Home » Devotional » Today Horoscope August 17 2022 Check Your Zodiac Signs
Devotional

Zodiac Signs : ఆగస్టు 17 బుధవారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే….?

Authored By
aruna
The Telugu News | Published on: August 16, 2022, 10:40 pm
Advertisement

మేష రాశి ఫలాలు : కుటుంబంలో వేడుకలకు అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి. అనవసర ఖర్చులు వచ్చే అవకాశం ఉంది. మీకు బాగా ఇష్టమైన వారినుండి శుభవార్తలు వింటారు. వ్యాపారస్తులు వారి పార్టనర్స్ పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలి. .ముఖ్యమైన పనులను పూర్తిచేయలేరు. వైవాహిక జీవితం బాగుంటుంది. శ్రీ సుబ్రమణ్యస్వామి ఆరాధన మంచి ఫలితాలను ఇస్తుంది. వృషభ రాశి ఫలాలు : ఈరోజు దీర్ఘకాలిక పెట్టుబడులకు దూరంగా ఉండండి. ఈరోజు కుటుంబ సభ్యులతో ఆత్మీయంగా గడుపుతారు. ప్రేమికుల మధ్య అపార్థాలు తొలిగిపోతాయి. రియల్‌ ఎస్టేట్‌లో పెట్టుబడులకు అవకాశం ఉంది. ఆఫీసులో ఉన్నతాధికారుల వత్తిడి పెరుగుతుంది. వైవాహిక జీవితం సాఫీగా, సంతోషంగా సాగుతుంది. గణపతి ఆరాధన చేయండి.

Advertisement

మిథున రాశి ఫలాలు : వ్యాపారాభివృద్ధి కోసం ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆధ్యాత్మిక ఆలోచనలు పెరుగుతాయి. దగ్గరి వారి నుంచి ఆర్థిక సహకారం అందుంతుంది. ప్రేమ జీవితంలో ఎంతో అద్భుతంగా ఉంటుంది. మీ పని నైపుణ్యాలను, మెరుగు పరచుకోవడానికి ప్రయత్నిస్తారు. వైవాహిక జీవితంలో ఎన్నో సానుకూలతలు. ఆర్థికంగా బాగుంటుంది. అప్పులు తీరుస్తారు. అన్నింటా సానుకూలమైన ఫలితాలు సాధిస్తారు. శ్రీ సరస్వతీ దేవి ఆరాదన చేయండి. కర్కాటక రాశి ఫలాలు : ఈరోజు ప్రత్యేకమైన రోజు. అనుకోని లాభాలు బోలెడు మీకు అందే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యం కోసం తగు జాగ్రత్తలు తీసుకోండి. ప్రేమను ఈరోజు అనుభూతి చెందుతారు. కుటుంబంతో సమయాన్ని ఆనందంగా గడుపుతారు. జీవిత భాగస్వామితో సంతోషంగా గడపటానికి ప్రయత్నిస్తారు. విద్యా, ఉపాధి అవకాశాలు మెండుగా వస్తాయి. ఇష్టదేవతారాధన చేయండి.

Today Horoscope August 17 2022 Check Your Zodiac Signs

Advertisement

సింహ రాశి ఫలాలు : ఆర్థికంగా మిశ్రమమైన రోజు. ఇంట్లో పరిస్థితులు మీకు చికాకులు, మానసిక అశాంతిని కలిగిస్తాయి. ఆర్థికంగా ఇబ్బందికరమైన రోజు. పనిచేసే చోట వత్తిడి, పనిభారం పెరగుతుంది. ఆధ్యాత్మిక చింతన చేస్తారు. మిత్రుల సహకారం లభించడం కొంత ఉపశమనం కలిగిస్తుంది. శ్రీ రామ రక్షా స్తోత్రం పారాయణం చేయండి.

కన్యా రాశి ఫలాలు : ఈరోజు పొదుపు చేసే దిశగా అడుగులు వేస్తారు. అంకిత భావంతో పనులు పూర్తిచేస్తారు. సరదాగా సాయంత్రం ప్రేమికులు విహరిస్తారు. ఆరోగ్యం బాగుపడుతుంది. కుటుంబజీవితం సంతోషకరంగా సాగుతుంది. మీ నైపుణ్యాలను ప్రదర్శించే అవకాశం వస్తుంది. వైవాహిక జీవితంలో ఇబ్బందులు వస్తాయి కానీ చివరకు సర్దుమణుగుతాయి. శ్రీ కాలభైరావాష్టకం పారాయణం చేయండి.

Advertisement

తులా రాశి ఫలాలు : ధనాన్ని అనవసర విషయాలకు ఖర్చు చేస్తారు. రుణాల కోసం ప్రయత్నిస్తారు. పెద్దల సహకారంతో ఆర్థిక పరిస్థితిని చక్కబెట్టుకుంటారు. ఇంట్లో, బయటా పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. సంతానం వల్ల శుభవార్తలు వింటారు. మహిళలకు ధనలాభాలు. శక్తి గణపతి ఆరాధన చేయండి.

వృశ్చిక రాశి ఫలాలు : ఈరోజు శక్తివంతులైన ఉంటారు. అన్ని పనులను ఉషారుగా పూర్తిచేస్తారు. ఆర్థికంగా పర్వాలేదు. కానీ ఖర్చుల విషయంలో జాగ్రత్త పడండి. కుటుంబతో, మిత్రులతో సంతోషంగా గడపటానికి ఇష్టపడుతారు. ఈరోజు మీరు చేసే ప్రయాణం వ్యాపార సంబంధాలను మెరుగు పరుస్తుంది. మహిళలకు సంతోషకరమైన రోజు. శ్రీ విష్ణు సహస్రనామాలను చదువుకోండి శుభఫలితాలు వస్తాయి.

ధనుస్సు రాశి ఫలాలు : అనారోగ్య సమస్యల నుంచి బయటపడుతారు. టెన్షన్లు మాత్రం అంతే ఉంటాయి. ఆర్థికంగా ఇబ్బందులు వస్తాయి. రుణ ప్రయత్నాలు చేస్తారు. వివాదాలకు అవకాశం ఉంది. తల్లిదండ్రుల ఆరోగ్యం మెరుగుపర్చుకోండి.ప్రేమికులకు కష్టమైన రోజు. వైవాహికంగా పర్వాలేదు. శ్రీ అనుజ్ఞ గణపతి ఆరాధన చేయండి.

మకర రాశి ఫలాలు : ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆర్థికంగా మంచి పురోగతి సాధిస్తారు. ఖర్చులు పెరుగుతాయి. కానీ వాటిని అధిగమిస్తారు. ప్రేమ జీవితం బాగుంటుంది. పదోన్నతులు, ఇంక్రిమెంట్లకు అవకాశం ఉంది. అన్ని రకాల వృత్తుల వారికి సానుకూలమైన రోజు. శ్రీ లక్ష్మీ గణపతి ఆరాధన చేయండి.

Advertisement

కుంభ రాశి ఫలాలు : ఈరోజు సంతోషంగా గడుపుతారు. సోదర, సోదరీ వర్గంతో ప్రయోజనాలు పొందుతారు. కుటుంబంలో అనవసర విషయాలను చర్చించకండి. పెద్దల సలహాలతో ముందుకుపోండి. ఆర్థికంగా బాగుంటుంది. అన్నింటా సానుకూలమైన రోజు. గోసేవ చేయండి.

మీన రాశి ఫలాలు : ఈరోజు లాభాలను గడిస్తారు. ఆదాయం అనుకోని మార్గాల ద్వారా లభిస్తుంది. ప్రేమికులకు సంతోషకరమైన రోజు. నిరాశాజనకమై స్థితి నుంచి బయటపడుతారు. యువతకు మంచి ప్రయోజనకరమైన రోజు. ప్రేమికుల మధ్య సంబంధాలు మెరుగుపడుతాయి. వివాదాలు పరిష్కారం అవుతాయి. శ్రీ లక్ష్మీ దేవి ఆరాధన చేయండి.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి