Zodiac Signs : ఏప్రిల్ 19 మంగళవారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే….?

Authored By Prahbas Gilakathula | The Telugu News | Updated on : 18 April 2022, 10:40 pm

మేష రాశి ఫలాలు : మీరు తీసుకునే నిర్ణయాలు అత్యంత లాభదాయకంగా మారుతాయి, అనుకోని వారి నుంచి శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యాపారాలు మంచిగా ఉంటాయి. అనుకున్న పనులు సకాలంలోపూర్తిచేస్తారు. ఇష్టదేవతారాధన చేయండి. వృషభ రాశి ఫలాలు : మీకు శుభవార్తా శ్రవణం. అన్నదమ్ముల నుంచి సహాయం అందుతుంది. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. అప్పులు తీరుస్తారు. ఆనందంగా గడుపుతారు. కుటుంబంలో సంతోష వాతావరణం. మహిళలకు మంచి రోజు. శ్రీ కుజగ్రహారాధన చేయండి.

మిథున రాశి ఫలాలు : అనుకోని సమస్యలు వెంటాడుతాయి. అప్పుల కోసం ప్రయత్నం, విద్యా, వ్యాపారం, ఉద్యోగ విషయాలు సాధారణంగా ఉంటాయి. ఆఫీస్లో మీరు బాగా శ్రమించాల్సిన రోజు. మహిళలకు పని వత్తిడి, అనారోగ్య సూచన. శ్రీ సుబ్రమణ్య భుజంగం చదవుకోండి. కర్కాటక రాశి ఫలాలు : మిశ్రమంగా ఉంటుంది. ఆనుకోని ఖర్చులు వస్తాయి. బంధువుల నుంచి వత్తిడులు, ఆఫీస్‌లో, ఇంట్లో కూడా సమస్యలు మీ వెంటే వస్తాయి. అనుకోని ప్రయాణాలు. మహిళలకు ఆనారోగ్య సూచన. నవగ్రహారాధన చేయండి.

Today Horoscope april 19 2022 check your zodiac signs

Today Horoscope april 19 2022 check your zodiac signs

సింహ రాశి ఫలాలు : ఉల్లాసంగా గడుపుతారు. ఆనుకోని మార్గాల ద్వారా ఆదాయాన్ని ఆర్జిస్తారు. అక్కచెల్లల ద్వారా శుభవార్తలు వింటారు. అప్పులను తీర్చడానికి ప్రయత్నిస్తారు. తల్లి తరపు వారి నుంచి ప్రయోజనాలు పొందుతారు. శ్రీ ఆంజనేయారాధన చేయండి.

కన్య రాశి ఫలాలు : అప్పుల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధువుల ద్వారా మంచి వార్తలు వింటారు. కుటుంబంలో అనుకోని మార్పులు జరుగుతాయి. మిత్రులతో కలసి విందులు, వినోదాలలో పాల్గొంటారు. శ్రీ హనుమాన్‌ ఆరాధన చేయండి.

తులారాశి ఫలాలు : ధైర్యంతో పనులు పూర్తిచేస్తారు. ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా వ్యవహరించడం ఈరోజు ప్రత్యేకత. గ్రహాల చలనాల రీత్యా మీరు చేసే అన్ని పనులలో విజయం సాధిస్తారు. ఆర్థికంగా మంచి ఫలితాలు సాధిస్తారు. మహిళలకు శుభదినం. శ్రీ లక్ష్మీదేవి ఆరాధన చేయండి.ఎటువంటి పరిస్థితులనైనా అధిగమిస్తారు. ఆధ్యాత్మిక చింతన. పనులు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఇబ్బంది పరుస్తాయి.

వృశ్చికరాశి ఫలాలు : ఇంట్లో, బయటా మీపై భారం పెరుగుతుంది. మీరు చేసిన మంచిని మరచి మిత్రులు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఆర్థిక మందగమనం. అప్పుల కోసం ప్రయత్నం. ప్రయాణ చికాకులు. శ్రీ కాళీ అమ్మవారి ఆరాధన చేయండి.

ధనుస్సు రాశి ఫలాలు : ప్రతి విషయంలో మీరు చూపే తెలివితేటల వల్ల విజయం సాధించగలుగుతారు. కుటుంబంలో పెద్దల వల్ల లాభాలు పొందుతారు. పాత బాకీలు వసూలు అవుతాయి. అనుకోని వారి నుంచి ఆర్థిక లాభాలు గడిస్తారు. మహిలలకు మంచిరోజు. అమ్మవారి ఆరాధన చేయండి.

మకర రాశి ఫలాలు : మీకు చక్కటి శుభదినం ఈరోజు. అనుకోని చోట నుంచి శుభవార్తలు వింటారు. ఆర్థిక విషయాలలో మంచి పురోగతి కనిపిస్తుంది. అప్పులు తీరుస్తారు. మహిలలకు వస్త్రలాభ సూచన. ఇష్టదేవతారాధన చేయండి.

కుంభ రాశి ఫలాలు : మీరు చేసిన పనులలో విజయం సాధిస్తారు. విద్యా, ఉద్యోగ విషయాలు సానుకూలం. ఆటంకాలను ధైర్యంగా అదిగమిస్తారు. అనుకోని అతిథి రాకతో ఇంట్లో సందడి. మహిళలకు స్వర్ణలాభాలు. శ్రీ దుర్గా ఆరాధన చేయండి.

మీనరాశి ఫలాలు ; అశ నిరాశలతో ఈరోజు గడుస్తుంది. కొంచెం శ్రమతో కూడిన రోజు. ఆకస్మిక ప్రయాణాలు, అప్పులు తీసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఇంటా, బయటా మీరు ధైర్యంతో తెలివితో వ్యవహరిస్తారు. ఆంజనేయస్వామి దండకం చదువుకోండి. సన్నిహితులతో విభేదాలు. ఆర్థికంగా కొంత నిరాశ. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు అంతంత మాత్రంగా ఉంటాయి.

Advertisement

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

  1. "Jana Nayagan Movie Review : దళపతి విజయ్ జన నాయగన్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్‌..!"

  2. "Karthika Deepam 2 Today Episode 2026 July 23 : కార్తీక దీపం 2.. మాలినీ మాస్టర్ ప్లాన్‌కు శివన్నారాయణ షాకింగ్ కౌంటర్.. చివర్లో ఊహించని ట్విస్ట్..!"

  3. "Gold Rate Today : మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. రూ.40 వేల తక్కువగానే ఉంది.. కొనాలనుకునేవారికి ఇదే ఛాన్స్ ?"

  4. "Telangana Heavy Rain : తెలంగాణలో మరో 48 గంటలు కుండపోత ఖాయం.. ఈ జిల్లాలు జాగ్రత్త IMD!"

  5. "Yawning : ఎదుటివారు ఆవలిస్తే మనకూ ఎందుకు ఆవలింత వస్తుంది? 99% ఎవ‌రికి తెలియ‌దు..!"

  6. "Rainy Season Vegetables : వర్షాకాలంలో ఈ 4 కూరగాయలు తింటే డాక్టర్ల దగ్గరకు వెళ్లాల్సిందే..!"

  7. "Ravi Teja : అచ్చం రవితేజనే అనుకుంటారు.. ఈ వ్యక్తి వీడియో చూసి షాక్ అవుతున్న నెటిజన్లు!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి