Zodiac Signs : ఉగాది పంచాంగం ప్రకారం మేష రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?

Authored By pavan J | The Telugu News | Published on: March 25, 2022, 4:00 pm

Zodiac Signs : తెలుగు నూతన సంవతర్సరాది ఉగాది కొత్త పంచాంగం ప్రకారం మేష రాశి వారి గోచార రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. మేష రాశి వారికి ఈ ఏడాది అంతా ఆదాయం 14, వ్యయం 14గా ఉన్నాయి. అలాగే రాజపూజ్యం 3, అవమానం 6గా ఉన్నాయి. అంటే మంచి చేసేవారు ముగ్గురైతే అవమానించే వారు రెట్టింపుగా ఉన్నారు. కాబట్టి మీరు ఈ ఏడాది చాలా జాగ్రత్తగా ఉండాలి.

అలాగే మీరు మొదలు పెట్టిన పనుల్లో కొన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ… ఆ పనులన్నింటినీ మీరు పూర్తి చేస్తారు. ముఖ్యంగా ప్రధాన గ్రహాలైన గురు, శని, రాహు, కేతు గ్రహాల సంచారం వల్ల మేష రాశి వాళ్లు కుటుంబ సభ్యుల కోసం లేదా కుటుంబం కోసం ఎక్కువగా శ్రమించాల్సి వస్తుంది.ఈ సంవత్సరం మీరు చక్కటి కీర్తి ప్రతిష్టలను సంపాదిస్తారు.

horoscope 2022 telugu year and check your zodiac signs aries

horoscope 2022 telugu year and check your zodiac signs aries

విదేశీ ప్రయత్నాలు, నల్లని భూములు, పంటలు పండించే వారు వ్యాపారస్తులకు శని గ్రహం చాలా అనుకూలంగా ఉంది. అంతే కాకుండా ఈ ఏడాది మేష రాశి వాళ్లకు ఏళ్ల నాటి శని లేదని గ్రహాల సంచారం సూచిస్తోంది. అన్ని సత్ఫలితాలే ఉన్నందున కాస్త శ్రమిస్తే… మంచి పేరుతో పాటు ధనం కూడా సంపాదించొచ్చు. కాబట్టి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అనుకూలమైన తేదీలు, ఇబ్బందికర ఫలితాలు, చేసుకోవాల్సిన దేవతారాధన గురించి తెలుసుకోవడానికి మీరు కింది లింక్ ను క్లిక్ చేయండి. పూర్తి వీడియోను వీక్షించండి.

pavan J

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp