్ల అశుభ ఫలితాలను తగ్గించుకొని శుభ ఫలితాలను పెంచుకోవచ్చు. కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు.అయితే ప్రధాన గ్రహాలైన గురు గ్రహం వల్ల అత్యంత యోగ్యమైన ఫలితాలు రాబోతున్నాయి.

horoscope 2022 2023 telugu year Ugadi and check your zodiac signs pisces

horoscope 2022 2023 telugu year Ugadi and check your zodiac signs pisces

అయితే మీరు ప్రారంభించబోయే పనుల్లో మంచి జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సినీ రంగం వారికి ఈ ఏడాది చక్కటి శుభ ఫలితాలు రాబోతున్నాయి. 2023లో ఈ రాశి వాళ్లకి ఏలి నాటి శని ప్రారంభం కాబోతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అనుకూలమైన తేదీలు, ఇబ్బందికర ఫలితాలు, చేసుకోవాల్సిన దేవతారాధన గురించి తెలుసుకోవడానికి మీరు కింది లింక్ ను క్లిక్ చేయండి. పూర్తి వీడియోను వీక్షించండి.

పూర్తి వీడియో కోసం ఇక్క‌డక్లిక్ చేయండి

pavan J

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp