Zodiac Signs : సింహరాశి వారికి మే నెలలో రాశి ఫలాలు ఎలా ఉన్నాయోంటే..?

Authored By pavan J | The Telugu News | Published on: May 8, 2022, 4:00 pm

Zodiac Signs : మే నెల 2022లో సింహ రాశి వారికి గోచార రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. వీరికి అంటే సింహ రాశి వారికి ప్రధాన గ్రహాలైన గురు అష్టమ స్థానంలో.. రాహువు తొమ్మిదింటిలో, శని ఏడింటిలో, కేతువు మూడింటిలో ఉన్నాడు. ఈ గ్రహ సంచారాల వల్ల అదృష్టం మీ వెంటే ఉంటుంది. కొంచెం కష్టపడితే చాలు అధిక లాభాలను పొందవచ్చు. ఈ మాసమంతా సింహ రాశి వారికి శుభ ఫలితాలే ఉన్నాయి.

ధన సంబంధ విషయంలో చాలా బాగుంటుంది. పిత్రార్జితం.. అంటే తండ్రికి సంబంధించిన ఇండ్లు, పొలాలు వంటివి మీ సొంతం అవుతాయి. అయితే ఈ నెలలో మీరు ఎక్కువగా ప్రయాణాలు చేసే అవకాశం కనిపిస్తోంది.ఉద్యోగాల కోసం ప్రయత్నించే వారు కచ్చితంగా ఉద్యోగాలు పొందుతారు. వ్యాపారంలో డబ్బులు పెట్టాలనుకున్న వాళ్లు ఈ నెలలో పెడితే చాలా లాభాలను పొందుతారు. ఉద్యోగస్తులకు అవార్డులు, రివార్డులతో పాటు ప్రమోషన్లు వచ్చే సూచనలున్నాయి.

horoscope may 2022 check your zodiac signs leo

horoscope may 2022 check your zodiac signs leo

సింహ రాశి వారికి ఈ నెల టర్నింగ్ పాయింట్ లా కనిపిస్తోంది. మీ ఆస్తి విషయాల్లో కాస్త శ్రద్ధ అవసరం, అలాగే వ్యాపార, జీవిత భాగస్వాములతో ఆచితూచి వ్యవహరించండి. మాట జారితే చాలా సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అనుకూలమైన తేదీలు, ఇబ్బందికర ఫలితాలు, చేసుకోవాల్సిన దేవతారాధన గురించి తెలుసుకోవడానికి మీరు కింది లింక్ ను క్లిక్ చేయండి. పూర్తి వీడియోను వీక్షించండి.

పూర్తి వీడియో కోసం ఇక్క‌డక్లిక్ చేయండి

pavan J

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp