Zodiac Signs : ఏప్రిల్ 04 సోమవారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Zodiac Signs : ఏప్రిల్ 04 సోమవారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే..?

మేష రాశి ఫలాలు : ఈరోజు కొంచెం కష్టపడాల్సిన రోజు. మీ తెలివితేటలకు, ధైర్యానికి పరీక్ష. మీ నిర్ణయాలు వల్ల మీకు అనుకూల ఫలితాలు వస్తాయి. అన్ని రకాల వ్యాపారులకు లాభదాయకమైన రోజు. శ్రీలక్ష్మీదేవి ఆరాధన చేయండి.వృషభ రాశి ఫలాలు : మీరు ఈరోజు ప్రతికూల పరిస్థితులను ఎదురుకొంటారు. అప్పుల బాధలు పెరుగుతాయి. ఆర్థిక ఇబ్బందులు. కీలక నిర్ణయాలు తీసుకునేటపుడు జాగ్రత్త. మహిళలకు పని వత్తిడి. శ్రీ దుర్గాదేవి ఆరాధన చేయండి. మిధున రాశి ఫలాలు : […]

 Authored By prabhas | The Telugu News | Updated on :3 April 2022,10:40 pm

మేష రాశి ఫలాలు : ఈరోజు కొంచెం కష్టపడాల్సిన రోజు. మీ తెలివితేటలకు, ధైర్యానికి పరీక్ష. మీ నిర్ణయాలు వల్ల మీకు అనుకూల ఫలితాలు వస్తాయి. అన్ని రకాల వ్యాపారులకు లాభదాయకమైన రోజు. శ్రీలక్ష్మీదేవి ఆరాధన చేయండి.వృషభ రాశి ఫలాలు : మీరు ఈరోజు ప్రతికూల పరిస్థితులను ఎదురుకొంటారు. అప్పుల బాధలు పెరుగుతాయి. ఆర్థిక ఇబ్బందులు. కీలక నిర్ణయాలు తీసుకునేటపుడు జాగ్రత్త. మహిళలకు పని వత్తిడి. శ్రీ దుర్గాదేవి ఆరాధన చేయండి.

మిధున రాశి ఫలాలు : సానుకూలమైన ఫలితాలతో ముందుకుపోతారు. అప్పులు తీరుస్తారు. అనుకోని మార్గాల ద్వారా ఆదాయం పెరుగుతుంది. అన్నదమ్ముల నుంచి సహాయం అందుతుంది. అమ్మ తరపు వారి నుంచి శుభవార్తలు వింటారు. శ్రీ విష్ణు సహస్రనామాలను పారాయణం చేయండి. కర్కాటక రాశి ఫలాలు : మీకు తెలియని శత్రువుల నుంచి ఇబ్బందులు. అనారోగ్య సూచన కనిపిస్తుంది. ఆర్థిక మందగమనం. వ్యయప్రయాసలతో కూడిన రోజు. మహిళలకు పని భారం. శ్రీ రామ రక్షా స్తోత్రం పారాయణం చేయండి.

Today Horoscope april 04 2022 check your zodiac signs

Today Horoscope april 04 2022 check your zodiac signs

సింహ రాశి ఫలాలు : మీరు పెద్దల నిర్ణయాలు పాటిస్తే తప్పక ప్రయోజనం పొందుతారు. అనుకోని శుభవార్తలు వింటారు. అన్నదమ్ముల మధ్య కొంచెం మనస్పర్తలు వస్తాయి. సాయంత్రం నుంచి శుభవార్తలు వింటారు. శ్రీ సూక్తంతో అమ్మవారి ఆరాధన చేయండి.

కన్యారాశి ఫలాలు : అన్నింటా విజయం సాధిస్తారు. ధైర్యసహాసాలతో ముందుకు పోతారు. ప్రయాణాలతో ప్రయోజనాలు పొందుతారు. ఆర్థిక పరిస్థితిలో పురోగతి కనిపిస్తుంది. పాత బాకీలు వసూలు అవుతాయి. కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది. శ్రీ చింతామణి గణపతి ఆరాధన చేయండి.

తులారాశి ఫలాలు : ఈరోజు ఉల్లాసంగా గడుపుతారు. ఆనుకోని వారి ద్వారా ప్రయోజనాలు పొందుతారు. చాలా కాలంగా వసూలు కాని బాకీలు వసూలు అవుతాయి. మీ కుటుంబం నుంచి వచ్చిన సహకారంతో ముందుకుపోతారు. శ్రీ శివారాధన చేయండి.

వృశ్చిక రాశి ఫలాలు : కొంత ప్రశాంతత లోపిస్తుంది. అనవసర వివాదాలకు అవకాశం ఉంది. కోపాన్ని నియంత్రించుకోవాల్సిన సమయం. అన్నదమ్ముల నుంచి ఇబ్బందులు. ఆర్థిక మందగమనం. ప్రయాణ చికాకులు. మహిళలకు సమస్యలు. శ్రీ రాజశ్యామలా అమ్మవారి ఆరాధన చేయండి.

ధనస్సు రాశి ఫలాలు : మీరు శుభఫలితాలను పొందుతారు. అన్ని విషయాలలో చక్కటి మార్పులు. శుభపరినామాలు. ఆర్థికంగా సంతోషం. వ్యాపార లావాదేవీలు లాభదాయకం. మహిళలకు మంచి కీర్తి ప్రతిష్టలు. శ్రీ శివాభిషేకం మంచి ఫలితాన్నిస్తుంది.

మకర రాశి ఫలాలు : కొంచెం మంచి, కొంచెం చెడు ఫలితాలతో ఈరోజు గడుస్తుంది. ప్రారంభం కొంచెం ఇబ్బంది పడ్డా సాయంత్రానికి అన్ని సర్దుకొంటాయి. విలువైన వస్తువులు కొంటారు. ఆర్థిక సంతోషం. అన్నదమ్ముల నుంచి మంచి సహాయం. విదేశీ ప్రయత్నాలు సఫలీకృతం. ఇష్టదేవతరాధన చేయండి.

కుంభ రాశి ఫలాలు : అనుకోని లాభాలు కలుగే రోజు. ఆర్తికంగా చక్కటి శుభ ఫలితాలు. అమ్మ తరపు వారి నుంచి శుభవార్తలు. వివాహప్రయత్నాలకు అనుకూలం. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఆకస్మిక లాభాలు. శ్రీ హేరంబ గణపతి ఆరాధన చేయండి.

మీన రాశి ఫలాలు : కొంచెం కష్టపడాల్సిన రోజు. ఆర్థికంగా సాధారణంగా ఉంటుంది. విలువైన వస్తువుల విషయంలోజాగ్రతలు తప్పనిసరి. ప్రయాణాలలో చికాకులు. మాటపట్టింపులకు దూరంగా ఉండండి. మహిళలకు పని భారం . శ్రీ కాలభైరావాష్టకం పారాయణం చేయండి.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది