Home » Devotional » Horoscope June 2022 Check Your Zodiac Signs Taurus
Devotional

Zodiac Signs : వృషభ రాశి వారికి జూన్ నెల రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?

Authored By
pavan J
The Telugu News | Published on: June 11, 2022, 4:00 pm
Advertisement

Zodiac Signs : జూన్ నెల 2022లో వృషభ రాశి వారికి గోచార రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. వీరికి అంటే వృషభ రాశి వారికి ప్రధాన గ్రహాలైన గురు, రాహు, కేతు, శని గ్రహాల సంచారం వల్ల మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ముందుగా మెడికల్ రంగానికి చెందిన వ్యాపారులు, ఉద్యోగాలు, విద్యార్థులకు చాలా మంచి జరగబోతోంది. కొత్త కొత్త విషయాలను నేర్చుకుంటారు. అలాగే గృహ యొగం ఉంది. వాహనాలు, వస్తువులను కొనుగోలు చేసే అవకాశం కనిపిస్తోంది.

Advertisement

అంతే కాదండోయ్ ప్రభుత్వానికి సంబంధించిన సబ్సిడీలు, భూములు కూడా మీుకు దక్కుతాయి. అలాగే వృషభ రాశి వాళ్లకు ఈ మాసంలో విదేశీ ధన యోగం ఉంది. వ్యాపారులు, ఉద్యోగులకు అనేక మైన లాభాలు కల్గబోతున్నాయి. కాకపోతే వేరే వేరే ప్రాంతాలకు వెళ్లి ఉద్యోగం చేయాల్సి వస్తుంది. అలా వెళ్లి చేయాల్సి వస్తే వెంటనే వెళ్లండి. దాని వల్ల ఆర్థికంగా మీకు చాలా లాభాలు కల్గబోతున్నాయి. ఏవైనా పనులు ప్రారంభించాలి అనుకునే వారికి ఈ మాసం మంచి సమయం.

horoscope june 2022 check your zodiac signs taurus

Advertisement

సంతాన సమస్యలతో బాధపడుతున్న వారు ఈ నెలలో కచ్చితంగా శుభవార్త వింటారు. రాజకీయ రంగంలో ఉన్న వృషభ రాశి స్త్రీలకు.. మంచి పేరు, ప్రతిష్టలు రాబోతున్నాయి. వివాహాల కోసం ప్రయత్నించే వారికి కచ్చితంగా ఈ నెలలో పెళ్లి సంబంధం కుదురుతుంది. అప్పులు ఇచ్చేటప్పపుడు లేదా తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంతే కాదండోయ్.. తల్లి దండ్రుల హెల్త్ విషయంలో, దూర ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రమాదాలు వచ్చే అవకాశం కనిపిస్తోంది. నిత్యం లలితా సహస్ర నామాలతో పాటు విష్ణు సహస్ర నామాలు వినడం వల్ల చాలా మంచి జరుగుతుంది.

pavan J

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి