Zodiac signs : డిసెంబర్ 23 గురువారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే..?

 Authored By prabhas | The Telugu News | Updated on :22 December 2021,10:40 pm

మేషరాశి ఫలాలు : ఈరోజు ధన లాభాలు బాగుంటాయి. పెద్దల పరిచయాలు. ఉద్యోగ ప్రయత్నం చేసే వరకు అనుకూలమైన రోజు. కుటుంబంలో మార్పులు. ప్రయాణాల వల్ల ప్రయోజనాలు. మహిళలకు సంతోషకరమైన వార్తలు. అన్ని రంగాల వారికి నూతనోత్సాహం. అనుకూలమైన ఫలితాల కొరకు శ్రీ సాయిబాబా లేదా దత్తత్రేయ స్వామి ఆరాధన చేయండి. వృషభరాశి ఫలాలు : మీ శ్రమకు తగ్గ ఫలితం రాదు. అనుకోని ఖర్చులు. కొత్త పెట్టుబడులు పెట్టకండి. పెద్దలతో విబేధాలు. మానసిక సంఘర్షణ, అనుకోని ప్రయాణాలు.అలసట, విశ్రాంతి లేకపోవడం వంటి ఫలితాలు రావచ్చు. ధనం కూడా అవసరానికి చేతిలో ఉండదు. మంచి ఫలితాల కోసం శ్రీ లక్ష్మీనారసింహ కరావలంబ స్తోత్రం చదువండి లేదా వినండి.

మిధునరాశి ఫలాలు : ఈరోజు పెద్దల సలహాలతో ప్రయోజనాలు పొందుతారు. అనుకోని చోట నుంచి శుభవార్తలు వింటారు. కుటుంబంలో చాలాకాలంగా వివాదంగాఉన్న అంశాలు పరిష్కారం అవుతాయి. వ్యాపారాలు చేసేవారికి లాభాలు రావచ్చు. ఆర్థిక పరిస్తితి మంచిగా ఉంటుంది. శ్రీ దుర్గాదేవి ఆరాధన చేయండి. కర్కాటకరాశి ఫలాలు : ఈరోజు మనసు స్థిరంగా ఉండదు. వ్యాపారాలు నిరాశజనకంగా ఉన్నాయి. చేసే పనుల్లో అవాంతరాలు. అప్పులు చేయాల్సన స్థితి ఏర్పడవచ్చు. మిత్రులతో తగాదాలు. ధన సంబంధ విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మంచి ఫలితాల కోసం శ్రీ లక్ష్మీదేవి ఆరాధన చేయండి.

Today Horoscope december 23 2021 check your zodiac signs

Today Horoscope december 23 2021 check your zodiac signs

సింహరాశి ఫలాలు : సంతోషకరమైన రోజు. మిత్రుల ద్వారా శుభవార్తలు వింటారు. పెద్దలు ఆర్థికంగా సహాయపడుతారు. విందువినోదాలలో పాల్గొంటారు. ఆర్థిక విషయాలలో మంచి అభివృద్ధి. పాలు,కూరగాయల వ్యాపారులకు మంచి లాభాలు రావచ్చు. మహిళకు శుభవార్తలు. శుభఫలితాల కోసం శ్రీలలితాదేవి ఆరాధన చేయండి.

కన్యారాశి ఫలాలు : ఈరోజు చాలా కాలంగా వేధిస్తున్న సమస్యల నుంచి విముక్తి. అప్పులు తీరుస్తారు. ఆర్థికంగా మంచి స్థితి కలిగి ఉంటారు. దేవాలయాలు సందర్శిస్తారు. అన్ని రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. అనుకూలమైన ఫలితాల కొరకు శ్రీలక్ష్మీగణపతి ఆరాధన చేయండి.

తులారాశి ఫలాలు : మిశ్రమంగా ఫలితాలు వస్తాయి, అనుకూలతతోపాటు ఇబ్బందులు కూడా కలిగే రోజు. ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. ఎవరిక అప్పులు ఇవ్వకండి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. అనుకోని ప్రయాణాలు. అనారోగ్య సూచన,. కుటుంబంలో మనస్పర్థలు. వివాహ ప్రయత్నం చేసేవారికి ప్రతికూలత. శుభ ఫలితాల కోసం శ్రీ దత్తత్రేయ కవచం చదువుకోండి లేదా వినండి.

వృశ్చికరాశి ఫలాలు : ఈరోజు ఆటంకాలతో చికాకు పెరుగుతుంది. అనుకోని వారితో విరోధం ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. షాపింగ్‌కు పోయి అనవసర ఖర్చులు చేసే అవకాశం ఉంది. కుటుంబంలో ముఖ్య విషయాలను చర్చిస్తారు. ఆర్థిక పరిస్థితలు నిరాశాజనకంగా ఉంటాయి. మిత్రలతో సహకారం కోసం ప్రయత్నించి విఫలం అవుతారు. శుభఫలితాల కోసం శ్రీ కాలభైరవాష్టకం పారాయనం చేయండి.

ధనుస్సురాశి ఫలాలు : ఈరోజు చేసే పనులు సంతృప్తికరంగా పూర్తిచేస్తారు. చాలా కాలంగా పోవాలనుకునే ప్రాంతానికి పోవడానికి మార్గం సుగమవుతుంది. దూరపు బంధువుల కలయిక. కుటుంబంలో ముఖ్య నిర్ణయాలు తీసుకోంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. మంచి ఫలితాల కోసం శ్రీ శివాలయంలో ప్రదక్షణలు చేయండి.

మకరరాశి ఫలాలు : ఈరోజు చేసే పనులు వేగంగా పూర్తి చేస్తారు. శుభవార్తలు అందుతాయి. ఆర్థిక విషయాలలో పురోగతి. వస్తు, భూ లాభాలు రావచ్చు. కుటుంబంలో కీలక నిర్ణయాలు తీసుకొంటారు. శ్రీరామ రక్షా స్తోత్రం పారాయణం చేయండి.

కుంభరాశి ఫలాలు : ఈరోజు అనవసర వివాదాలు రావచ్చు. ముఖ్యంగా కుటుంబ సభ్యులు, సోదరులతో కలహాలు. పనులు ముందుకు సాగవు. పని ఒత్తిడి పెరుగుతుంది. మత సంబంధ కార్యక్రమాలలో పాల్గొంటారు. అన్ని పనులు మందగమనంలో నడుస్తాయి. ఆర్థిక ఇబ్బంది. మహిళలు వంట చేసేటప్పుడు జాగ్రత్త. శ్రీవేంకటేశ్వరస్వామి ఆరాధన చేయండి.

మీనరాశి ఫలాలు : ఈరోజు శ్రమకు తగ్గ ఫలితం కనిపించదు. అనవసర ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారాలు సాధారణంగా సాగుతాయి. మహిళలకు పని బారం పెరుగుతుంది. పక్కవారితో వివాదాలు. విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులకు శ్రమ పెరుగుతుంది కానీ ఆశించిన ఫలితం రాదు. శుభ ఫలితాల కోసం ఆంజనేయస్వామి ఆరాధన చేయండి. హనుమాన్‌ చాలీసా చదువుకోండి.

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి