Zodiac Signs : ఏప్రిల్ 01 శుక్రవారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే..?

 Authored By prabhas | The Telugu News | Updated on :31 March 2022,10:40 pm

మేష రాశి ఫలాలు : కొంచెం కష్టపడాల్సిన రోజు. అప్పులు తీసుకోవడానికి ప్రయత్నిస్తారు. అన్ని రకాల వ్యాపారాలు సాధారణంగా నడుస్తాయి, అన్నదమ్ముల నుంచి సమస్యలు రావచ్చు. మహిళలకు తీవ్ర వత్తిడి. శ్రీ దుర్గా సూక్తంతో అమ్మవారి ఆరాధన చేయండి. వృషభ రాశి ఫలాలు : మీరు మంచి వార్తలు వింటారు. అనుకోని లాభాలు గడిస్తారు. వస్త్రలాభాలు,. విలువైన ఆభరణాలు కొంటారు. అందరితో కలసి సంతోషంగా గడుపుతారు. శ్రీ సూక్తంతో అమ్మవారిని ఆరాధన చేయండి.

మిధున రాశి ఫలాలు : ఈరోజు శుభ ఫలితాలు వస్తాయి. అనుకోని వారి నుంచి ప్రయోజనాలు పొందుతారు. మీరు గతంలో పెట్టుబడులకు నేడు లాభాలు రావచ్చు. ఆనందంగా కుటుంబంతో గడుపుతారు. శ్రీ లక్ష్మీదేవి ఆరాధన చేయండి. కర్కాటక రాశి ఫలాలు : ఈరోజు అనుకూలమైన ఫలితాలతో ముందుకు పోతారు. ధైర్యంతో పనులు పూర్తిచేస్తారు. అప్పులను తీరుస్తారు. ఆర్థికంగా పురోగతి. అన్ని రకాల వృత్తుల వారికి లాభదాయకంగా ఉంటుంది. ఇష్టదేవతారాధన చేయండి.

Today Horoscope april 01 2022 check your zodiac signs

Today Horoscope april 01 2022 check your zodiac signs

సింహ రాశి ఫలాలు : అనుకోని లాభాలు వస్తాయి. అప్పులు తీరుస్తారు. అక్కచెల్లల మధ్య సఖ్యత పెరుగుతుంది. కుటుంబంలో శుభవర్తాలు వింటారు. మహిలలకు అనుకోని లాభాలు. గౌరవం పెరుగుతుంది. శ్రీ లక్ష్మీదేవి ఆరాధన చేయండి.

కన్య రాశి ఫలాలు : మీరు ఇష్టమైన వారిని కలుసుకుంటారు. అప్పుల ను తీరుస్తారు. అనుకోని మార్గాల ద్వారా ఆదాయం సంపాదిస్తారు. ఆఫీస్‌లో మంచి వార్తలు వింటారు. కుటుంబంలో చక్కటి వాతావరణం. శ్రీలలితా సహస్రనామాలను వినండి.

తులా రాశి ఫలాలు : ప్రతికూలమైన రోజు. కొంచెం కష్టపడాలి. విద్యార్థులు బాగా శ్రమించాలి. అనుకోని వివాదాలకు ఆస్కారం ఉంది. అనారోగ్య సూచన. ఆర్థిక మందగమనం. మహిలలకు చికాకులు. శ్రీ శివారాధన చేయండి.

వృశ్చిక రాశి ఫలాలు : ఈరోజు ఉత్సాహంగా పనులు పూర్తిచేస్తారు. అప్పులను తీరుస్తారు. అనుకోని వారి ద్వారా శుభవార్తలు వింటారు. బంధువులు నుంచి సహాయం అందుతుంది. స్త్రీలకు మంచి వార్తలు అందుతాయి. ఇష్టదేవతారధన చేయండి.

ధనస్సు రాశి ఫలాలు : ఈరోజు దైర్యంతో మందుకుపోతారు. అనుకోని మార్గాల ద్వారా ఆదాయం పెరుగుతుంది. రాజకీయ నాయకులకు మంచి సమయం. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మహిలల కు స్వర్ణ లాభాలు. శ్రీలలితా దేవి ఆరాధన చేయండి.

మకర రాశి ఫలాలు : ఈరోజుఏ మీరు ఏ వార్త వినాలనకుంటున్నారో దాన్ని వింటారు. అర్థికంగా మంచి రోజు.పనులు వేగంగా పూర్తి చేస్తారు. విందులు వినోదాలలో పాల్గొంటారు. శ్రీ వేంకటేశ్వరస్వామి ఆరాధన చేయండి.

కుంభ రాశి ఫలాలు : ఈరోజు మీరు మంచి వార్తలు వింటారు. వత్తిడిని అధిగమించి ముందుకు పోతారు. ఉల్లాసంగా గడుపుతారు. పెద్దల నుంచి ప్రయోజనాలు పొందుతారు. మీరు చేసిన మంచి పనుల ఫలితం నేడు అందుకుంటారు. ఇష్టదేవతరాన చేయండి.

మీన రాశి ఫలాలు : ఈరోజు కొంచెం కష్టపడితే మంచి ఫలితాలు సాధిస్తారు. పెండింగ్‌ పనులు పూర్తిచేస్తారు. ఆర్థికంగా పర్వాలేదు. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. సాయంత్రం శుభవార్త వింటారు. అమ్మనాన్నల నుంచి మీకు మద్దతు లభిస్తుంది. శ్రీ దేవి ఆరాధన చేయండి.

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి