Zodiac Signs : ఏప్రిల్ 20 బుధవారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే….?

Authored By Prahbas Gilakathula | The Telugu News | Published on: April 19, 2022, 10:40 pm

మేషరాశి ఫలాలు : అనుకోని మార్పులతో సానుకూల ఫలితాలు సాధిస్తారు. అందరితో సఖ్యతగా గడుపుతారు. వ్యాపార లావాదేవీలు లాభదాయకంగా సాగుతాయి. చేసే పనులు పూర్తిచేస్తారు. విద్యా, ఉద్యోగ విషయాలు అనుకూలం. ఇష్టదేవతరాధన చేయండి. వృషభరాశి ఫలాలు : మీరు చక్కటి శుభ ఫలితాలను పొందుతారు. ఆనందంగా గడుపుతారు. శుభకార్య ప్రయత్నాలు చేస్తారు. అన్నదమ్ముల నుంచి మంచి వార్తలు వింటారు. సమాజంలో మంచి గౌరవం పొందుతారు. మహిళలకు లాభాలు. శ్రీ రామ రక్షా స్తోత్రం పారాయణం చేయండి.

మిధునరాశి ఫలాలు : మిశ్రమంగా ఉంటుంది. ఆర్థిక విషయాలలో మందగమనం. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. కుటుంబంలో అనుకోని సమస్యలు. సాయంత్రం నుంచి కొంచెం మంచి వాతావరణం. మహిళలకు స్వర్ణలాభాలు. శ్రీ దుర్గాదేవి ఆరాధన చేయండి. కర్కాటకరాశి ఫలాలు : అనుకోని బాధలు పడుతారు. ఆర్థిక విషయాలు నెమ్మదిస్తాయి. కుటుంబంలో సఖ్యత లోపిస్తుంది. అన్నదమ్ములతో విబేధాలు. ఇంటా, బయటా ఒత్తిడులు. మహిళలకు పని భారం పెరుగుతుంది. శ్రీ సుబ్రమణ్య స్వామి ఆరాధన మంచి ఫలితాన్నిస్తుంది.

Today Horoscope april 20 2022 check your zodiac signs

Today Horoscope april 20 2022 check your zodiac signs

సింహరాశి ఫలాలు : అనుకోని లాభాలు వస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య సహాయ సహకారాలు మరింత పెరుగుతాయి. అనుకోని ప్రయాణాలు. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఆర్థిక విషయాలు అనుకూలం. అన్నింటా విజయం. శ్రీ లలితాదేవి ఆరాధన చేయండి.

కన్యారాశి ఫలాలు : రు చాలా కాలంగా వేచి చూస్తున్న శుభ వార్తలు వింటారు. అనారోగ్యం నుంచి బయట పడుతారు. పెద్దల వల్ల మంచి ప్రయోజనాలు పొందుతారు. ఆర్తిక పరిస్థితి లాభదాయకంగా ఉంటుంది. కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది. ఇష్టదేవతారాధన చేయండి.

తులారాశి ఫలాలు : అన్ని రకాల వృత్తుల వారికి సానుకూలమైన రోజు. ఆర్థిక విషయాలు పురోగతి బాటలో నడుస్తాయి. పక్కవారితో సఖ్యత, సహకారం పెరుగుతుంది. వాహనాలను కొనే ప్రయత్నం. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. అన్నిరకాలుగా బాగుంటుంది. శ్రీ గణపతి ఆరాధనచేయండి.

వృశ్చికరాశి ఫలాలు : టా, బయటా అనుకూలమైన ఫలితాల కోసం కష్టపడాల్సిన సమయం. అప్పుల కోసం ప్రయత్నం. ఆఫీస్‌లో పై అధికారుల వత్తిడి. వాహనాలను జాగ్రత్తగా నడపాలి. అనవసర ఖర్చులు. మహిళలకు చికాకులు. శ్రీ చింతామణి గణపతి ఆరాధన చేయండి.

ధనుస్సురాశి ఫలాలు :  తెలివితేటలతో ఈరోజు ముందుకుసాగుతుంది. అప్పులు తీరుస్తారు. అనుకోని వారి నుంచి ప్రయోజనాలు పొందుతారు. దూరపు ప్రాంతం నుంచి శుభవార్తలు వింటారు. కుటుంబంలో సానుకూలమైన మార్పులు. అమ్మవారి ఆరాధన చేయండి.

మకరరాశి ఫలాలు
చక్కటి ఉల్లాసవంతమైన రోజు. అనుకున్న పనులను వేగంగా పూర్తి చేస్తారు. పెద్దల మాటలు విని లాభాలు ఆర్జిస్తారు. ఆర్థికంగా మంచి రోజు. కొత్త అవకాశాలు. ప్రయాణాల వల్ల లాభాలు.
మిత్రుల కలయిక. విష్ణు ఆరాధన చేయండి.

కుంభరాశి ఫలాలు : ప్రతికూల వాతావరణం. అనుకోని ఖర్చులు పెరుగుతాయి. అప్పులు చేస్తారు. ఇంటా, బయటా మీరు శ్రమించాల్సిన రోజు ఆర్థిక మందగమనం. వివాదాలకు అవకాశం జాగ్రత్త. మహిళలకు శుభవార్తలు వింటారు. శ్రీ రామ రక్షా స్తోత్రం పారాయణం చేయండి.

మీనరాశి ఫలాలు : నిరాశజనకంగా ఉంటుంది ఈరోజు. ఆర్థిక మందగమనం. చికాకులు. అనారోగ్య సమస్యలు రావచ్చు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు. శ్రీ లలితా దేవి ఆరాధన చేయండి.

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp