Zodiac Signs : కర్కాటక రాశి వారికి ఆగష్టు నెల రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?
Zodiac Signs : ఆగస్టు నెల, 2022, కర్కాటక రాశి వారికి రాశి ఫలాలు విధంగా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మాసంలో మేషరాశిలో కుజుడు, రాహువు కలిసి ఉన్నారు. ఇలా పదకొండవ తారీకు వరకు కలిసి ఉండి కుజుడు 11వ తారీఖు తర్వాత వృషభంలోకి వస్తున్నాడు. అలాగే మిథునంలో ఉన్న శుక్రుడు ఏడవ తేదీ నుంచి కర్కాటకంలోకి, అదేవిధంగా కర్కాటకంలో ఉన్న రవి 16వ తేదీ నుంచి సింహ రాశిలోకి వస్తున్నారు. సింహరాశిలో బుధ, చంద్రులు కలిసి ఉన్నారు. ఈ యొక్క బుధుడు 21 వ తారీఖు వరకు సింహరాశిలో ఉండి, ఆ తర్వాత కన్యా రాశిలోకి వెళతాడు. వృశ్చికంలో కేతువు, మకరంలో శని, మీనరాశిలో గురుడు ఉన్నారు.
అయితే ఈ గ్రహస్థితిని అనుసరించి ఈ మాసంలో కర్కాటక రాశి వారికి ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మాసంలో కర్కాటక రాశి వారికి బ్యాంకింగ్ విషయంలో కొన్ని పనులు ఆలస్యమవుతాయి. హై ఎడ్యుకేషన్ విషయంలో కొన్ని కీలక నిర్ణయాలను తీసుకుంటారు. ఫైనాన్స్ రిలేటెడ్ విషయంలో కుటుంబం తరఫున ఒత్తిడి ఉంటుంది. అలాగే గవర్నమెంట్ ద్వారా కొద్దిగా ఒత్తిడి కలుగుతుంది. కానీ 16వ తారీఖు తర్వాత చేసే గవర్నమెంట్ రిలేటెడ్ విషయంలో మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కమ్యూనికేషన్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొన్ని శుభవార్తలను వింటారు. కొత్త వ్యాపారాలను ప్రారంభించే అవకాశం ఉంది. ఈ యొక్క కర్కాటకం వారికి కొత్త వ్యాపారాలు 21వ తారీకు తర్వాత ప్రారంభం కానున్నాయి.
ఏడవ తారీఖు తర్వాత కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. తల్లి నుండి అత్తగారి నుండి కానీ కొద్దిగా ఒత్తిడి కలగనుంది. అలాగే వాహన విషయంలో కొద్ది ఒత్తిడి ఉంటుంది. సంతాన ప్రయత్నాలు ఫలిస్తాయి. రుణ సంబంధిత విషయాల్లో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. వివాహ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. గతంలో కంటే ఇప్పుడు వ్యాపా రంలో అభివృద్ధి ఉంటుంది. కర్కాటక రాశి వారికి ఈనెల అనుకూలంగా ఉండాలంటే చేయవలసిన దేవతారాధన ఏంటంటే శనిదేవునికి దీపారాధన చేయాలి. నూనెను దీపారాధన కోసం దానం చేయాలి. ఒక రాగి చెంబులో పసుపు, కుంకుమ, గంధం వేసి రావి చెట్టు చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేయాలి. ఇలా చేస్తే అన్ని విధాలుగా బాగుంటుంది.