Aquarius Horoscope 2024 : కుంభ రాశి వారికి ఒక స్త్రీ ఆశీర్వాదం మిమ్మల్ని కష్టాల ఊబిలో నుంచి బయటపడేస్తుంది.. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Aquarius Horoscope 2024 : కుంభ రాశి వారికి ఒక స్త్రీ ఆశీర్వాదం మిమ్మల్ని కష్టాల ఊబిలో నుంచి బయటపడేస్తుంది..

 Authored By tech | The Telugu News | Updated on :3 March 2024,7:00 am

ప్రధానాంశాలు:

  •  Leo Horoscope 2024 : కుంభ రాశి వారికి ఒక స్త్రీ ఆశీర్వాదం మిమ్మల్ని కష్టాల ఊబిలో నుంచి బయటపడేస్తుంది..

  •  Leo Horoscope 2024 : పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు. రాశీ చక్రంలో కుంభరాశి 11వది. ఈ రాశి వారికి అధిపతి శని దేవుడు కాబట్టి ఈ రాశి వారికి ఎక్కువగా శని గ్రహం యొక్క అనుగ్రహం అనేది ఎక్కువగా ఉంటుంది.

  •  ఈ స్త్రీ ఆశీర్వాదంతో ఆ స్త్రీ యొక్క గ్రహస్థితి కారణంగా కూడా ఆ గ్రహస్థితి కుంభరాశి వారి మీద ఎక్కువగా ప్రభావం చూపించడం వల్ల కుంభరాశి వారికి అదృష్టవంతమైన కాలంగా మారబోతుంది.

Aquarius Horoscope 2024 : పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు. రాశీ చక్రంలో కుంభరాశి 11వది. ఈ రాశి వారికి అధిపతి శని దేవుడు కాబట్టి ఈ రాశి వారికి ఎక్కువగా శని గ్రహం యొక్క అనుగ్రహం అనేది ఎక్కువగా ఉంటుంది. కుంభ రాశి వారిని కచ్చితంగా ఒక స్త్రీ ఆశీర్వాదమైతే ఎంతో కాపాడుతుంది అనే చెప్పాలి. ఎందుకంటే ఈ సమయంలో కుంభ రాశి వారి జాతకరీత్యా కొన్ని సమస్యలు ఉంటాయి. అలాగే వీళ్ళకి విపరీతమైన కష్టాలు ముఖ్యంగా కెరియర్ కానివ్వండి.. వ్యాపార పరంగా కానివ్వండి.. వృత్తిపరంగా కానివ్వండి లేదా కుటుంబ పరంగా కానివ్వండి. ఇలా ప్రతి ఒక్క విషయంలోనూ ఈ కుంభ రాశి వారికి చాలా సమస్యలు ఉంటూ ఉంటాయి. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో ఇక అపార్ధాలు విభేదాలు ఎక్కువైపోతూ ఉంటాయి.

ఇలాంటి సమయంలో ఈ స్త్రీ ఆశీర్వాదంతో ఆ స్త్రీ యొక్క గ్రహస్థితి కారణంగా కూడా ఆ గ్రహస్థితి కుంభరాశి వారి మీద ఎక్కువగా ప్రభావం చూపించడం వల్ల కుంభరాశి వారికి అదృష్టవంతమైన కాలంగా మారబోతుంది. అయితే ఉత్సాహంగా పని చేసి వీరి యొక్క పనులను చేపడతారు. అంతే కాదండి మీరు చేపట్టిన పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఉత్సాహంగా పూర్తి చేస్తారు. కుంభ రాశి వారికి ఈ అదృష్టవంతమైన కాలం ఈ స్త్రీ ఆశీర్వాదం వల్లే కలుగుతుంది. ఇప్పటివరకు మీ ప్రతిభకు తగిన గుర్తింపు లేక బాధపడుతున్నట్లయితే ఈ క్షణం నుంచి మీకు ఈ శ్రీ ఆశీర్వాదం వల్ల మీ యొక్క ప్రతిభకి కూడా తగినంత గుర్తింపు వస్తుంది. అంతేకాదు ఆర్థిక అంశాలు కూడా అనుకూలంగా మారుతాయి. అనవసరమైన ప్రయాణాలు లేకుండా సంతోషంగా గడుపుతారు. మరి ఇంతకీ కుంభ రాశి వారి జీవితంలో ఈ స్త్రీ ఎవరు అంటే వీరి యొక్క తోబుట్టువు. కుంభరాశి వారు మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా కానివ్వండి ఖచ్చితంగా వీళ్ళకి వీరి యొక్క కారణంగా వారి యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉండడం వల్ల వారి యొక్క గ్రహస్థితి కుంభ రాశి వారి మీద విశేషంగా ఉంటుంది. ఈ కారణంగానే ఇప్పటివరకు మీ మధ్య ఉన్నటువంటి అపార్ధాలు అగాధాలు ఇంకా విభేదాల వల్ల మీరు బాధపడుతున్న వాటిని నుంచి కూడా మీకు విముక్తి కలుగుతుంది.

అంతేకాదు ఇప్పటివరకు మీరు ఎన్నో సమస్యల నుంచి బాధపడుతున్న అవన్నీటికి కూడా మీరు ఇప్పుడు స్వస్తి చెప్పబోతున్నారు. ఇంకా మీ కుటుంబ సభ్యులతో ఎంతో సంతోషకరమైనటువంటి సమయాన్ని గడుపుతారు. దాంతోపాటుగా కెరియర్ పరంగా కూడా ఇప్పటివరకు మీరు ఎలాంటి లాభాలను చవిచూడక బాధపడుతున్న కూడా ఈ యొక్క స్త్రీ కారణంగా అంటే మీ తోబుట్టువు ఆశీర్వాదం కారణంగా కచ్చితంగా వీటి నుంచి మీరు బయటపడతారు..అలాగే మీరు ఎంతో మంచి స్థితిని పొందడానికి మీ తోబుట్టువులు కారణం కాబట్టి వారికి తాంబూలం ఇచ్చి చక్కగా బట్టలు పెట్టండి. లేదు అనుకుంటే మీకు తోచినంతలోనే వారికి ఏదైనా సాయం చేయండి. ఈ విధంగా చేయడం కూడా మీకు అదృష్ట బలం అనేది మరింత పెరుగుతుంది. ఇక కుంభ రాశి వారికి శని దేవుడు అధిపతి కాబట్టి శని గ్రహానికి సంబంధించినటువంటి కొన్ని కీలకమైన పరిహారాలు చేసిన మీకు చాలా శుభకరం అనేది కలుగుతుంది. ముఖ్యంగా మీరు నల్ల సెనగలు ఎక్కువగా అలాగే నల్ల మిరియాలు మీ ఆహారంలో ఉండేలాగా చూసుకోండి. ఇవి తీసుకోవడం వల్ల మీ ఆరోగ్యంతో పాటు ఇంకా మీకు ఎంతో మంచిది అని చెప్పుకోవచ్చు. అలాగే మీరు ఎవరికైనా దానం చేయాలి అన్న నల్ల శనగలని ఎక్కువగా దానం చేయండి. కచ్చితంగా మీపై ఉన్నటువంటి దోషాలు కూడా తొలగిపోతాయి…

Advertisement
WhatsApp Group Join Now

tech

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది