Zodiac Signs : కర్కాటక రాశి వారికి జూలై నెల రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?
Zodiac Signs : జూలై నెల 2022 కర్కాటక రాశి వారికి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మాసంలో మేషరాశిలో రాహువు, కుజుడు కలిసి ఉన్నారు. అలాగే వృషభ రాశిలో బుధుడు, శుక్రులు కలిసి ఉన్నారు. ఆ బుధుడు 2 వ తారీకు నుంచి వృషభం నుంచి మిధునంలోకి చేరుకుంటాడు. మిధునంలో 17 వ తేదీ వరకు ఉండి ఆ తర్వాతి రోజు నుండి బుధుడు, రవి కలిసి కర్కాటకంలోకి వస్తున్నారు. ఇక తులారాశి లోని కేతువు, మకర రాశిలో ఉండాల్సిన శని కుంభంలో నుండి మకరంలోకి వస్తున్నాడు. అదేవిధంగా మీనరాశిలో గురుడు యొక్క సంచారం జరుగుతుంది. అయితే కర్కాటక రాశి వారికి ఈనెల ఎలా ఉంటుంది. అలాగే కర్కాటక రాశిలోని నక్షత్రాల వారికి ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి ఈనెల చంద్రుడితో మొదలవుతుంది.
అలాగే ఈ రాశి మీద గురుడి యొక్క దృష్టి కూడా ఉంది. ఈ రాశి నుంచి దశమంలో కుజు,రాహువులు కలిసి ఉన్నారు. ఇలా కలిసి ఉండటం వలన వివాహ సంబంధాలు, బిజినెస్ పార్ట్నర్స్, లైఫ్ పార్ట్నర్స్, అలాగే కొన్ని మార్పులు చేసుకునేటివి ఇవన్నీ మరల వెనక్కి తిరిగి వస్తాయి. రాజకీయ నాయకులు తీసుకునే కొన్ని నిర్ణయాలో జాగ్రత్త వహించాలి. ఉద్యోగం చేసే వారికి కొద్దిగా ఒత్తిడి తగులుతుంది. ఈ కర్కాటక రాశిలో గల 3 నక్షత్రాల గురించి తెలుసుకుందాం. ముందుగా పునర్వసు నక్షత్రం వారు దూరపు ప్రయాణాలకు వెళ్లి విద్యను కొనసాగిస్తారు. అలాగే మంచి ఉద్యోగం కూడా లభిస్తుంది. పుష్యమి నక్షత్రం వారికి ఆగిపోయిన పనులు ఈ నెలలో జరుగుతాయి. జీవిత భాగస్వామిని తిరిగి వెనక్కి రప్పించుకుంటారు. ఈ మాసంలో మీ మాటలను అందరూ గౌరవిస్తారు. అలాగే ఆశ్లేష నక్షత్రం వారు గవర్నమెంట్ ఉద్యోగాలను సంపాదిస్తారు. బిజినెస్ చేసేవారికి మంచి ఆదాయం వస్తుంది.
కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్య సమస్యలు గతంలో పోల్చుకుంటే ఈ మాసంలో తక్కువగా ఉంటాయి. ఈ కర్కాటక రాశి వారు అప్పులు ఇచ్చేటప్పుడు జాగ్రత్త వహించాలి. రైతులకు పంటలు బాగా పండుతాయి. అలాగే విద్యార్థులు భవిష్యత్తు కోసం మంచి నిర్ణయం తీసుకుంటారు. సంతానం కలగాలి అనుకునే వారు ఈ నెల ఎంతో జాగ్రత్త వహించాలి. అయితే ఈ నెల అనుకూలంగా ఉండాలంటే కర్కాటక రాశి వారు చేయవలసిన దేవతారాధన: విష్ణు సహస్రనామాలను సూర్యభగవానుడిని చూసి చదవండి. ఇలా చేస్తే అన్ని విధాలుగా బాగుంటుంది. అలాగే ఏ పనిని అయినా మొదలుపెట్టేటప్పుడు గణేశుడిని పూజించాలి. లక్ష్మీనరసింహస్వామి, దుర్గాదేవిని ఆరాధించాలి. అలాగే గోమాతకు బెల్లంతో చేసిన ఉండలను, క్యారెట్లను తినిపించాలి. ఇలా చేయడం వలన మీరు అనుకున్న పనిలో ఎటువంటి ఆటంకం జరుగదు.