zodiac signs : డిసెంబర్  19 ఆదివారం ఈరాశి వారు సంతోషకరమైన వార్తలు వింటారు !

మేషరాశి ఫలాలు : ఈరోజు కుటుంబంలో ఇబ్బందులు. పనులు నెమ్మదిగా సాగుతాయి. ఆటంకాలు ఎక్కువ. అనారోగ్య సూచన కనిపిస్తుంది. మిత్రుల సహకారం కోసం ప్రయత్నిస్తారు. ఆర్థికంగా ఇబ్బంది. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి సరైన రోజు కాదు. చిక్కులు. శుభ ఫలితాల కోసం శ్రీ సూర్యనారాయణ స్వామి ఆరాధన చేయండి. వృషభరాశి ఫలాలు : ఈరోజు మంచి ఫలితాలు వస్తాయి. ముఖ్య విషయాలను కుటుంబ సభ్యులతో చర్చించి ముందుకు పోతారు. సమాజంలో మంచి గౌరవం, కీర్తి పెరుగుతాయి. ఆర్థిక లాభాలు, వస్త్రలాభాలు వస్తాయి.. ఇంటా, బయటా మీరు పనులు పూర్తి చేస్తారు. వ్యాపారులకు పరిస్థితులు అనుకూలిస్తాయి. శుభ ఫలితాల కోసం శ్రీలక్ష్మీదేవిని ఆరాధించండి.

మిధునరాశి ఫలాలు : ఈరోజు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ మీరు మీ తెలివి తేటలతో వాటిని అధిగమిస్తారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబంలో చిన్నచిన్న సమస్యలు రావచ్చు వాటిని పెద్దగా కాకుండా చూసుకోండి. తీవ్రమైన అలసట. వ్యాపారాలు, ఆర్థికం సాధారణంగా ఉంటాయి. మంచి ఫలితాల కోసం శ్రీశివాభిషేకం, లక్ష్మీదేవి అష్టోతరం చదువుకోండి. కర్కాటకరాశి ఫలాలు : ఈరోజు సంఘంలో గౌరవమర్యాదలు పెరుగుతాయి. ఆర్థిక విషయాలలో సంతోషకరంగా ఉంటాయి. పెద్దల నుంచి శుభవార్తలు వింటారు. చాలాకాలంగా వసూలు కాని బకాయిలు ఈరోజు వసూలు అవుతాయి. అన్ని చోట్ల మీరు ఉత్సాహంగా పనిచేస్తారు. ఆరోగ్యం మంచిగా ఉంటుంది. ఇష్టదేవతరాధన చేయండి.

Today Horoscope december 19 2021 check your zodiac signs

సింహరాశి ఫలాలు : ఈరోజు మీకు మంచి ఆహారం, విశ్రాంతి లభిస్తాయి. కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు. స్నేహితల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. కార్య జయంతోపాటు వ్యాపార లాభాలు వస్తాయి. మహిళలు శుభవార్తలు వింటారు. శ్రీరామ రక్ష స్తోత్రం పారాయణం చేయండి.

కన్యారాశి ఫలాలు : ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. మీ శ్రమకు తగిన ఫలితం రాదు. ఆర్థిక పరిస్థితులు అనుకూలించవు. కుటుంబంలో మాట పట్టింపులు పెరుగుతాయి. ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. మహిళలకు పని వత్తిడి పెరుగుతుంది. అవసరాల కోసం అప్పులు చేస్తారు. నవగ్రహాలకు ప్రదక్షణలు చేయండి.

తులారాశి ఫలాలు : ఈరోజు మనస్సు స్థిరంగా ఉండదు. పనులు వాయిదా వేస్తారు. ఆరోగ్య కోసం జాగ్రత్తలు తీసుకోవాల్సిన రోజు. అనుకోని తగాదాలు. అన్ని చోట్ల వాతావరణం ఇబ్బందిగా అనిపిస్తుంది. మానసిక ప్రశాంతత కొరవడుతుంది.శ్రీదుర్గా స్తోత్రం చదువుకోండి లేదా వినండి.

వృశ్చికరాశి ఫలాలు : ఈరోజు మంచి వార్తలు వింటారు. శుభకార్య ప్రయత్నాలు చేస్తారు. మహిళలు విలువైన వస్తువులు కొంటారు. పెద్దల నుంచి ప్రయోజనాలు పొందుతారు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. వ్యాపారాలు మంచిగా సాగుతాయి. శ్రీవిష్ణు ఆరాధన చేయండి.

ధనుస్సురాశి ఫలాలు : కార్యజయం,.శుభవార్తలు వినడం వంటి వాటితో ఈరోజు చాలా ఆనందంగా గడుపుతారు. పిల్లల నుంచి సంతోషకరమైన వార్తలు వింటారు. కొత్త పననులు ప్రారంభానికి మంచి రోజు, ఆర్థిక పరిస్థితులు మంచిగా ఉంటాయి. పాలు, ఐరన్, స్టీల్‌ వ్యాపారులకు మంచిరోజు, మహిళలకు షాపింగ్‌ టైమ్‌ కనిపిస్తుంది. కుబేర లక్ష్మీగణపతి ఆరాధన చేయండి.

మకరరాశి ఫలాలు : ఈరోజు కొంచెం ప్రతికూలతతో కూడిన రోజు. అనవసర విషయాలలో తలదూర్చకండి. కొన్ని వారాలుగా ఇబ్బంది పెడుతున్న సమస్యలు పరిష్కారానికి ప్రయత్నిస్తారు. ఆటంకాలు ఎదురవుతాయి. ఆర్థిక విషయాలలో జాగ్రత్తలు అవసరం. ఎవరికి అప్పులు ఇవ్వకండి. శ్రీ లక్ష్మీదేవి ఆరాధన మంచి ఫలితాన్నిస్తుంది.

కుంభరాశి ఫలాలు : ఈరోజు పని వత్తిడి పెరుగుతుంది. కుటుంబంలో అనుకోని వాదనలు తద్వారా మానసిక అశాంతి. ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. ఉద్యోగులకు, విద్యార్థులకు సాధారణంగా గడుస్తుంది.
ఆర్థిక విషయాలు మీకు నిరాశ పరుస్తాయి. శుభఫలితాల కోసం శ్రీదత్తాత్రేయస్వామి ఆరాధన చేయండి.

మీనరాశి ఫలాలు : మంచిగా సంతోషంగా గడిచిపోయే రోజుల్లో ఇది ఒకటి. ఆదాయం పెరుగుతుంది. ఆప్తుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. మహిళలకు బంగారు ఆభరణాలు కొనుగోలుకు అవకాశం ఉంది.
అన్ని రకాల వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. శుభఫలితాలక ోసం శ్రీసూర్యరాధన చేయండి.

Recent Posts

Onion Black Streaks : నల్ల మచ్చలు ఉన్న ఉల్లిగడ్డలు తినే వాళ్లు వెంటనే ఇది చదవండి

Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…

3 weeks ago

Jaggery Vs Sugar : తియ్యగా ఉంటాయని చెక్కర, బెల్లం తెగ తినేస్తున్నారా?

Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…

3 weeks ago

Benefits of Eating Fish : మీకు నచ్చినా నచ్చకపోయినా చేపలు తినండి.. పది కాలాల పాటు ఆరోగ్యంగా ఉండండి

Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…

3 weeks ago

Egg vs Paneer : ఎగ్ వర్సెస్ పనీర్.. ఏది మంచిది? ఏది తింటే ప్రొటీన్ అధికంగా దొరుకుతుంది?

Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…

3 weeks ago

Snoring Health Issues : నిద్రపోయేటప్పుడు గురక పెడుతున్నారంటే మీకు ఈ అనారోగ్య సమస్యలు ఉన్నట్టే

Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…

3 weeks ago

Swallow Bubble Gum : బబుల్‌ గమ్ మింగేస్తే ఏమౌతుంది? వెంటనే ఏం చేయాలి?

Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…

4 weeks ago

Garlic Health Benefits : రోజూ రెండు వెల్లుల్లి రెబ్బలు తింటే మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసా?

Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…

4 weeks ago