Home » Devotional » Today Horoscope August 5 2022 Check Your Zodiac Signs
Devotional

Zodiac Signs : ఆగస్టు 5 శుక్రవారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే….?

Authored By
aruna
The Telugu News | Published on: August 4, 2022, 10:40 pm
Advertisement

మేషరాశి ఫలాలు : అనుకోని చోట నుంచి లాభాలు వస్తాయి. మీరు చేసే పనులు చకచకా పూర్తి చేస్తారు. ఆదాయం పెరుగుతుంది. కుటుంబం సంబంధ కీలక నిర్ణయాలకు మంచి సమయం. విందులు, వినోదాలకు అవకాశం ఉంది. మహిళలకు ఒత్తిడులు తొలగుతాయి. అమ్మవారి ఆరాధన చేయండి. వృషభరాశి ఫలాలు : ఆదాయం పెరుగుతుంది. అన్నింటా మీకు సానుకూలమైన ఫలితాలు వస్తాయి. ఇంట్లో సమస్యలు తీరతాయి. విందులకు, వినోదాలకు ఆహ్వానాలు అందుతాయి. బంధువులతో ఆనందంగా గడుపుతారు. మహిళలకు లాభాలు. వరలక్ష్మీదేవి ఆరాధన చేయండి.

Advertisement

మిథున రాశి ఫలాలు : అన్నింటా ప్రతికూలత ఎక్కువగా కనిపిస్తుంది. ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు ఫలించవు. ఆదాయం మించి ఖర్చులు రావడం వల్ల నిరాశజనకంగా ఉంటుంది. అప్పుల కోసం ప్రయత్నిస్తారు. అన్నింటా శ్రమతో కూడిన రోజు. మహిళలకు మామూలుగా ఉంటుంది. శ్రీ వరలక్ష్మీదేవిని మందారపూలతో ఆరాధించండి. కర్కాటక రాశి ఫలాలు : ఈరోజు మీకు అనకూలత పెరుగుతుంది. పేరు ప్రఖ్యాతలకు అవకాశం ఉంది. అమ్మ తరపు వారి నుంచి ఆహ్వానాలు, విందులు, వినోదాలు. ధన సంబంధ అనుకూలత. వ్యాపార వృద్ధి. ఆధ్యాత్మిక ఆలోచనలు పెరుగుతాయి. ఇష్టదేవతారాధన చేయండి.

Today Horoscope August 5 2022 Check Your Zodiac Signs

Advertisement

సింహ రాశి ఫలాలు : కొంచెం సుఖం, కొంచెం నష్టం. ఆదాయం ఆశించిన మేరకు రాదు. ఉమ్మడి వ్యాపారాలకు అనుకూలత లేదు. వ్యాపారాలలో లాభాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో వత్తిడి పెరుగుతుంది. మహిళలకు మంచి రోజు. శ్రీ దుర్గాదేవి ఆరాధన చేయండి.

కన్యారాశి ఫలాలు : అప్పుల కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుంది. దూర ప్రయాణ సూచన. కుటుంబంలో సానుకూలత కనిపిస్తుంది. వ్యాపారాలలో ఇబ్బందులు తొలుగుతాయి. ఆదాయం కోసం చేసే ప్రయత్నం ఫలిస్తాయి. మంచి వార్తలు వింటారు. అమ్మవారి ఆరాధన చేయండి.

Advertisement

తులారాశి ఫలాలు : అనుకూలత ఎక్కువగా ఉండే రోజు. ధనం కోసం ఎక్కువగా శ్రమిస్తారు. ఈరోజు బంధువుల శుభకార్యాలకు హాజరవుతారు. సమాజంలో మంచి గౌరవం. అన్నింటా మీక మంచి పురోభివృద్ధి. శ్రీ లక్ష్మీదేవి ఆరాధన చేయండి.

వృశ్చిక రాశి ఫలాలు : ఆదాయం కోసం తీవ్రంగా ప్రయత్నించాల్సి రోజు. వ్యాపారాలలో ఇబ్బందులు తొలుగుతాయి. వివాదాలకు అవకాశం ఉంది. ప్రయాణాలలో ఇబ్బందులు. కుటుంబంలో చక్కటి రోజు. సమస్యల నుంచి బయట పడటానికి పెద్దల సలహాలు తీసుకుంటారు. శ్రీ కనకదుర్గాదేవి ఆరాధన చేయండి.

ధనుస్సు రాశి ఫలాలు : ఉల్లాసంగా ఉంటుంది. ఆనందంగా ఈరోజు గడుస్తుంది. అప్పులు తీరుస్తారు. వివాదాలు పరిష్కారం అవుతాయి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలలో ఇబ్బందులు తొలుగుతాయి. అమ్మవారి ఆరాధన చేయండి.

మకర రాశి ఫలాలు : పెద్దల ద్వారా మంచి సలహాలు పొందుతారు. ఆదాయం తగ్గుతుంది. కుటుంబంలో వివాదాలకు అవకాశం ఉంది. విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాల్సిన రోజు. కొత్త పెట్టుబడులకు అవకాశం ఉంది. శ్రీ లలితాదేవి ఆరాధన చేయండి.

Advertisement

కుంభ రాశి ఫలాలు : అనుకోని లాభాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. ఆధ్యాత్మిక ఆలోచనలు, పూజలు, దేవాలయ సందర్శన చేస్తారు. ఇంట్లో సందడి వాతావరణం. సంతానం వల్ల శుభవార్తలు వింటారు. అనుకోని వారి నుంచి ప్రయోజనాలు అందుతాయి. శ్రీ లక్ష్మీనారాయణ ఆరాధన చేయండి.

మీన రాశి ఫలాలు : మీకు కొంచెం కష్టంగా ఉంటుంది కానీ ధైర్యంతో మీరు ముందుకుపోతారు. ఆదాయం తగ్గినా ఇబ్బంది ఉండదు. అప్పుల కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుంది. వ్యాపారాలలో లాభాలు రావు కానీ చికాకులు తగ్గుతాయి. ఇంట్లో, బయటా అనకూల తక్కువ. శ్రీ దుర్గా సూక్తంతో అమ్మవారి ఆరాధన చేయండి.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి