Kumbha Rasi Phalalu November 2023 Telugu
Kumbha Rasi Phalalu : నవంబర్ నెలలో కుంభరాశి వారి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో నెల మొత్తం విశేషంగా యోగించాలంటే ఎలాంటి ప్రత్యేకమైన విధివిధానాలు పాటించాలో నవంబర్ నెలలో మీకు అనుకూలంగా ఉండేటటువంటి తేదీలు ఏంటో ప్రతికూలంగా ఉండేటటువంటి తేదీలు ఏంటో మనం తెలుసుకుందాం. కుంభ రాశి వాళ్ళకి నవంబర్ నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే నవంబర్ నెలలో గ్రహాల సంచారం మొత్తం అనుకూలంగా ఉంది. అందువల్ల చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో అద్భుతంగా రాణిస్తారు. ఉద్యోగ రంగంలో ఉంటే ఉద్యోగ రంగంలో బ్రహ్మాండమైన పురోభివృద్ధి కనిపిస్తుంది. ప్రమోషన్ల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తే వ్యాపార రంగంలో ఉంటే మీరు ఊహించిన దాని కంటే రెట్టింపు లాభాలు వ్యాపారంలో కనిపిస్తూ ఉంటాయి. వ్యాపారం మూడు పువ్వుల కాయలుగా విరాజిల్లుతూ ఉంటుంది. మంచి పేరు తెచ్చుకుంటారు. పోటీ పరీక్షల్లో రాణిస్తారు. కాంపిటీటివ్ ఎగ్జామ్స్ లో సక్సెస్ ఉంటుంది. కావలసిన స్కూళ్లల్లో కావలసిన కాలేజీలో ర్యాంకులు నవంబర్ నెలలో కనిపిస్తోంది.
అలాగే వ్యవహారాలన్నీ పూర్తిగా అనుకూలిస్తే ఆదాయం చాలా బాగుంటుంది. అనేకమార్గాలలో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు నవంబర్ నెలలో కుంభరాశి వాళ్లకు అనుకూలిస్తాయి. ఆరోగ్య సహకారం ఆరోగ్య లాభం ఉంటుంది. అంటే అనారోగ్య సమస్యలన్నీ తగ్గిపోతాయి. ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది. సోదర సోదరీమణుల యొక్క పరిపూర్ణమైన సహాయ సహకారాలు లభిస్తాయి. ఆ సహాయ సహకారాల వల్ల వాళ్లతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. సంతాన సౌఖ్యం ఉంటుంది. సంతానం వల్ల మీకు పేరు ప్రతిష్టలు వస్తాయి. శత్రువుల మీద విజయం సాధిస్తారు. శత్రువులను కూడా మిత్రులుగా మార్చుకుంటారు. జీవిత భాగస్వామి సహాయ సహకారాలు పూర్తిగా లభిస్తే ఉంటుంది. వాళ్ల వల్ల మంచి ప్రయోజనాలు పొందే యోగం కూడా ఉంది. అలాగే వ్యాపారులకు వ్యాపారం బాగా జరిగి స్థిరాస్తులు కొనుక్కునే యోగం కూడా ఉంది. ఉద్యోగులు అయితే ఇల్లు గాని ప్లాట్లు గాని కొనుక్కునే యోగం కూడా ఉంది.
భార్యాభర్తల మధ్య పూర్తి అవగాహన ఉంటుంది. జీవన సౌఖ్యం ఉంటుంది. ప్రయాణాలపరంగా విశేషమైన ప్రయోజనాలు కలుగుతూనే ఉంటుంది. ఈ నెలలో మీకు కలిసి వచ్చే తేదీలు నాలుగు, ఆరు, పద్నాలుగు 16, 17, 21 25 అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోండి. ఈ నెల మీకు కలిసిరాని తేదీలు 11, 19 ,23 ,27 ,29 ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు నిర్వహించకండి. అలాగే కుంభ రాశి వాళ్ళకి ఈ నెలలో వీలైనప్పుడు కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని కానీ ఆంజనేయ స్వామి ఆలయాన్ని కానీ శివాలయాన్ని కానీ వెళుతూ ఉండండి. ఇంకా అద్భుత ఫలితాలు కలుగుతాయి.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
This website uses cookies.