Zodiac Signs : సింహ రాశి వారికి ఆగష్టు నెల రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?
Zodiac Signs : ఆగస్టు నెల, 2022, సింహ రాశి వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మాసంలో మేషరాశిలో కుజుడు, రాహువు కలిసి ఉన్నారు. ఇలా పదకొండవ తారీఖు వరకు కలిసి ఉండి కుజుడు 11 వ తారీఖు తర్వాత వృషభంలోకి వస్తున్నాడు. అలాగే మిథునంలో ఉన్న శుక్రుడు ఏడవ తేదీ నుంచి కర్కాటకంలోకి, అదేవిధంగా కర్కాటకంలో ఉన్న రవి 16వ తేదీ నుంచి సింహ రాశిలోకి వస్తున్నారు. సింహరాశిలో బుధ, చంద్రులు కలిసి ఉన్నారు. ఈ యొక్క బుధుడు 21 వ తారీకు వరకు సింహరాశిలో ఉండి ఆ తర్వాత కన్యా రాశిలోకి వెళతాడు. వృశ్చికంలో కేతువు, మకరంలో శని, మీనరాశిలో గురుడు ఉన్నారు.
అయితే ఈ గ్రహ స్థితిని అనుసరించి ఈ మాసంలో సింహ రాశి వారికి ఏ విధంగా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రాశి వారికి ముఖ్యంగా విదేశాలలో ఉన్న వారికి ధనయోగం కలగనుంది. అలాగే పేరు, ప్రఖ్యాతలు దక్కుతాయి. 16వ తేదీ నుండి ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపార ప్రయత్నాలు ఫలిస్తాయి. 21వ తేదీ తర్వాత కొత్త వ్యాపారాలను మొదలుపెడతారు. ఎవరితోటైనా మాట్లాడేటప్పుడు లేదా సెటిల్మెంట్ చేసుకునేటప్పుడు జాగ్రత్త వహించాలి. 11వ తేదీ తర్వాత గతంలో చేసినటువంటి తప్పిదాల వలన కొన్ని ఘర్షణలు వస్తాయి. అలాగే గతంలో ఎవరినైతే మీరు వివాహం చేసుకోవాలి అనుకుంటారో మళ్లీ ఇప్పుడు చేసుకునే అవకాశం వస్తుంది.
అలాగే ధన సంబంధిత విషయాలలో మధ్యవర్తిగా అస్సలు వ్యవహరించకూడదు. వేరే ప్రాంతాలకు వెళ్లి చేయాలి అని అనుకున్న ఉద్యోగాలు ఫలిస్తాయి. అలాగే ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే వ్యాపారం కోసం బ్యాంకులలో రుణాల కోసం చేసే ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. ఈ మాసంలో వ్యాపారానికి సంబంధించిన గ్రహస్థితి మంచిగా ఉంది. దూరపు ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించాలి. అయితే సింహరాశి వారికి ఈ నెల అనుకూలంగా ఉండాలంటే చేయవలసిన దేవతారాధన ఏమిటంటే లక్ష్మీనరసింహస్వామిని ఆరాధించాలి. ఇలా చేస్తే అన్ని విధాలుగా బాగుంటుంది. మీరు సింహ రాశి గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే ఈ క్రింది వీడియో లింక్ ను క్లిక్ చేయండి.