Zodiac Signs : మకర రాశి వారికి జూన్ నెల రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..? | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Zodiac Signs : మకర రాశి వారికి జూన్ నెల రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?

Zodiac Signs : జూన్ నెల 2022లో మకర రాశి వారికి గోచార రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. వీరికి అంటే మకర రాశి వారికి ప్రధాన గ్రహాలైన గురు, రాహు, కేతు, శని గ్రహాల సంచారం వల్ల అనుకూల ఫలితాల కంటే ప్రతికూలమైన ఫలితాలే ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా ఉద్యోగం చేసే వారు చాలా జాగ్రత్తగా ఉండాలి.తొందరపాటుతో ఉద్యోగాలు మానేయడం వంటివి అస్సలే చేయవద్దు. వేరే చోట ఉద్యోగం వచ్చాకే […]

 Authored By pavan | The Telugu News | Updated on :19 June 2022,4:00 pm

Zodiac Signs : జూన్ నెల 2022లో మకర రాశి వారికి గోచార రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. వీరికి అంటే మకర రాశి వారికి ప్రధాన గ్రహాలైన గురు, రాహు, కేతు, శని గ్రహాల సంచారం వల్ల అనుకూల ఫలితాల కంటే ప్రతికూలమైన ఫలితాలే ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా ఉద్యోగం చేసే వారు చాలా జాగ్రత్తగా ఉండాలి.తొందరపాటుతో ఉద్యోగాలు మానేయడం వంటివి అస్సలే చేయవద్దు. వేరే చోట ఉద్యోగం వచ్చాకే చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేయండి. లేదంటే చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుది. వ్యాపారస్తులకు ఈ మాసం చాలా బాగుంది. ఆశించిన దాని కంటే కూడా ఎక్కువ లాభాలను పొందుతారు.

క్రియేటివ్ రంగంలో ఉన్న వాళ్లకి మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి. కొత్త వ్యక్తులతో కలిసి పని చేసే సూచనలు ఉన్నాయి. దీని వల్ల మీరు చాలా లాభాలు పొందబోతున్నారు. విదేశీ విద్య యోగాన్ని ఇస్తుంది. సంతానం కోసం ప్రయత్నించే వాళ్లు ఈ మాసంలో కచ్చితంగా శుభవార్త వింటారు. అలాగే రాజకీయ నాయకులు మంచి పేరు, ప్రతిష్టలను పొందుతారు. అలాగే మీ పిల్లల నుంచి మీరు శుభవార్త వినబోతున్నారు. సినిమా రంగం వాళ్లకి మంచి మంచి ఛాన్సులు వస్తాయి. వివాహ ప్రయత్నాలు చేసే వాళ్లకు మంచి సంబంధాలు కుదురుతాయి. అలాగే ప్రేమించిన వారినిపెళ్లి చేసుకునే యోగం కనిపిస్తోంది.

horoscope june 2022 check your zodiac signs capricorn

horoscope june 2022 check your zodiac signs capricorn

భగవత్ అనుగ్రహం సిద్ధిస్తుంది. మీకు మంచి మంచి ఆలోచనలు, అవకాశాలు వస్తున్నాయి. భూమి, స్థలాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. గృహాలు, ప్లాట్లు, భూమి కొనుగోలు చేసేటప్పుడు ఒఖటికి పది సార్లు ఆలోచించండి. అక్కడ ఏదైనా సమస్య ఉందా పేపర్లు అన్నీ సరిగ్గా ఉన్నాయా లేదా అని చూస్కొని కొనుగోలు చేయండి. అలాగే కుటుంబ సభ్యుల ఒత్తిడి చాలా ఎక్కువాగా ఉంటుంది. అలాగే విదేశాలకు వెళ్లాలనుకునే వాళ్లు కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. వెంకటేశ్వర స్వామి ఆరాధన మంచిది. అలాగే లలితా, విష్ణు సహస్ర నామాలు చదివితే అనుకున్నది సాధించగల్గుతారు.

pavan

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది