Zodiac Signs : ఆగస్టు 11 గురువారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే….?

మేష రాశి ఫలాలు : ఇంట్లో ఆర్థిక పరిస్తితి సామాన్యంగా, కొంత మేరకు ఇబ్బందికరంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఒకరికి అనారోగ్య సూచన కనిపిస్తుంది. ఆందోళన, వత్తిడితో కూడిన రోజు. ఈరోజు ఎవరికి అప్పులు ఇవ్వవద్దు. ఎవరితో పరుషంగా మాట్లాడకండి. ఆఫీస్‌లో పరిస్థితి మంచిగా ఉంటుంది. ఉన్నతాధికారులు మిపనిని మెచ్చుకుంటారు. వ్యాపారస్తులు మంచి లాభాలు పొందుతారు. ఇష్టదేవతరాధన చేయండి. వృషభ రాశి ఫలాలు : ఆర్థికంగా ఈరోజు మిశ్రమ ఫలితాలు వస్తాయి. ధనం సంపాదిస్తారు కానీ ఖర్చులు కూడా బాగా పెరుగుతాయి. దూరప్రయాణాలు వాయిదా వేసుకోండి. దగ్గరి వారితో మీరు కఠినంగా మాట్లాడం వల్ల ఇబ్బంది పడుతారు. ముఖ్యమైన నిర్ణయాలను తీసుకోండి. ఈ రోజు విజయం వైవాహికంగా చక్కటి అనుభూతి చెందనున్నారు. అమ్మవారి దేవాలయంలో ప్రదక్షణలు, పూజలు చేయండి.

మిథున రాశి ఫలాలు : ఆర్థికంగా ఈరోజు సమస్యలు ఎదురుకుంటారు. అయితే మీ తెలివితేటలతో ఈరోజు సమస్యల నుంచి బయటపడుతారు. ఈరోజు మనఃశాంతి కోసం మిత్రులతో గడుపండి. ఇంటి లోపల, బయట మార్పులకు అవకాశం ఉన్నది. ఉల్లాసంగా, ఆహ్లాదంగా ఉంటుంది. పెండింగ్ పనులు పూర్తి చెయ్యడంలో లీనమైపోతారు. వివాహం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. శ్రీ గణపతి ఆరాధన చేయండి. కర్కాటక రాశి ఫలాలు : ఈరోజు లాభదాయకమైన రోజు. ఆర్థికంగా మంచి ఫలితాలు వస్తాయి. చాలా ప్రయోజనకరమైన రోజు. కుటుంబంలో చక్కటి సంతోషకరమైన రోజు. ఈరోజు మీకు అత్యంత అద్భుతమైన రోజు కానుంది. వైవాహిక జీవితంలో ఈ రోజు మీకో అందమైన రోజు. మహిళలకు మంచి లాభదాయకమైన రోజు. శ్రీ దుర్గాదేవి స్తోత్రం పారాయణం చేయండి.

Today Horoscope August 11 2022 Check Your Zodiac Signs

సింహ రాశి ఫలాలు : ఈరోజు ఏ పని చేసినా మాట్లాడేముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి. ఆర్థికంగా మందగమనం ఉంటుంది. వ్యాపారాలలో సాధారణ స్థితి. ఇంటికి అతిథులు వచ్చేస్తారు. లక్ష్యాలు ధ్యేయాలు సాధించడానికి ఈరోజు బాగా శ్రమించాల్సిన రోజు. వైవాహిక జీవితమంలో చిన్నచిన్న ఇబ్బందులు. శ్రీ రామ రక్షా స్తోత్రం పారాయణం చేయండి.

కన్యా రాశి ఫలాలు ; ఈరోజు నిరాశజనకంగా ఉంటుంది. బాగా కష్టపడాల్సిన రోజు. ఆర్థికంగా చిన్న చిన్న సమస్యలు వస్తాయి. ప్రయాణ సూచన. మీరు గతంలో చేసిన అప్పులు ఈరోజు ఇబ్బంది పడుతాయి. విద్యా, ఉద్యోగ విషయాలలో శ్రమతో కూడిన రోజు. మహిళలకు మామాలుగా ఉంటుంది. శ్రీ సుబ్రమణ్యస్వామి ఆరాధన చేయండి.

తులా రాశి ఫలాలు : ఈరోజు చక్కటి సంతోషకరమైన రోజు, ఆర్థికంగా లాభాలు కలిగిన రోజు. ఖర్చులు పెరిగినా వాటిని మీరు తట్టుకుని ముందుకు పోతారు. విందులు, వినోదాలలో పాల్గొంటారు. ఈరోజు బిజీగా గడుస్తుంది. విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోండి. వాహనాలను జాగ్రత్తగా నడపాల్సిన రోజు. శ్రీ లక్ష్మీ గణపతి ఆరాదన చేయండి.

వృశ్చిక రాశి ఫలాలు : ఈరోజు అనవసర విషయాలలో తలదూర్చకండి. అవసరమైన ఆలోచనలు చేయండి. భవిష్యత్‌కు సంబంధించిన ప్లాన్‌ల గురించి కుటుంబ సభ్యులతో చర్చిస్తారు. గతంలో వసూలవని బాకీలు వసూలు అవుతాయి. ఈరోజు ఆహ్లాదకరమైన అద్భుతమైన రోజు. ఆఫీసులో మీరు కీలకమైన వ్యక్తులను కలుసుకుంటారు. మహిళలకు లాభదాయకమైన రోజు. శ్రీ విష్ణు ఆరాధన చేయండి.

ధనుస్సు రాశి ఫలాలు : ఈరోజు చికాకులు వస్తాయి. సాయంత్రం నుంచి ఉత్సాహకరంగా ఉంటుంది. ధనానికి సంబంధించిన విషయాలలో పెద్దల సలహాలు తప్పక తీసుకోండి. కుటుంబంలో సంతోషకరమైన వార్తలు వింటారు. సంతానం వల్ల ప్రయోజనాలు పొందుతారు. మహిళలకు లాభదాయకమైన రోజు. శ్రీ దత్తాత్రేయారాధన చేయండి.

మకర రాశి ఫలాలు : ఈరోజు పనివత్తిడి ఎక్కువగా ఉంటుంది. పని మీద మీకు ఏకాగ్రత తక్కువగా ఉంటుంది. ఆదాయం తగ్గుతుంది. కానీ వ్యాపారాలలో మంచి మార్పులు జరుగుతాయి. ఇంట్లో చిన్నచిన్నసమస్యలు వస్తాయి. మిత్రుల నుంచి మంచి సహకారం అందుతుంది. విద్యార్థులకు శుభవార్తలు. శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆరాధన చేయండి.

కుంభ రాశి ఫలాలు : ఆకస్మిక ధనలాభాలు వస్తాయి. చాలా రోజుల తర్వాత విశ్రాంతి లభిస్తుంది. అనుకోని ఖర్చులు వస్తాయి కానీ వాటిని సులభంగా వాటిని అధిగమిస్తారు. ఆధ్యాత్మిక ఆలోచనలు చేస్తారు. వివాహప్రయత్నంలో అనుకూలత కనిపిస్తుంది. అమ్మవారి ఆరాధన చేయండి.

మీన రాశి ఫలాలు : ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుపుతారు. ఆర్థికంగా చక్కటి పురోగతి కనిపిస్తుంది. వ్యాపారాలలో శుభవార్తలు వింటారు. అన్నింటా జయం. మంచి వార్తలు వింటారు. స్నేహితుల వల్ల సంతోషం. కుటుంబంలో మంచి వాతావరణం. ప్రయాణ లాభాలు కనిపిస్తున్నాయి. శ్రీ వేంకటేశ్వరస్వామి ఆరాధన చేయండి.

Recent Posts

Asia Cup 2025 | ఆసియా క‌ప్‌లో భార‌త్ క‌ప్ కొట్టినా కూడా తీసుకోదా.. సూర్యకి ఏమైంది?

Asia Cup 2025 | పాకిస్తాన్‌తో జరగబోయే ఫైనల్‌లో గెలిచి ఆసియా కప్ 2025 ట్రోఫీని కైవసం చేసుకోవాలని సూర్య…

1 hour ago

Aghori | వర్షిణి – అఘోరీ వివాదం కొత్త మలుపు.. మోసం చేసింది నువ్వురా..మోసపోయింది నేనురా అంటూ సంచలన వ్యాఖ్యలు

Aghori | రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అఘోరీ – వర్షిణి వ్యవహారం మళ్లీ వార్తల్లోకెక్కింది. అఘోరీని పోలీసులు అరెస్ట్ చేసి…

3 hours ago

Raja Saab | ఎట్ట‌కేల‌కి రాజా సాబ్ ట్రైల‌ర్‌కి ముహూర్తం ఫిక్స్ చేశారు.. ఇక ఫ్యాన్స్‌కి పండ‌గే..!

Raja Saab | రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ వెయిట్ చేస్తున్న చిత్రాల్లో 'రాజాసాబ్' ఒకటి. చాలా…

5 hours ago

Telangana | తెలంగాణలో దంచికొడుతున్న వ‌ర్షాలు.. 11 జిల్లాలకు ఆరెంజ్ వార్నింగ్

Telangana |  తెలంగాణ రాష్ట్రంలో వ‌ర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, వచ్చే రెండు…

7 hours ago

Makhana | మఖానా ఆరోగ్యాన్ని కాపాడే సూపర్ ఫుడ్ .. ఇది తింటే ఆ స‌మ‌స్య‌లన్నీ మ‌టాష్‌

Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్‌ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…

8 hours ago

Salt | పింక్‌ సాల్ట్‌ vs సాధారణ ఉప్పు .. మీ ఆరోగ్యానికి ఏది ఉత్తమం?

Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…

9 hours ago

Periods | పీరియడ్స్‌ సమయంలో తల స్నానం చేయకూడదా.. వైద్య నిపుణులు సూటిగా చెప్పే సత్యం ఇదే..!

Periods | మన దేశంలో ఇప్పటికీ పీరియడ్స్‌కు సంబంధించిన అనేక అపోహలు ఉన్నాయి. పీరియడ్స్‌ సమయంలో తల స్నానం చేయరాదు,…

10 hours ago

Weight | బరువు తగ్గాలనుకునే వారు తప్పనిసరిగా చదవాల్సిన వార్త.. అరటిపండు,యాపిల్‌ల‌లో ఏది బెస్ట్‌

Weight | బరువు తగ్గాలనుకునే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అయితే చాలామంది సరైన మార్గాన్ని ఎంచుకోకపోవడం వల్ల బరువు…

11 hours ago