Zodiac Signs : కన్యా రాశి వారికి జూలై నెల రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?

Advertisement

Zodiac Signs : జూలై మాసం, 2022, కన్యా రాశి వారికి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మాసంలో మేషరాశిలో రాహువు, కుజుడు కలిసి ఉన్నారు. అలాగే వృషభ రాశిలో బుధుడు, శుక్రులు కలిసి ఉన్నారు. ఆ బుధుడు రెండవ తేదీ నుంచి వృషభం నుంచి మిథునంలోకి చేరుకుంటాడు. మిధునంలో 17వ తేదీ వరకు ఉండి ఆ తర్వాత నుంచి బుధుడు, రవి కలిసి కర్కాటకంలోకి వస్తున్నారు. ఇక తులా రాశిలో కేతువు మకర రాశిలో ఉండాల్సిన శని కుంభంలో నుండి మకరంలోనికి వస్తున్నాడు. అదేవిధంగా మీన రాశిలో గురువు యొక్క సంచారం జరుగుతుంది. అయితే కన్యారాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది, అలాగే కన్యా రాశిలోని నక్షత్రాల వారికి ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

కన్యా రాశి వారికి ఈ నెలలో రుణ సమస్యల నుంచి బయటపడతారు. అలాగే ఆరోగ్య సమస్యల నుంచి విముక్తి పొందుతారు. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించాలి. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడాలి. అలాగే రెండవ స్థానంలో కేతు విహరిస్తున్నాడు కనుక ధన సంబంధిత విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. కన్యా రాశి లో గల మూడు నక్షత్రాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఉత్తరా నక్షత్రం వారు దూర ప్రాంతాలకు వెళ్లి ఉద్యోగాలు చేస్తారు. హస్తా నక్షత్రం వారికి కొన్ని పనులు జరగటానికి దైవ బలం గ్రహబలం రెండు పెరగనున్నాయి. అనుకున్న పనులు నెరవేరుతాయి. అలాగే చిత్తా నక్షత్రం వారిని చూసుకున్నట్లయితే కొన్ని నిర్ణయాలను ఆకస్మికంగా తీసుకుంటారు. అనుకోని ప్రయాణాలు చేస్తారు. బి.పి తో బాధపడేవారు ఈ నెల యందు జాగ్రత్తగా ఉండాలి.

Advertisement
horoscope July 2022 check your zodiac signs Virgo
horoscope July 2022 check your zodiac signs Virgo

అలాగే కొన్ని విషయాలలో గొడవలు జరిగే అవకాశం ఉంది. అలాగే కన్యా రాశి వారికి ఈ నెలలో ఉద్యోగ పరంగా ఆదాయం ఎక్కువ వస్తుంది. ఉద్యోగ పనులను సరైన సమయానికి నిర్వర్తిస్తారు. భూములను, బంగారం, వాహనాలను ఈ నెలలో కొనగలుగుతారు. విద్యార్థులకు చదువు విషయంలో కొంత సహకారం కలుగుతుంది. పెళ్లి కాని వారికి వివాహ ప్రయత్నాలు ఈ నెలలో ఫలిస్తాయి. అలాగే కన్యా రాశి వారికి ఈ నెల యందు అనుకూలంగా ఉండాలంటే చేయవలసిన దేవతారాధన ఏంటంటే శనివారం రోజు వెంకటేశ్వర స్వామిని ఆరాధించాలి. అలాగే గణేశుడిని పూజించాలి. గోవులకు క్యారెట్లు, బెల్లం తో చేసిన ఉండలు, గ్రాసమును తినిపించాలి. ఇలా చేయడం వలన కన్యా రాశి వారికి జూలై నెల యందు అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి.

Advertisement
Advertisement