Zodiac Signs : ఏప్రిల్ 02 శనివారం ఈ రోజు మీ రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?
మేష రాశి ఫలాలు : అనందంగా ఈరోజు గడుపుతారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. అప్పలు తీరుస్తారు. అనవసర విషయాలకు దూరంగా ఉండండి. మంచి ఆహారం, విహారం. ఇష్టదేవతారాధన చేయండి. వృషభ రాశి ఫలాలు : మీకు ఈరోజు కొంచెం శ్రమతో కూడిన రోజు. ధైర్యంగా ముందుకుపోవాల్సిన రోజు. అనుకోని లాభాలు వస్తాయి. ఆర్థికంగా పర్వాలేదు. ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. అమ్మవారి ఆరాధన చేయండి.
మిధున రాశి ఫలాలు : ఈరోజు శుభప్రదమైన రోజు. కుటుంబంలో చక్కటి మార్కులు వస్తాయి. అనుకోని అతిథి రాకతో సంతోషం. విదేశీ యాన ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. మహిళలకు లాభాలు. విష్ణు సహస్రనామాలను పారాయణ చేయండి. కర్కాటక రాశి ఫలాలు : మీరు సంతోషంగా గడుపుతారు. పడ్డ కష్టానికి ప్రతిఫలం లభిస్తుంది. అనుకున్న దాని కంటే ఎక్కువ లాభాలు పొందుతారు. అమ్మనాన్నల నుంచి ఆశీర్వాదం లభిస్తుంది. శుభదినం. శ్రీ రామ తారకాన్ని కనీసం 108 సార్లు జపించండి.

Today Horoscope april 02 2022 check your zodiac signs
సింహ రాశి ఫలాలు : ఈరోజు మీకు మంచిరోజు. అనుకోని చోట నుంచి శుభవార్తలు వింటారు. ధనలాభాలు. వస్తువులు కొనుగోలు చేస్తారు. సోదరీ మణుల నుంచి మంచి వార్తలు వింటారు. శ్రీ లక్ష్మీదేవి ఆరాధన చేయండి.
కన్య రాశి ఫలాలు : నేడు అనుకోని సంఘటనలు జరుగుతాయి. కుటుంబంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. శుభ వార్తలు వింటారు. విద్యా, ఉద్యోగ విషయాలలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. శ్రీ వేంకటేశ్వరస్వామి ఆరాధన చేయండి.
తులారాశి ఫలాలు : మీకు కొంచెం కష్టమైన ఈరోజు అనుకున్న పనులు పూర్తిచేస్తారు. సానుకూలమైన వాతావరణం. సంతోషం. ఆరోగ్యం బాగుంటుంది. చాలా కాలంగా ఉన్న సమస్యలు పోతాయి. ధనలాభాలు. శ్రీ కృష్ణారాధన చేయండి.
వృశ్చిక రాశి ఫలాలు : మీరు బాగా కష్టపడాలి. శ్రమతో మీరు మంచి ఫలితాలు సాధిస్తారు. అనుకోని వారి నుంచి లాభాలు వస్తాయి. ప్రతి విషయంలో కొంచెం ఆచితూచి వ్యవహరించాలి. శ్రీ విష్ణు సహస్రనామాలను పారాయణం చేయండి.
ధనస్సు రాశి ఫలాలు : మీరు సంతోషంగా ఈరోజు గడుపుతారు. ఆనందం, ఆర్థికంగా లాభాలు. అన్నదమ్ముల నుంచి సహయ సహకారాలు అందుతాయి. దగ్గరి వారి నుంచి శుభవార్తలు వింటారు. ఇష్టదేవతారాధన చేయండి.
మకర రాశి ఫలాలు : ఈరోజు మీరు ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుపుతారు. ఏ విషయంలోనైనా తగ్గేదేలే అనే చందంగా వ్యవహరిస్తారు. కానీ మీలో అహంకారం పెరగకుండా చూసుకోవాల్సిన సమయం. అన్నదమ్ముల నుంచి మంచి సహకారం లభిస్తుంది. ఇష్టదేవతారాధన చేయండి.
కుంభ రాశి ఫలాలు : మీరు కొంత ఓపికతో వ్యవహరించాల్సిన రోజు. అప్పులు చేయకండి. అప్పులు ఎవరికి ఇవ్వకండి. ఆరోగ్య విషయం జాగ్రత్త. చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. శ్రీ వేంకటేశ్వరస్వామి ఆరాధన చేయండి.
మీన రాశి ఫలాలు : ఈరోజు మీ తెలివితేటలతో ముందుకు పోతారు. అనుకోని మార్పులు జరుగుతాయి. కుంటుంబంలో చక్కటి వాతావరణం. అమ్మమ్మ లేదా మేనమామల నుంచి ధన విషయంలో సహకారం లభిస్తుంది. మహిళలకు వస్త్రలాభాలు. శ్రీ లక్ష్మీవేంకటరమణ ఆరాధన చేయండి.