Zodiac Signs : ఏప్రిల్‌ 08 శుక్రవారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Zodiac Signs : ఏప్రిల్‌ 08 శుక్రవారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే..?

మేష రాశిఫలాలు : మీరు చక్కటి శుభఫలితాలు సాధిస్తారు. అనుకున్న పనులు వేగంగా పూర్తిచేస్తారు. అన్ని రకాల వృత్తుల వారు సంతోషంగా ముందుకు పోతారు,. వ్యాపారాలు లాభాలు గడిస్తారు. కుటుంబంలో మార్పులు. శ్రీరామ రక్షా స్తోత్రం పారాయణం చేయండి. వృషభ రాశి ఫలాలు : పనులు చేసేటప్పుడు ఓపికతో ముందుకు పోండి. అనుకున్న పరిస్థితులు కలసి రావు. కుటుంబంలో సమస్యలు వస్తాయి. మంచి సమయం కోసం ఓపికతో ఉండాలి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. మిత్రులతో ప్రయోజనాలు పొందుతారు. […]

 Authored By prabhas | The Telugu News | Updated on :7 April 2022,10:40 pm

మేష రాశిఫలాలు : మీరు చక్కటి శుభఫలితాలు సాధిస్తారు. అనుకున్న పనులు వేగంగా పూర్తిచేస్తారు. అన్ని రకాల వృత్తుల వారు సంతోషంగా ముందుకు పోతారు,. వ్యాపారాలు లాభాలు గడిస్తారు. కుటుంబంలో మార్పులు. శ్రీరామ రక్షా స్తోత్రం పారాయణం చేయండి. వృషభ రాశి ఫలాలు : పనులు చేసేటప్పుడు ఓపికతో ముందుకు పోండి. అనుకున్న పరిస్థితులు కలసి రావు. కుటుంబంలో సమస్యలు వస్తాయి. మంచి సమయం కోసం ఓపికతో ఉండాలి.
ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. మిత్రులతో ప్రయోజనాలు పొందుతారు. శ్రీ లలితాదేవి ఆరాధన చేయండి.

మిధున రాశి ఫలాలు : అనుకున్న పనులు పూర్తిచేస్తారు. అప్పులు తీరుస్తారు. ఆనందంగా కాలం గడిచిపోతుంది. విందులు, వినోదాలు, సంతోషం, ఉత్సాహం నిండిన రోజు. ఇష్టదేవతారాధన చేయండి.కర్కాటక రాశి ఫలాలు : మీరు కొంచెం శ్రమించాల్సిన రోజు. ఆర్థికంగా మందగమన పరిస్థితి. వ్యాపారాలు నెమ్మదిస్తాయి. అనుకున్న పనులు చేయలేక పోతారు. చికాకులు, శారీరక అలసట, మహిలలకు చికాకులు. శ్రీ లలితా దేవి సహస్రనామాలను పారాయణం చేయండి.

Today Horoscope april 08 2022 check your zodiac signs

Today Horoscope april 08 2022 check your zodiac signs

సింహ రాశిఫలాలు : అనుకున్న దానికంటే వేగంగా అన్నింటా ముందుకుపోతారు. అప్పుల బాధలు తగ్గుతాయి. కుటుంబంలో సంతోషం, పిల్లల ద్వారా శుభవార్తలు వింటారు. అతిథి రాకతో సంతోషం. సందడి. మహిళలకు శుభ వార్తలు. ఇష్టదేవతరాధన చేయండి.

కన్యా రాశిఫలాలు : మీరు కొంచెం తెలివి, ధైర్యం ప్రదర్శిస్తే ఈరోజు మీ సొంతం అవుతుంది. ఆర్థికంగా పురోగతి కనిపిస్తుంది. ఆవకాలు వస్తాయి వాటిని వినియోగించుకోవడం ముఖ్యం. పెద్దల ద్వారా శుభవార్తలు వింటారు. శ్రీ రామ జయరామ జయజయ రామ అనే నామాన్ని కనీసం 108 సార్లు పారాయణం చేయండి.

తులారాశి ఫలాలు : మీరు వేగంగా పనులు పూర్తిచేస్తారు. కుటుంబంలో శుభకార్య యోచన చేస్తారు. అన్నదమ్ముల నుంచి శుభవార్తలు వింటారు. ఆర్థికంగా చక్కటి ఫలితాలు. ప్రయాణ సూచన. మహిలలకు వస్త్రు లాభం. శ్రీ లలితాదేవి ఆరాధన చేయండి.

వృశ్చికరాశి ఫలాలు : కొంచెం కష్టపడాల్సిన రోజు. వివాదాలకు దూరంగా ఉండండి. అనుకున్న పనులు చేయలేక పోతారు. విందులు, వినోదాలకు దూరంగా ఉండాల్సిన రోజు. అనవసర ఖర్చులు వస్తాయి. మహిలలకు పని వత్తిడి. శ్రీ దుర్గాదేవి ఆరాధన చేయండి.

ధనస్సురాశి ఫలాలు : చక్కటి శుభదినం. అనుకుని మార్గాల ద్వారా ఆదాయం వస్తుంది. రుణ బాధలు తీరుతాయి. కుటుంబంలో సంతోషం, వృత్తి వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. మహిళలకు అనుకోని లాభాలు పొందుతారు. శ్రీ సంతోషి మాతా ఆరాధన చేయండి.

మకర రాశి ఫలాలు : ఆర్థిక విషయాలలో పురోగతి కనిపిస్తుంది. అనుకున్న దానికంటే ముందే పనులు పూర్తిచేస్తారు. అప్పులు తీరుస్తారు. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఇంట్లో అందరు ఆనందంగా గడుపుతారు. మహిలలకు లాభదాయకమైన రోజు. శ్రీ కామాక్షీ అమ్మవారి ఆరాధన చేయండి.

కుంభ రాశిఫలాలు : ప్రతి పనిని ఆలోచించి చేయాల్సిన రోజు. ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. వ్యాపర లావాదేవీలు సాధారణంగా నడుస్తాయి. ఇంట్లో, బయటా కొంచెం శ్రమించాల్సిన సమయం. విద్యా, ఉద్యోగ విషయాలు సానుకూలం. ఇష్టదేవతారధన చేయండి.

మీన రాశి ఫలాలు : శ్రమతో విజయం సాధిస్తారు. అర్థికంగా పర్వాలేదు. అనవసర ఖర్చులు వస్తాయి. కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది. మిత్రుల సహకారంతో ముందుకుపోతారు. వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరించండి. మహిలలకు ధనలాభ సూచన. శ్రీ సూక్తంతో అమ్మవారి ఆరాధన చేయండి.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది