Home » Devotional » Today Horoscope August 10 2022 Check Your Zodiac Signs
Devotional

Zodiac Signs : ఆగస్టు 10 బుధవారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే….?

Authored By
aruna
The Telugu News | Published on: August 9, 2022, 10:40 pm
Advertisement

మేషరాశి ఫలాలు : అన్ని విషయాలలో సానుకూల ఫలితాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. మీరు చేసే
పనులలో విజయం సాధిస్తారు. వ్యాపార లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి. రియల్‌ ఎస్టేట్‌లో లాభాలు పొందుతారు. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. మహిళలకు లాభదాయకమైన రోజు. శ్రీ లక్ష్మీదేవి ఆరాదన చేయండి. వృషభ రాశి ఫలాలు : కొంచెం ప్రతికూలమైన రోజు. ఆదాయ మార్గాల కోసం అన్వేషిస్తారు. అన్నింటా ఎదురు దెబ్బలు తగిలే అవకాశం ఉంది. విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోండి దొంగతనానికి గురయ్యే అవకాశం ఉంది. బాగా శ్రమించాల్సిన రోజు. శ్రీ కాలభైరావారాధన చేయండి..

Advertisement

మిథునరాశి ఫలాలు : అన్నింటా మిశ్రమమైన ఫలితాలు వస్తాయి. ఉపాధి అవకాశాలు తగ్గుతాయి. ముఖ్య నిర్ణయాలు ఈరోజు తీసుకోకండి. వివాదాలకు అవకాశం ఉంది. ప్రయాణ చికాకులు. ఆప్పుల కోసం ప్రయత్నిస్తారు. మహిళలకు మామూలుగా ఉంటుంది. శ్రీ సుబ్రమణ్యస్వామి ఆరాదన చేయండి. కర్కాటక రాశి ఫలాలు : అన్నింటా శుభకరమైన ఫలితాలు వస్తాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. కోర్టు వ్యవహారాలలో సానుకూల తీర్పులు. పనులు సకాలంలో పూర్తిచేస్తారు. వ్యాపారాలలో లాభాలు వస్తాయి. అమ్మ నాన్నల నుంచి శుభవార్తలు అందుతాయి,. శ్రీ విష్ణు సహస్రనామాలను పారాయణ చేయండి.

Today Horoscope August 10 2022 Check Your Zodiac Signs

Advertisement

సింహ రాశి ఫలాలు : సంతోషకరమైన రోజు. ఆభివృద్ధి మార్గంలో పయనిస్తారు. విద్యా, ఉపాధి విషయాలలో మంచి వార్తలు వింటారు. మిత్రుల సహకారం లభిస్తుంది. సమయానికి చెతికి డబ్బు అందుతుంది. చికాకులు తొలగుతాయి. ప్రయాణాల్లో పెద్దల పరిచయాలు ఏర్పడుతాయి. మహిళలకు లాభాలు. శ్రీ లక్ష్మీ గణపతి ఆరాధన చేయండి.

కన్యారాశి ఫలాలు : ఆర్థికంగా ఇబ్బందులు వస్తాయి. రుణాల కోసం ప్రయత్నిస్తారు. ధైర్యంతో పనులు పూర్తిచేయాలని భావిస్తారు. తెలివితేటలకు పరీక్ష సమయం ఇది. ఆందోళనలు పెరుగుతాయి. ఆరోగ్యం కోసం జాగ్రత్త తీసుకోవాలి. శ్రీ ఆంజనేయస్వామి సిందూర ధారణ, ఆరాధన చేయండి.

Advertisement

తులారాశి ఫలాలు : అన్నింటా విజయాన్ని సాధిస్తారు. శుభఫలితాలను అందుకుంటారు. ఇంటా, బయటా
పనులను సకాలంలో పూర్తి చేస్తారు. విదేశాల నుంచి శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలలో లాభాలు. కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలం.శ్రీ గణపతి ఆరాధన చేయండి.

వృశ్చికరాశి ఫలాలు : మామూలుగా నడిచిపోయే రోజు. కుటుంబంలో అనుకోని మార్పులు జరుగుతాయి. విద్యా, ఉద్యోగ విషయాలలో శుభవార్తలు వింటారు. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. పెద్దల ద్వారా ప్రయోజనాలు పొందుతారు. బంధువుల ద్వారా లాబాలు గడిస్తారు. శ్రీలలితాదేవి ఆరాధన చేయండి.

ధనస్సు రాశి ఫలాలు : కొంచెం కష్టమైన రోజు. వివాదాలకు అవకాశం ఉంది. ఆర్థికంగా మందగమనం. ముఖ్య నిర్ణయాలను ఈరోజు తీసుకోకండి. ప్రయాణాలు తప్పనిసరి అయితేనే చేయండి. శ్రమాధిక్యత. కుటుంబంలో చికాకులు. వ్యాపారాల స్వల్ప లాభాలు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆంజనేయస్వామి దేవాలయంలో ప్రదక్షణలు చేయండి.

మకర రాశి ఫలాలు : కొత్త కొత్త ఆలోచనలు చేస్తారు. ఆదాయం పెరుగుతుంది. విద్యా, ఉపాధి విషయాలలో శుభవార్తలు వింటారు. వ్యాపారాలలో లాభాలు. ఉమ్మడి వ్యాపారాలకు అనువైన రోజు. కుటుంబంలో సంతోషం. మహిళలకు లాభదాయకమైన రోజు. శ్రీ దుర్గాదేవి ఆరాదన చేయండి.

Advertisement

కుంభ రాశి ఫలాలు : కొద్దిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. వివాదాలలో తలదూర్చకండి. మంచి చేద్దామన్నా చెడుగా మారే అవకాశం ఉంది. పనులలో జాప్యం పెరుగుతుంది. ఆర్థిక మందగమనం. మహిలలకు మాటపట్టింపులు. ఈరోజు ఓపికతో ఉండాలి. శ్రీ కాలభైరావారాధన చేయండి.

మీన రాశి ఫలాలు : అంతటా సానుకూల ఫలితాలు. వివాదాలు పరిష్కారం అవుతాయి. దూర ప్రాంతం నుంచి శుభవార్తలు అందుతాయి. వివాహ ప్రయత్నాలకు అనుకూలమైన రోజు. పెట్టుబడులు పెట్టడానికి మంచిరోజు. ప్రయాణ లాభాలు వస్తాయి. మిత్రులు, బంధువుల నుంచి సహాయం అందుతుంది. ఇష్టదేవతరాధన చేయండి.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి