Scorpio : వృశ్చిక రాశి లో పుట్టిన వారి జీవితంలో ఒక అద్భుతం జరగబోతుంది…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Scorpio : వృశ్చిక రాశి లో పుట్టిన వారి జీవితంలో ఒక అద్భుతం జరగబోతుంది…!

 Authored By jyothi | The Telugu News | Updated on :16 January 2024,8:00 am

ప్రధానాంశాలు:

  •  Scorpio : వృశ్చిక రాశి లో పుట్టిన వారి జీవితంలో ఒక అద్భుతం జరగబోతుంది...!

Scorpio : ఒకటి ,రెండు, మూడు, నాలుగు పాదాలు మరియు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వారు వృశ్చిక రాశిగా పరిగణించబడతారు. ఈ రాశి చక్రంలో ఎనిమిదవది.. ఈ రాశి అధిపతి కుజుడు. తత్వరీత్యా ఈ వృశ్చిక రాశి వారిది జన స్వభావం కాబట్టి బయటపడకుండా పనులు చక్కబెట్టుకునే స్వభావాన్ని మీరు కలిగి ఉంటారు. ముఖ్యంగా వృశ్చిక రాశిలో జన్మించిన వారి శరీరం కూడా చాలా గట్టిగా ఉంటుంది. అనగా దృఢమైన శరీరాన్ని కలిగి ఉంటారు అంతే కాకుండా కోపతాపాలు కూడా వీరికి ఎక్కువగా ఉంటాయి. జీవితంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా కానీ వాటిని ధైర్యంగా ఎదుర్కొంటారు. ఈ వృశ్చిక రాశి వారికి ముక్కు సూటిగా మాట్లాడే ధోరణి ఉంటుంది. ఏ విషయం కూడా మనసులో దాచుకోలేక పోతారు. అందువల్ల కొందరు వృశ్చిక రాశి వారిని ద్వేషిస్తూ ఉంటారు. ఈ వృశ్చిక రాశి వారు అనేక వ్యాపారాలలో విజయాన్ని సాధిస్తారు. ఒకవేళ వృశ్చిక రాశి వారు ఉద్యోగం చేస్తే కనుక వారి తోటి ఉద్యోగస్తులను తమకు అనుకూలంగా మార్చుకుంటారు. మీరు జీవితంలో ఎంతో క్రమశిక్షణతో ఉంటారు. మరియు విలువలకు ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తారు. ఏ పనిలో అయినా సరే పూర్తి క్రమశిక్షణ కలిగి ఉండటానికే ప్రయత్నం చేస్తారు. ఈ వృశ్చిక రాశి వారికి ఏకపక్ష నిర్ణయాలు దౌర్జన్యం ఇతరులను లక్షపెట్టకుండా అభిప్రాయాలను అమలు చేయడం నష్టాన్ని కలిగిస్తాయి.

సంఘ వ్యతిరేక శక్తులతో సంబంధాల వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ విషయం ఎంత త్వరగా గమనిస్తే మీకు అంత మంచిది.. భూమి, వాహనం, యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాలు వీరికి బాగా కలిసి వస్తాయి. వృత్తిపరంగా, ఉద్యోగ పరంగా నిజాయితీగా నడుస్తారు.కానీ చాడీలు చెప్పే వారి వల్ల జీవితంలో ఎక్కువగా నష్టపోతారు. సిద్ధాంతాలు రోజుకోసారి మార్చుకునే స్వభావం వీరికి ఉండదు.. జీవితంలో మంచి స్థితికి రావడానికి ఇది కారణం అవుతుంది. మంచితనం పట్టుదల అధికంగా ఉండటానికి కూడా ఇదే కారణం అవుతుంది. దైర్య సాహసాలతో చేసిన నిర్ణయాలు జీవితంలో మంచి మలుపుకు దారితీస్తాయి. మీరు అనుకున్నది తప్పకుండా సాధిస్తారు. జరిగిన సంఘటనలను మర్చిపోరు.. తగిన సమయం వచ్చినప్పుడు స్పందిస్తారు. చిరకాల మిత్రులతో భేదాభిప్రాయాలు కూడా వస్తాయి. దూరప్రాంత వ్యాపార వ్యవహారాల మీద వీరికి ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. అనుకున్నది కచ్చితంగా సాధిస్తారు. భూముల విలువ పెరగటం వల్ల జీవితంలో చక్కటి మలుపుకు దారితీస్తుంది. ఎవరిని ఒకరిని ఎప్పుడూ రక్షించడానికి అధికంగా శ్రమిస్తూనే ఉంటారు. ఈ స్థితి అనేది వీరికి జీవిత కాలం పాటు కొనసాగుతుంది. వీరి సిద్ధాంతాల కారణంగా సొంత వారితోనే విరోధం ఏర్పడుతుంది. జీవితాశయ సాధనకు ఉన్నత శిఖరాలు అధిరోహించటానికి ఎవరి అండ దండలు లేకుండా శ్రమిస్తారు.

అనుకున్నది సాధిస్తారు. ముఖ్యమైన సందర్భాల్లో బందు వర్గం వల్ల నమ్ముకున్న స్నేహితుల వల్ల ఎదురు చూసినంత సహాయం మాత్రం అందదు. ఈ కారణంగా అభివృద్ధి కొంటుపడుతుంది. సామాజిక సేవా కార్యక్రమాలు పేరును సంతృప్తిని కలిగిస్తాయి. అంతేకాకుండా వారి యొక్క కష్టసుఖాలను కూడా మీరు పంచుకుంటూ ఉంటారు. అయితే ఈ యొక్క వృశ్చిక రాశి వారి యొక్క జీవితంలో కచ్చితంగా ఒక అద్భుతం జరుగుతుంది. వీరికి వివాహమైన తర్వాత గొడవలు జరిగినప్పటికీ చాలా రోజులపాటు దూరంగా ఉన్నప్పటికీ అద్భుతం జరిగినట్లుగా వారి జీవితంలో తిరిగి వారి బంధం అనేది నిలబడుతుంది. ఈ విధంగా ఊహించని మార్పు వారి జీవితంలో కనిపిస్తుంది. ఒక అద్భుతం జరిగినట్లుగా మీరు ఒక్క జీవితంలో ఈ విధంగా వృశ్చిక రాశి వారి యొక్క జీవితంలో కష్టాలు, సుఖాలు అనేవి ఉంటాయి. అయితే వీరికి శివారాధన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన ఎంతగానో మేలు చేస్తుంది. గణపతి ఆరాధన కూడా మేలు చేస్తుంది. దానధర్మాలు చేయడం వల్ల ఎన్నో శుభ ఫలితాలు అయితే మీరు పొందుకుంటారు..

Advertisement
WhatsApp Group Join Now

jyothi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది