Zodiac Signs : ఆగస్టు 03 బుధవారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే….?

మేషరాశి ఫలాలు : అన్నింటా మీరు లాభాలను గడిస్తారు. ఆదాయం పెరుగుతుంది. విలువైన వస్తువులను కొంటారు. ఆకస్మిక ప్రయాణ సూచన. వ్యాపారులకు ధనలాభం. వివాహ ప్రనయత్నాలు ఫలిస్తాయి. మహిళలు ముందడుగు వేస్తారు. శ్రీ గణపతి ఆరాధన చేయండి. వృషభ రాశి ఫలాలు : అన్నింటా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ చివరకు మీరు చేసే పనులను మాత్రం పూర్తి చేస్తారు. కొత్తగా రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. మిత్రలతో విభేదాలు. ఆనారోగ్య సమస్యలు. మహిళలకు ఒత్తిడులు. శ్రీ శక్తి గణపతి ఆరాధన చేయండి.

మిథున రాశి ఫలాలు : మీరు చేసే పనులు సత్వరంగా పూర్తిచేయడానికి బాగా శ్రమించాలి. ఆనందంగా గడపటానికి ప్లాన్‌ చేసుకుంటారు. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వ్యయప్రయాసలతో కూడిన రోజు. అయినా మీరు ఈరోజు మందుకుపోతారు. ఆర్థిక పురోగతి కనిపిస్తుంది. శ్రీ లక్ష్మీగణపతి ఆరాధన చేయండి. కర్కాటక రాశి ఫలాలు : ఈరోజు అనుకోని వ్యక్తుల ద్వారా మీకు మంచి జరుగుతుంది. కొత్త అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్థికంగా మంచి రోజు. ఈరోజు ధనలాభాలు వస్తాయి. వ్యాపారాలలో ఇబ్బందులు పోతాయి. విద్య, ఉద్యోగ విషయాలలో సానుకూల ఫలితాలు వస్తాయి. శ్రీ రామ రక్షా స్తోత్రం పారాయణం చేయండి.

Today Horoscope August 03 2022 Check Your Zodiac Signs

సింహ రాశి ఫలాలు : ఈరోజు చాలా సానుకూలమైన రోజు. ఆర్థిక లాభాలు వస్తాయి, విదేశీ ప్రయాణాలు పలిస్తాయి. ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. విందులు, వినోదాలకు హాజరవుతారు. ఉద్యోగాలలో, ఉపాధి అవకాశాలలో చక్కటి రోజు. శ్రీ గణపతికి గరికతో పూజ చేయండి.

కన్యారాశి ఫలాలు : అన్నింటా మీరు జయం సాధిస్తారు. ఇంట్లో శుభకార్య ఆలోచన చేస్తారు, వివాహ ప్రయత్నం చేస్తారు అది ఫలించడానికి అవకాశం ఉంది. వివాదాలు పరిష్కారం అవుతాయి. అన్నింటా సంతోషకరమైన రోజు. ఇష్టదేవతారాదన చేయండి.

తులారాశి ఫలాలు : కొద్దిగా ఇబ్బంది పడుతారు. అనారోగ్య సూచన. ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. విద్య, ఉద్యోగ విషయాలలో శ్రమతో కూడిన రోజు. మంచి చేద్దామనుకున్నా మీరు ముందుకు పోలేకపోతారు. అర్థిక విషయాలలో సానుకూలత తక్కవగా ఉంటుంది. మంచి ఫలితాల కోసం శ్రీ అనుజ్ఞ గణపతి ఆరాధన చేయండి.

వృశ్చిక రాశి ఫలాలు : మీరు మిత్రులతో,బంధువులతో కలసి ప్రయాణం చేసే అవకాశం ఉంది. వారితో చేసే ప్రయాణంలో లాభాలు పొందుతారు. అన్ని రకాల వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఆర్థికంగా చక్కటి రోజు. ఆఫీస్‌లో సమస్యలు తీరతాయి. ఆకస్మిక ధనలాభం. శ్రీ రామ తారకాన్ని జపించండి.

ధనుస్సు రాశి ఫలాలు : ఈరోజు చాలా శుభదినం. అన్నింటా జయం కలుగుతుంది. విద్య, ఉద్యోగ విషయాలలో చక్కటి ఫలితాలు సాధిస్తారు. అనేక రకాలుగా ధనలాభాలు వస్తాయి. బంగారు, వస్త్రలు కొంటారు. అనుకోని విషయాలు తెలుస్తాయి. విదేశీ వ్యవహారాలలో సానుకూలత కనిపిస్తుంది. శ్రీ లక్ష్మీగణపతి దేవాలయంలో ప్రదక్షణలు లేదా ఆరాధన చేయండి.

మకర రాశి ఫలాలు : అన్నింటా ఆటంకాలు వస్తాయి. ధైర్యంతో ముందుకుపోవాలి. వివాహ ప్రయత్నాలు మాత్రం ఫలిస్తాయి. ఆరోగ్యం కోసం తగు జాగ్రత్తలు తీసుకోండి. అనుకోని వివాదాలకు అవకాశం ఉంది. ఆర్థిక విషయాలలో ఇబ్బంది. శ్రీ కాలభైరావాష్టకం పారాయణం చేయండి.

కుంభ రాశి ఫలాలు : అనుకోని విధంగా మీరు ముందుకుపోతారు. ఊహించని ఫలితాలు సాధిస్తారు. ఆర్థికంగా మంచి ఫలితాలు సాధిస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. మిత్రులతో విభేదాలు కానీ వాటిని పరిష్కరించుకుంటారు. మహిళలకు లాభాలు. శ్రీ దుర్గాదేవి ఆరాధన చేయండి.

మీనరాశి ఫలాలు : కొద్దిగా మంచి, కొద్దిగా చెడుతో కూడిన రోజు. అహారం, విహారం విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. విలువైన వస్తువులను జాగ్రత్తగా ఉంచుకోండి దొంగతనానికి అవకాశం ఉంది. పెద్దల మాట వినక నష్టపోతారు. ఆర్థికంగా పర్వాలేదు. వ్యాపారులకు మాత్రం లాభాలు. మహిళలకు పని వత్తిడి కానీ దానికంటే ఎక్కువ గౌరవం, కీర్తి లభిస్తాయి. ఇష్టదేవతరాధన చేయండి.

Share

Recent Posts

Amala Paul : నా భ‌ర్తకి నేను హీరోయిన్ అనే విష‌యం తెలియ‌దు అంటూ బాంబ్ పేల్చిన అమ‌లాపాల్..!

Amala Paul : తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించింది అమ‌లాపాల్‌. తెలుగులో ఆరు సినిమాలే…

8 hours ago

Jr Ntr : ఆప‌రేష‌న్ సిందూర్ త‌ర్వాత ఎన్టీఆర్‌ని ఇంత దారుణంగా ట్రోల్ చేస్తున్నారేంటి ?

Jr Ntr : ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్తాన్‌‌పై భారత్ క్షిపణి దాడులు చేసిన విష‌యం మ‌నంద‌ర‌కి తెలిసిందే.. పాకిస్తాన్‌తో…

9 hours ago

Samantha : పెళ్ల‌య్యాక బుద్దొచ్చింది.. నాగ చైత‌న్య చేసిందేమి లేద‌న్న స‌మంత‌..!

Samantha : ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగ చైత‌న్య‌-స‌మంత‌లు ఊహించ‌ని విధంగా విడాకులు తీసుకున్నారు. వారు విడిపోయి చాలా ఏళ్లు…

10 hours ago

Types Of Kisses : శ‌రీరంపై మీరు పెట్టుకునే ముద్దుతో అవ‌త‌లి వ్య‌క్తిపై మీ ప్రేమ‌ను చెప్పొచ్చు తెలుసా?

Types Of Kisses : ఒక సాధారణ ముద్దు ప్రేమ, శ్రద్ధ, ప్రశంసల భావోద్వేగాలను రేకెత్తిస్తుంది. ఇది మీ కడుపులో…

11 hours ago

Dinner Before 7 pm : రాత్రి భోజ‌నం 7 గంట‌ల‌కు ముందే ముగిస్తే క‌లిగే ఆశ్చ‌ర్య‌క‌ర ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు

Dinner Before 7 pm : మీ విందు సమయం మీ మొత్తం ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని…

12 hours ago

Central Govt : ఉగ్ర‌వాద దాడుల్ని లైవ్‌లో చూపించొద్దు.. సీరియ‌స్ అయిన కేంద్రం..!

Central Govt : ప్ర‌స్తుతం భార‌త్ - పాక్ మ‌ధ్య యుద్ధ వాతావ‌ర‌ణం నెల‌కొంది. ఆపరేషన్ సింధూర్ త‌ర్వాత పాకిస్తాన్…

13 hours ago

IPL 2025 Postponed : బీసీసీఐ సంచ‌ల‌న నిర్ణ‌యం.. వాయిదా ప‌డ్డ ఐపీఎల్ 2025..!

IPL 2025 Postponed : భారత్, పాక్ దేశాల మధ్య యుద్ధం కారణంగా ఐపీఎల్ ర‌ద్దు అయ్యే అవ‌కాశాలు ఉన్న‌ట్టు…

14 hours ago

Army Jawan Murali Naik : భార‌త్-పాక్ యుద్ధం.. వీర‌మ‌ర‌ణం పొందిన జ‌వాన్ ముర‌ళీ నాయ‌క్

Army Jawan Murali Naik : భారత్‌-పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమవుతున్నాయి. ‘ఆపరేషన్‌ సిందూర్‌’కు ప్రతీకారంగా పాకిస్థాన్ సైన్యం…

15 hours ago