Home » Devotional » Today Horoscope December 10 2022 Check Your Zodiac Signs
Devotional

Zodiac Signs : డిసెంబర్ 10 శనివారం ఈరోజు మీ రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే …?

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: December 9, 2022, 10:40 pm
Advertisement

మేష రాశి ఫలాలు : చేసే పనులలో ఆటంకాలు ఏర్పడుతాయి. చికాకులు వస్తాయి. ఆదాయంలో తగ్గుదల కనిపిస్తుంది. ప్రయాణాలలో నష్టాలు. ఇంటా, బయటా మీకు అనుకోని సమస్యలు రావచ్చు. ఆపీస్‌లో వత్తిడి రావచ్చు. వివాహ ప్రయత్నాలను చేసే వారికి ఇబ్బందులు. మహిళలకు పనిభారం కనిపిస్తుంది. ఈరోజు శివపంచాక్షరీ జపించండి. వృషభ రాశి ఫలాలు : ఈరోజు చక్కటి రోజు. మీరు ఈరోజు శుభవార్తలు వింటారు. ఈరోజు వ్యాపారాలలో లాభాలు కలుగుతాయి. ఆదాయంలో చక్కటి పురోగతి కనిపిస్తుంది. అన్నింటా మీకు అనుకూలత కనిపిస్తుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. విందు, వినోదాల్లో పాల్గొంటారు. మిత్రులు కలయిక. అమ్మవారి ఆరాధన చేయండి.

Advertisement

మిథున రాశి ఫలాలు : ఈరోజు ధైర్యంతో ముందకు పోతారు. ఆదాయంలో తగ్గుదల కనిపించినా అవసరాలకు మాత్రం ధనం చేతికి అందుతుంది. అన్నింటా జయం సాధిస్తారు., ఈరోజు మీరు చేసే పనులను సకాలంలో పూర్తిచేస్తారు. వ్యాపారాలలో లాభాలు. మహిళలకు శుభకార్య ఆహ్వానాలు. విందులు, వినోదాలతోకూడిన రోజు. ఇష్టదేవతరాధన చేయండి. కర్కాటక రాశి ఫలాలు : ఈరోజు కొద్దిగా ప్రతికూలమైన రోజు. ఆదాయంలో తగ్గుదల కనిపిస్తుంది. అన్నింటా మీకు చికాకులు పెరుగుతాయి. విద్య, వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలలో నష్టాలకు అవకాశం కనిపిస్తుంది. ఖర్చులు పెరుగుతాయి. అనుకోని వివాదాలకు అవకాశం కనిపిస్తుంది. మహిళలకు పనిభారం. శ్రీ వేంకటేశ్వరస్వామి ఆరాధన చేయండి.

Today Horoscope December 10 2022 Check Your Zodiac Signs

Advertisement

సింహ రాశి ఫలాలు : కొద్దిగా కష్టపడితేత చాలు ఈరోజు మీదే. శ్రమకు తగ్గ పలితం వస్తుంది. ఆదాయ వనరులు పెరుగుతాయి. ఇంటా, బయటా మీకు ప్రోత్సహకరంగా ఉంటుంది. అనుకోని ప్రయాణాలు చేస్తారు. మహిళలకు చికాకులు వస్తాయి. పెద్దల ద్వారా మంచి వార్తలు వింటారు. మానసికంగా ఉత్సాహంగా గడుపుతారు. శ్రీ హనుమాన్‌ చాలీసా పారాయణ చేసయండి.

కన్యారాశి ఫలాలు : చికాకులతో కూడిన రోజు. ఆదాయంతో తగ్గుదల కనిపిస్తుంది. ఆనుకోని వారి నుంచి ఇబ్బందులు వస్తాయి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. విద్య, ఉపాధి విషయాలలో అనుకూలత తక్కువగా ఉంటుంది. దూర ప్రాంతం నుంచి ఇబ్బందికలిగించే వార్త అందుతుంది. అనుకోని నష్టాలు రావచ్చు. మహిలలకు పని వత్తిడి కనిపిస్తుంది. శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి ఆరాధన చేయండి.

Advertisement

తులారాశి ఫలాలు : ఈరోజు అనుకోని శుభవార్తలు వినే అవకాశం ఉంది. అన్ని రకాల వృత్తుల వారికి ఈరోజు లాభదాయకంగా ఉంటుంది. వ్యాపారాలలో ధన లాభం. చేపే పనులన్నీ సకాలంలో పూర్తి చేస్తారు. ఇంట్లో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభిస్తాయి. విందు వినోదాల్లో పాల్గొంటారు. మహిళలకు చక్కటి ధనయోగం. శ్ర్ ఆంజనేయస్వామి ఆరాధన చేయండి.

వృశ్చిక రాశి ఫలాలు ; ఈరోజు కొద్దిగా పనిభారం, శ్రమ పెరిగినా ఈరోజు మీదే. ఆదాయంలో పురోగతి కనిపిస్తుంది. చక్కటి కుటుంబ వాతావరణం. అనుకున్నది సాధిస్తారు, చేసే పనులలో విజయం మీదే. వ్యాపారాలలో చక్కటి పెరుగుదల కనిపిస్తుంది. మిత్రుల సహాయ సహకారా లభిస్తాయి. శుభవార్త వింటారు. సమాజంలో చక్కటి గౌరవ మర్యాదలు. ఆధ్యాత్మిక ఆలోచనలు పెరుగుతాయి. ఇష్టదేవతరాధన చేయండి.

ధనస్సు రాశి ఫలాలు : అనుకూలత తక్కువ. ఆదాయంతో తగ్గుదల కనిపిస్తుంది. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. ఆనుకోని ప్రయానాలు. వివాదాలకు ఆస్కారం ఉంది. అనుకున్నది ఒక్కటి అయ్యేది ఒకటి. :ఇంటా, బయటా మీకు ఇబ్బందులు తపప్పవు, ఓపికగా మెలగాల్సిన రోజు. మహిలలకు పనివత్తిడి. శ్రీ రామ రక్షా స్తోత్రం పారాయణం చేయండి.

మకర రాశి ఫలాలు : కొద్దిగా సంతోషం, కొద్దిగా బాధతో కూడిన రోజు. ప్రేమికులకు అనుకూలం. ఆదాయంలో తగ్గుదల కనిపిస్తుంది. వివాహ ప్రయత్నాలు కలసి వస్తాయి. వ్యాపారాలలో స్వల్ప లాభాలు. కొత్త పనులు ప్రారంభించడానికి అనకూలం కాదు. ప్రయాణాలు వాయిదా. మహిలలకు దూర ప్రయాణ సూచన. గోసేవ చేయండి.

Advertisement

కుంభ రాశి ఫలాలు : ప్రతికూలమైన వాతావరణం కనిపిస్తుంది. ఆదాయంలో తగ్గుదల, అప్పుల కోసం ప్రయత్నాలు చేస్తారు,. మిత్రులు మీకు దూరంగా ఉంటారు. ప్రయాణాలలో విలువైన వస్తువులు జాగ్రత్త. ఇంట్లో ఒకరి ఆరోగ్యం ఇబ్బంది పెట్టవచ్చు ఇంటా, బయటా మీరు జాగ్రత్తగా, ఓపికతో ఉండాలి. వివాదాలకు అవకాశం. శ్రీ వేంకటేశ్వరాస్వామి ఆరాధన చేయండి.

మీన రాశి ఫలాలు : అనుకున్న దానికంటే మంచి ఫలితాలు వస్తాయి. ఆదాయంలో చక్కటి పెరుగుదల. వివాహ ప్రయత్నాలు అనుకూలం. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఇంట్లో కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం. పెద్దల సహాయ సహకారములతో ముఖ్యమైన పనులు పూర్తిచేస్తారు. కొత్త పనులు ప్రారంభం. మహిలలకు చక్కటి ఫలితాలు. శ్రీ విష్ణు సహస్రనామాలను పారాయణ చేయండి.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి