Zodiac Signs : కుంభ రాశి వారికి, ఆగస్టు నెల రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే…!

 Authored By prabhas | The Telugu News | Updated on :1 August 2022,4:00 pm

Zodiac Signs : ఆగస్టు నెల, 2022, కుంభ రాశి వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో ఎప్పుడు తెలుసుకుందాం. ఈ మాసంలో మేషరాశిలో రాహువు, కుజుడు కలిసి ఉన్నారు. ఇలా 11వ తారీఖు వరకు కలిసి ఉండి ఆ తర్వాత వృషభంలోకి వస్తున్నాడు. అలాగే మిథునంలో శుక్రుడు ఏడవ తేదీ నుంచి కర్కాటకంలోకి, అదేవిధంగా కర్కాటకంలో ఉన్న రవి 16వ తేదీ నుంచి సింహరాశిలోకి వస్తున్నారు. సింహరాశిలో బుధ, చంద్రులు కలిసి ఉన్నారు. ఈ యొక్క బుధుడు 21వ తారీకు వరకు సింహరాశిలో ఉండి, ఆ తర్వాత కన్యా రాశిలోకి వెళతాడు. వృశ్చికంలో కేతువు, మకరంలో శని, మీనరాశిలో గురుడు ఉన్నారు. అయితే ఈ గ్రహ స్థితిని అనుసరించి ఈ మాసంలో కుంభ రాశి వారికి ఏ విధంగా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ కుంభ రాశి వారు విదేశాలకు వెళ్లాలి అనుకునేవారు, మనీ ఇన్వెస్ట్మెంట్ చేసేవారు కొన్ని జాగ్రత్తలు వహించాలి. సొంత బిజినెస్ చేయాలనుకున్న వారికి ఈనెల అనుకూలంగా ఉంది. ఈ మాసంలో ఈ రాశి వారు మూడో తేదీ నుండి 11వ తేదీ వరకు మొండి వైఖరి కలిగి ఉంటారు. దీని వలన కొన్ని విషయాలలో మంచి జరగనుంది. మరి కొన్ని విషయాలలో చెడు జరగనుంది. అదేవిధంగా గృహాలు, భూములు, రియల్ ఎస్టేట్ ప్లేస్ లు అమ్మినట్లయితే మంచి అనుకూలత పొందుతారు. కొనుగోలు చేయాలనుకున్న వారు మాత్రం అన్ని విధాలా చూసుకొని కొనుగోలు చేయాలి. ఈ రాశి వారికి కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ప్రేమ వ్యవహారాలలో మంచి ఫలితాలు కలుగుతాయి. రుణాల విషయంలో మంచిగా ఉంది.

Horoscope August 2022 Check Your Zodiac Signs Aquarius

Horoscope August 2022 Check Your Zodiac Signs Aquarius

వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ రాశి వారు బంధు వర్గంలో వారిని ఇష్టపడి వివాహం చేసుకుంటారు. ఏడవ తేదీ నుంచి 16వ తేదీ వరకు ఇష్టపడిన వారిని వివాహం చేసుకునే అవకాశం ఉంది. రుణాలు కూడా అందే అవకాశం ఉంది. బ్యాంకు ట్రాన్సాక్షన్ విషయంలో కొన్ని జాగ్రత్తలు వహించాలి. కుంభ రాశి వారికి ఈనెల అనుకూలంగా ఉండాలంటే చేయవలసిన దేవతారాధన ఏమిటంటే లక్ష్మీ గణపతి యొక్క ఆరాధన చేయాలి. శుక్ర, కేతువు, కుజ గ్రహాల దగ్గర దీపారాధన చేయాలి. ఇలా చేస్తే అన్ని విధాలుగా బాగుంటుంది. కుంభరాశి గురించి స్పష్టంగా తెలుసుకోవాలంటే ఈ క్రింది వీడియో లింక్ ను క్లిక్ చేయండి.

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి