Home » Devotional » Horoscope August 2022 Check Your Zodiac Signs Scorpio
Devotional

Zodiac Signs : వృశ్చిక రాశి వారికి, ఆగస్టు నెల రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే.!

Authored By
aruna
The Telugu News | Published on: July 29, 2022, 4:00 pm
Advertisement

Zodiac Signs : ఆగస్టు నెల, 2022, వృశ్చిక రాశి వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మాసంలో మేషరాశిలో రాహువు, కుజుడు కలిసి ఉన్నారు. ఇలా 11 వ తారీఖు వరకు కలిసి ఉండి కుజుడు 11వ తారీఖు తర్వాత వృషభంలోకి వస్తున్నాడు. అలాగే మిథునంలో ఉన్న శుక్రుడు ఏడవ తేదీ నుంచి కర్కాటకంలోకి, అదేవిధంగా కర్కాటకంలో ఉన్న రవి 16వ తేదీ నుంచి సింహరాశిలోకి వస్తున్నారు. సింహరాశిలో బుధ, చంద్రులు కలిసి ఉన్నారు. ఈ యొక్క బుధుడు 21 వ తారీకు వరకు సింహరాశిలో ఉండి ఆ తర్వాత కన్యా రాశిలోకి వెళతాడు. వృశ్చికంలో కేతువు, మకరంలో శని, మీనరాశిలో గురుడు ఉన్నారు. అయితే ఈ గ్రహ స్థితిని అనుసరించి ఈ మాసంలో వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

వృశ్చిక రాశి వారికి కుజుడు ఆరవ స్థానంలో రాహువుతో కలిసి ఉన్నాడు. కనుక ఈ రాశి వారు ధైర్యంగా ఏ పనినైనా చేయగలరు. ఆత్మస్థైర్యం పెరుగుతుంది. అలాగే సంతానానికి సంబంధించిన విషయంలో అనుకూలత ఉంటుంది. అలాగే ఇచ్చిన ధనం రావడం లేదు అనుకుంటే ఈ మాసంలో ఆ ధనం తిరిగి వస్తుంది. అలాగే గృహ, విద్య సంబంధించిన విషయాలలో మంచి ఫలితాలు రానున్నాయి. కొన్ని కాంట్రాక్టులు కూడా వస్తాయి. రాజకీయంగా ఎదిగే అవకాశం కనిపిస్తుంది. రుణాలు కూడా అందే అవకాశం ఉంది. 11వ తేదీ నుండి వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. 16వ తేదీ నుండి ఉద్యోగ సంబంధిత విషయాలలో గవర్నమెంట్ ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది.

horoscope august 2022 check your zodiac signs Scorpio

Advertisement

వృశ్చిక రాశి వారు అనుకున్నది అనుకున్నట్లుగా జరిగే అవకాశం కనిపిస్తుంది. పూర్వీకుల ఆస్తుల విషయంలో 21వ తేదీ నుంచి మంచి ఫలితాలను అందుకుంటారు. కోర్టు కేసు లాంటివి చివరికి వచ్చే అవకాశం ఉంది. రైతులకి పంట విషయాలలో చాలా మంచిగా ఉంది. ఎదురుచూసే అవకాశాలు మీకు ఎదురుగా వస్తాయి. అయితే వృశ్చిక రాశి వారికి ఈ నెల అనుకూలంగా ఉండాలంటే చేయవలసిన దేవతారాధన ఏంటంటే కుజ, రాహువుల గ్రహాల దగ్గర దీపారాధన చేయాలి. దక్షిణామూర్తి స్తోత్రం పఠించాలి. శని భగవానుడిని ఆరాధించాలి. ఇలా చేస్తే అన్ని విధాలుగా బాగుంటుంది. వృశ్చిక రాశి గురించి మీరు మరింత స్పష్టంగా తెలుసుకోవాలంటే ఈ క్రింది వీడియో లింకును క్లిక్ చేయండి.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి