Zodiac Signs : కుంభ రాశి వారికి జూలై నెల రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?

 Authored By prabhas | The Telugu News | Updated on :18 July 2022,4:00 pm

Zodiac Signs : జూలై మాసం, 2022, కుంభ రాశి వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మాసంలో మేషరాశిలో రాహువు, కుజుడు కలిసి ఉన్నారు. అలాగే వృషభ రాశిలో బుధుడు, శుక్రులు కలిసి ఉన్నారు. ఆ బుధుడు రెండవ తేదీ నుంచి వృషభం నుంచి మిథునంలోకి చేరుకుంటాడు. 17వ తేదీ వరకు ఉండి ఆ తర్వాత రోజు నుండి బుధుడు, రవి కలిసి కర్కాటకంలోకి వస్తున్నారు. ఇక తులా రాశిలో కేతువు మకర రాశిలో ఉండాల్సిన శని కుంభంలో నుండి మకరంలోనికి వస్తున్నాడు. అదేవిధంగా మీన రాశిలో గురువు యొక్క సంచారం జరుగుతుంది. అయితే కుంభరాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది, అలాగే కుంభరాశిలోని నక్షత్రాల వారికి ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

కుంభ రాశి వారికి జూలై నెలలో విదేశీ యోగాల విషయం లో చక్కని ఫలితం రానుంది. ఇన్వెస్టిగేట్ విషయంలో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించాలి. అలాగే కుంభరాశిలో గల మూడు నక్షత్రాలు గురించి తెలుసుకుందాం. ముందుగా ధనుష్ట రాశి వారి కి దగ్గరి ప్రయాణాలు ఎక్కువగా వస్తాయి. అలాగే ధైర్యంతో కొన్ని పనులను చేస్తారు. అలాగే శతభిష నక్షత్రం వారికి ఈ నెలలో ప్రయాణాలు ఎక్కువగా ఉన్నాయి. కమ్యూనికేషన్స్ విషయంలో జాగ్రత్త వహించాలి. చదువు విషయంలో కొద్దిగా ఒత్తిడి తగులుతుంది. అలాగే పూర్వాభాద్ర నక్షత్రం వారికి ఫైనాన్స్ విషయంలో మంచి పురోగతి ఉంది. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి. అలాగే కుంభ రాశి వారికి రియల్ ఎస్టేట్ రంగంలో మంచి పురోగతి ఉంది.

horoscope July 2022 check your zodiac signs Aquarius

horoscope July 2022 check your zodiac signs Aquarius

కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి. కొన్ని శుభవార్తలను వింటారు. కమ్యూనికేషన్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. గృహ యోగం కలగనుంది. సినిమా రంగం వారికి ఈ మాసం నుంచి చాలా అనుకూలంగా ఉంది. ఇష్టపడిన వారితో వివాహం చేసుకునే ప్రయత్నం ఫలిస్తుంది. దూరపు ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించాలి. బిజినెస్ విషయంలో మంచి పురోగతి ఉంది. అలాగే కుంభ రాశి వారికి ఈనెల అనుకూలంగా ఉండాలంటే చేయవలసిన దేవతారాధన ఏంటంటే విష్ణు సహస్రనామాలను సూర్యభగవానుని చూసి చదవాలి. రాహువు, కుజ, రవి గ్రహాల దగ్గర దీపం పెట్టాలి. ఇలా చేస్తే అన్ని విధాలుగా బాగుంటుంది. మీరు మరింత స్పష్టంగా తెలుసుకోవాలంటే ఈ క్రింది వీడియో లింకును క్లిక్ చేయండి.

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి