Zodiac Signs : ఏప్రిల్ 16 శనివారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే….?

Authored By Prahbas Gilakathula | The Telugu News | Updated on : 15 April 2022, 10:40 pm

మేషరాశి ఫలాలు : మీరు అనుకున్నవి సాఫీగా జరుగవు. ఆటంకాలతో చికాకులు. అనుకోని ఖర్చులు వస్తాయి. నియంత్రణ లేని రోజుగా మిగిలిపోయే అవకాశం ఉంది. ఇంటా, బయటా మీరు కొంత ఇబ్బంది పడే అవకాశం. మహిలలకు పని భారం పెరుగుతుంది. గోసేవ, నవగ్రహ ప్రదక్షణ చేయండి. వృషభరాశి ఫలాలు : అనుకున్న వాటిని అధిగమిస్తారు. ఆదాయం పెరుగుతుంది. కుటుంబంలో సఖ్యత, సంతోషం. ఆర్థిక విషయాలు పర్వాలేదు. అనుకున్న సమయానికి మీరు పనులు పూర్తిచేస్తారు. విద్యా, ఉద్యోగ విషయాలు సాధారనంగా ఉంటాయి. శ్రీ వేంకటేశ్వరస్వామి ఆరాధన చేయండి.

మిధునరాశి ఫలాలు : అప్పులు తీరుస్తారు. శుభవార్తలు వింటారు. అనుకోని అతిథి రాకతో సంతోషం. ప్రేమికులకు మంచి వార్తలు. ఆరోగ్యం, ఆనందం మీ సొంతం, ప్రయాణాల వల్ల ఉత్సాహం కలుగుతుంది. మహిళలకు శుభవార్తలు. ఆంజనేయారాధన చేయండి. కర్కాటకరాశి ఫలాలు : అనుకోని ఆటంకాలతో పనులు పూర్తిచేయలేక పోతారు. కుటుంబంలో అనుకోని మార్పులు. అన్నదమ్ముల నుంచి వత్తిడులు వస్తాయి. ఉద్యోగ బాధ్యతలు పెరుగుతాయి. విద్యా, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. అమ్మవారి దేవాలయంలో పూజ, ప్రదక్షణలు చేయండి మంచి ఫలితాలు వస్తాయి.

Today Horoscope april 16 2022 check your zodiac signs

Today Horoscope april 16 2022 check your zodiac signs

సింహరాశి ఫలాలు ; అనుకోని లాభాలు వస్తాయి. అన్నింటా శుభ ఫలితాలు సాధిస్తారు. విలువైన వస్తువులు, వాహనాల కొనుగోలకు ప్రయత్నిస్తారు. పెట్టుబడులు పెట్టడానికి అనుకూలమైన రోజు. విందులు, వినోదాలు. ఇష్టదేవతారాధన చేయండి.

కన్యారాశి ఫలాలు : అనుకోని వివాదాలు వస్తాయి. సమస్యలు వచ్చినా మీరు ధైర్యంతో ముందుకుపోతారు. మీ మనస్సు ప్రశాంతత కల్పోతుంది. అప్పులు తీర్చడానికి ప్రయత్నించినా సాధ్యంకాదు. బంధువుల నుంచి వత్తిడి, విద్యా, ఉద్యోగ, వ్యాపార విషయాలు సామాన్యంగా ఉంటాయి. శ్రీ హనుమాన్‌ చాలీసా పారాయణం, దేవాలయంలో ప్రదక్షణలు చేయండి.

తులారాశి ఫలాలు : మీరు మంచి వార్తలు వింటారు. అనుకోని వారి నుంచి ప్రయోజనాలు, లాభాలు వస్తాయి. విద్యా, ఉద్యోగ సంబంధ విషయాలలో అనుకూలమైన ఫలితాలు. ఆభరణాలు కొనుగోలు కొంటారు. మహిళలకు వస్త్రలాభం. అమ్మ తరపు వారి నుంచి లాభాలు. ఆంజనేయస్వామి దండకం పారాయణం చేయండి.

వృశ్చికరాశి ఫలాలు : మంచి శుభదినం. కుటుంబంలో సంతోష వాతావరణం. అనుకోని లాభాలు, ఆదాయం పెరుగుతుంది. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. శుభకార్య ఆలోచనలు చేస్తారు. అన్ని రకాలుగా బాగుంటుంది. శ్రీ విష్ణు సహస్రనామాలను పారాయణం చేయండి.

ధనుస్సురాశి ఫలాలు : మిశ్రమంగా ఉంటుంది. రోజు గడుస్తున్న కొద్ది మంచి ఫలితాలు వస్తాయి. ఆర్థికంగా సామాన్యమైన స్థితి, అప్పులు తీరుస్తారు. అనుకోని ఖర్చులు, వృథా ప్రయాసలు చేస్తారు. ఆడంబరాల కోసం ఖర్చు చేసి బాధపడుతారు. మిత్రుల ద్వారా నష్టాలు. కుటుంబంలో అనైక్యత. శ్రీ ఆంజనేయాస్వామి దేవాయలంలో ప్రదక్షణలు, సింధూర ధారణ చేయండి.

మకరరాశి ఫలాలు : మీరు చేసే పనులలో జాప్యం బాగా జరుగుతుంది. అనుకోని ఖర్చులు వస్తాయి. పిల్లల ద్వారా చికాకులు పెరుగుతాయి.ప్రయాణ అలసట, అనారోగ్య సూచన. ధన సంబంధ విషయాలు సాధారణంగా ఉంటాయి. మహిలలకు పని భారం. శ్రీ విష్ణు ఆరాధన చేయండి.

కుంభరాశి ఫలాలు : అనుకున్న పనులు పూర్తిచేస్తారు. అప్పులు తీర్చడానికి ప్రయత్నిస్తారు. ధనలాభాలు, సోదరీ,సోదరుల ద్వారా మంచి వార్తలు, లాభాలు పొందుతారు. ఉల్లాసంగా గడుపుతారు,. ఆఫీస్‌, వ్యాపారం, విద్యా అన్నింటా అనుకూలతలు ఉంటాయి. ఇష్టదేవతరాధన చేయండి.

మీనరాశి ఫలాలు : మీకు పెద్దల ద్వారా ముఖ్య విషయాలు తెలుస్తాయి. భవిష్యత్‌ ఆలోచనలు చేస్తారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారు అనుకూలమైన నిర్ణయాలు తీసుకోంటారు. ఆర్థిక పురోగతి, అన్నదమ్ముల నుంచి సహకారం. విద్యా, ఉద్యోగ విషయాలు సానుకూలం. శ్రీ లక్ష్మీదేవి ఆరాదన చేయండి.

Advertisement

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి