Zodiac Signs : కర్కాటక రాశి వారికి జూన్ నెల రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Zodiac Signs : కర్కాటక రాశి వారికి జూన్ నెల రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?

Zodiac Signs : జూన్ నెల 2022లో కర్కాటక రాశి వారికి గోచార రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. వీరికి అంటే కర్కాటక రాశి వారికి ప్రధాన గ్రహాలైన గురు, రాహు, కేతు, శని గ్రహాల సంచారం వల్ల అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. సినీ, క్రియేటివ్ రంగంలో ఉన్న వారికి అధిక ధన లాభం కల్గబోతోంది. అయితే గ్రహాల సంచారం వల్ల వేరే ప్రాంతాలకు వెళ్లి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తే […]

 Authored By pavan | The Telugu News | Updated on :13 June 2022,4:00 pm

Zodiac Signs : జూన్ నెల 2022లో కర్కాటక రాశి వారికి గోచార రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. వీరికి అంటే కర్కాటక రాశి వారికి ప్రధాన గ్రహాలైన గురు, రాహు, కేతు, శని గ్రహాల సంచారం వల్ల అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. సినీ, క్రియేటివ్ రంగంలో ఉన్న వారికి అధిక ధన లాభం కల్గబోతోంది. అయితే గ్రహాల సంచారం వల్ల వేరే ప్రాంతాలకు వెళ్లి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తే ఫలితం ఉంటుంది. మీరు అనుకున్న స్థాయి ఉద్యోగం మీ సొంతం అవుతుంది. ఉన్న చోటే వెతికితే అంతగా ఆశించిన ఫలితాలు రాకపోవచ్చు.

రియల్ ఎస్టేట్ రంగం వారికి అనుకున్న ఫలితాలు రావు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులకు ఈ మాసం చాలా మంచిది. కాస్త కష్టపడి చదివినా పై చదువులకు వెళ్లడం, ఉద్యోగం సంపాదించడం చాలా సులువు అవుతుంది. మార్కెటింగ్ రంగం వారికి గతంతో పోలిస్తే అనేక లాభాలు రాబోతున్నాయి. పర్సనల్ లోన్స్, గృహ రుణాల కోసం ప్రయత్నించే వారికి ఈ నెల అనువైన సమయం. వివాహ సంబంధాలు నిశ్చయించుకునేటప్పుడు ఆచితూచి అడుగు వేయండి.

horoscope june 2022 check your zodiac signs cancer

horoscope june 2022 check your zodiac signs cancer

ఈ నెలలో ఈ ప్రయత్నాలు చేయకపోవడం చాలా మంచిది. గతంలో మిమ్మల్ని వదిలి వెళ్లిపోయిన జీవిత భాగస్వామి కానీ వ్యాపార భాగస్వామి కానీ మళ్లీ మీ వద్దకు తిరిగి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.తృటిలో కొన్ని ప్రమాదాలు తప్పుతాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగం చేస్తున్న వారికి ఆకస్మిక మార్పులు కల్గబోతున్నాయి. తొందర పడి నిర్ణయాలు తీస్కోకండి. ఆలోచించకుండా మాట జారకూడదు. ఎంత జాగ్రత్తగా వ్యవహరిస్తే.. అన్ని లాభాలను పొందవచ్చు. దత్తాత్రేయుడి స్తోత్రం చదవడం వల్ల మంచి జరుగుతుంది.

pavan

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది