Zodiac Signs : డిసెంబర్ 13 మంగళవారం ఈరోజు మీ రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే …? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Zodiac Signs : డిసెంబర్ 13 మంగళవారం ఈరోజు మీ రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే …?

 Authored By prabhas | The Telugu News | Updated on :12 December 2022,10:40 pm

మేష రాశి ఫలాలు : ఈరోజు ధనలాభాలు కలిగే అవకాశం ఉంది. అన్ని రకాల వృత్తుల వారికి అనుకూలమైన రోజు. ఆదాయంలో పురోగతి కనిపిస్తుంది. వ్యాపారాలలో ఇబ్బందులు తొలిగిపోతాయి. ఆఫీస్‌లో అందరి సహకారం లభిస్తుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. శ్రీ లక్ష్మీ దేవి ఆరాధన చేయండి. వృషభ రాశి ఫలాలు : చేసే పనులలో ఆటంకాలు వస్తాయి. ఆదాయంలో తగ్గుదల కనిపిస్తుంది. ప్రయాణ సూచన కనిపిస్తుంది. ఈరోజు ఊహించని సంఘటనలు జరుగుతాయి. అవసరాలకు ధనం మాత్రం అందుతుంది. కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు వస్తాయి. వత్తిడి పెరుగుతుంది కానీ మీరు ధైర్యంతో ముందుకు పోతారు. శ్రీ రామ రక్షా స్తోత్రం పారాయణం చేయండి.

మిథున రాశి ఫలాలు : కొద్దిగా ప్రతికూలమైన రోజు. ఈ రోజు చెడు వార్తలు వినే అవకాశం ఉంది. వ్యాపారాలలో ఇబ్బందులు తొలిగిపోతాయి. ధైర్యంతో పనులు చేస్తేనే మీర ముందుకు పోతారు.
చేసే పనులలో ఆటంకాలు. బంధుమిత్రులతో మనస్పర్ధలు వస్తాయి. ముఖ్యమైన పనులు వాయిదా వేసుకోవడం మంచిది తప్పనిసరి అయితే పెద్దల సలహాలు తీసుకుని ముందుకుపోవాలి. అన్ని రంగాల వారు ఓపికత, జాగ్రత్తతో మెలగాల్సిన రోజు. శ్రీ కాలభైరావాష్టకం పారాయణం చేయండి. కర్కాటక రాశి ఫలాలు : కొద్దిగా శ్రమతో కూడిన రోజు. ఆదాయంలో సాధారణ స్తితి. అన్నదమ్ముల నుంచి ప్రయోజనాలు పొందుతారు. ఆఫీస్‌లో కొద్దిగా వత్తిడి పెరుగుతుంది. వ్యాపారాలు నష్టం వాటిల్తుంది. అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి. అనుకోని ప్రయాణాలు కనిపిస్తున్నాయి. వివాహ ప్రయత్నాలకు అనకూలం కాదు. పెద్దల ద్వారా సలహాలు తీసుకుని ముందుకుపోవాల్సిన ోజు. శ్రీ లక్ష్మీ గణపతి ఆరాధన చేయండి.

Today Horoscope December 13 2022 Check Your Zodiac Signs

Today Horoscope December 13 2022 Check Your Zodiac Signs

సింహ రాశి ఫలాలు : అనుకూలత, ప్రతికూలత కనిపిస్తుంది. మీరు ఈరోజు అనుకోని పరిస్థితులను ఎదురుకొంటారు. ఆర్థికంగా ఇబ్బంది. ధన నష్టానికి అవకాశం ఉంది. వ్యాపారాలలో లాభాలు వస్తాయి. వివాహ ప్రయత్నాలు అనుకూల ఫలితాలను ఇస్తాయి. వివాదాలకు దూరంగా ఉండాల్సిన రోజు. సమాజంలో మంచి పేరు, కీర్తి ఈరోజు మీకు రావచ్చు. మహిళలకు చక్కటి రోజు. శ్రీ మంగళపార్వతీ ఆరాధన చేయండి.

కన్యా రాశి ఫలాలు : చేసే పనులు వేగంగా పూర్తిచేసుకుంటారు. ఆదాయంలో పురోగతి కనిపిస్తుంది. అనారోగ్య బాధలు తొలిగిపోతాయి. వ్యాపారాలలో ఇబ్బందులు తొలిగిపోతాయి. పెట్టుబడులకు అనుకూలమైన రోజు. ఆఫీస్‌లో మీ సేవలకు ప్రశంసలు అందుతాయి. అన్ని రకాలుగా బాగుంటుంది. మహిలలకు చక్కటి శుభదినం. ఇష్టదేవతారాధన చేయండి.

తులారాశి ఫలాలు : ఈరోజు మీరు చక్కటి శుభవార్తలు వింటారు. చేసే పనులను సకాలంలో పూర్తిచేస్తారు. వ్యాపారాలలో లాభాలు సాధిస్తారు. విద్యార్థులకు అనుకూలమైన రోజు. ఈరోజు సంతోషంగా గడుపుతారు. మిత్రులతో విందులు, వినోదాలలో పాల్గొంటారు. బంధువుల నుంచి శుభవార్తలు అందుతారు. మహిలలకు చక్కటి రోజు. శ్రీ లక్ష్మీ నారాయణస్వామి ఆరాధన చేయండి..

వృశ్చిక రాశి ఫలాలు : ప్రతికూలమైన వాతావరణం కనిపిస్తుంది. ధైర్యం, తెలివితేటలతో ముందుకుపోవాల్సిన రోజు. అన్ని రకాల వృత్తుల వారు జాగ్రత్తగా మెలగాల్సిన రోజు. వాహనాలను జాగ్రత్తగా నడపాల్సిన రోజు. ఈరోజు మీరు పట్టుదలతో చేయ పనులు పూర్తవుతాయి. వ్యాపారాలలో ఇబ్బందులు కొంత తొలిగిపోతాయి. అనవసర ఖర్చులు, వ్యయప్రయాసలను ఎదురుకుంటారు. అమ్మవారి ఆరాధన చేయండి.

ధనస్సు రాశి ఫలాలు : ఈరోజు మంచి శుభకాలంగా చెప్పుకోవచ్చు. ఆనుకోని ధనలాభాలు వస్తాయి. ఈరోజు ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు. కుటుంబంలో సానుకూలమైన మార్పులు కనిపిస్తున్నాయి. పెద్దలతో ఏర్పడిన వివాదాలు సమసిపోతాయి. ఆన్ని రకాల వృత్తుల వారికి ఇబ్బందులు తొలిగిపోతాయి. మహిళలకు చక్కటి రోజు. ప్రైవేట్‌ ఉద్యోగులకు అనకూలమైన రోజు. శ్రీ విష్ణు సహస్రనామాలను పారాయణం చేయండి.

మకర రాశి ఫలాలు : కొద్దిగా మధ్యస్తమైన రోజు, ఆదాయంలో తక్కువగా ఉంటుంది. అవసరాలకు మాత్రం మిత్రులు లేదా కుటుంబ సభ్యుల సహకారంతో బయటపడుతారు. పనులను నెమ్మదిగానైనా పూర్తిచేస్తారు. మిత్రుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. ఆహార విహారా విషయాలలో మాత్రం జాగ్రత్తగా తీసుకోవాలి. మహిళలకు చక్కటి రోజు. శ్రీ శివాభిషేకం చేయండి.

కుంభ రాశి ఫలాలు : ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుపుతారు. ఆన్ని రంగాల వారికి శుభదినం ఈరోజు. మానసిక ప్రశాంతత కనిపిస్తుంది. ఆదాయంలో పురోగతి కనిపిస్తుంది. వివాహ ప్రయత్నాలు కలసివస్తాయి. విద్యార్థులకు శుభవార్తలు అందుతాయి. మీ తెలివితేటలకు పరీక్ష లాగా ఉంటుంది ఈరోజు. మహిళలకు మంచి వార్తలు అందుతాయి. శ్రీ లలితాదేవి ఆరాధన చేయండి.

మీన రాశి ఫలాలు : కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. అన్ని రకాల వ్యాపారులకు లాభదాయకమైన రోజు. విద్యా,వివాహ ప్రయత్నాలకు అనుకూలం. విదేశీ ప్రయత్నాలు ఫలిస్తాయి. మహిళలకు చక్కటి రోజు. ఆదాయంలో పెరుగుదల కనిపిస్తుంది. ప్రయాన లాభాలు. అన్ని రంగాల వారికి అనుకూలం. శ్రీ సంతోషి దేవి ఆరాధన చేయండి.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది