Home » Devotional » Horoscope July 2022 Check Your Zodiac Signs Pisces
Devotional

Zodiac Signs : మీన రాశి వారికి జూలై నెల రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Updated on: July 15, 2022, 4:13 pm
Advertisement

Zodiac Signs : జూలై మాసం, 2022, మీన రాశి వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మాసంలో మేషరాశిలో రాహువు, కుజుడు కలిసి ఉన్నారు. అలాగే వృషభ రాశిలో బుధుడు, శుక్రులు కలిసి ఉన్నారు. ఆ బుధుడు రెండవ తేదీ నుంచి వృషభం నుంచి మిధునంలోకి చేరుకుంటాడు. 17వ తేదీ వరకు ఉండి ఆ తర్వాత రోజు నుండి బుధుడు, రవి కలిసి కర్కాటకంలోకి వస్తున్నారు. ఇక తులా రాశిలో కేతువు మకర రాశిలో ఉండాల్సిన శని కుంభంలో నుండి మకరంలోనికి వస్తున్నాడు. అదేవిధంగా మీన రాశిలో గురువు యొక్క సంచార జరుగుతుంది. అయితే మీన రాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది, అలాగే మీన రాశిలోని నక్షత్రాల వారికి ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

ఈ మాసంలో మీన రాశి వారికి ఉద్యోగ సంబంధిత విషయాల్లో చక్కగా ఉంటుంది. అలాగే ఈ రాశిలో రాహువు, కేతువు కలిసి ఉండడం వలన పనిలో కొద్ది ఒత్తిడి తగులుతుంది. ఇంపోర్ట్ ,ఎక్స్ ఫోర్ట్ బిజినెస్ లో మంచి లాభాలు రానున్నాయి. అదేవిధంగా మీనరాశిలో గల మూడు నక్షత్రాల గురించి తెలుసుకుందాం. ముందుగా పూర్వాభాద్ర నక్షత్రం వారికి ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా రానున్నాయి. అలాగే ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి ఈ నెలలో వ్యాపారాలలో నష్టాల నుంచి లాభాలకు మారుతారు. అలాగే రేవతి నక్షత్రం వారు ఈ నెలలో భూములను, గృహాలను, వాహనాలను కొనగలుగుతారు. అలాగే మీన రాశి వారికి ముఖ్యంగా కుటుంబ సభ్యులతో ధనం విషయంలో కొన్ని ఘర్షణలు జరిగే అవకాశం ఉంది.

horoscope July 2022 check your zodiac signs Pisces

Advertisement

స్వయంకృషితో ధనం సంపాదిస్తారు. విద్యార్థులకు చదువు విషయంలో మంచి పురోగతి ఉంది. అలాగే లోన్స్ కోసం చూసేవారికి ఈ నెలలో లోన్స్ వస్తాయి. అలాగే రాజకీయ నాయకులు వారు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. దూరపు ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించాలి. బ్యాంకింగ్ విషయంలో జాగ్రత్త వహించాలి. అలాగే మీన రాశి వారికి ఈ నెల అనుకూలంగా ఉండాలంటే చేయవలసిన దేవతారాధన ఏంటంటే రాజరాజేశ్వరి అమ్మవారిని ఆరాధించాలి. సూర్య నమస్కారాలు చేయాలి. గోవులకు క్యారెట్లు, బెల్లం తినిపించాలి. ఇలా చేస్తే అన్ని విధాలుగా బాగుంటుంది.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి