Zodiac Signs : ఫిబ్రవరి 08 మంగళవారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Zodiac Signs : ఫిబ్రవరి 08 మంగళవారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే..?

 Authored By prabhas | The Telugu News | Updated on :7 February 2022,10:40 pm

మేషరాశి ఫలాలు : చక్కటి ఫలితాలతో సంతోషంగా ఉంటుంది ఈరోజు. అనుకున్న పనులు పూర్తిచేస్తారు. ఆర్థిక పరిస్థితులు అనుకూలిస్తాయి. నిపుణుల సలహాలు తీసుకోకుండా షేర్‌, ట్రేడింగ్‌లు చేయకండి. మహిళలకు అనుకూలమైన ఫలితాలు వస్తాయి. శ్రీరామ రక్షా స్తోత్రం పారాయణం చేయండి. వృషభరాశి ఫలాలు : కొంచెం శ్రమతో కూడిన రోజు ఈరోజు. వివాదాలకు దూరంగా ఉండండి. అనుకోని ఇబ్బందులు రావచ్చు జాగ్రత్త. కుటుంబంలో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. మహిళలకు అనుకోని మాటలు పడాల్సి రావచ్చు. ఆర్థిక మందగమనం కనిపిస్తుంది. శ్రీ లక్ష్మీగణపతి ఆరాధన చేయండి.

మిథునరాశి ఫలాలు : శుభ ఫలితాలను పొందుతారు. అనుకోని లాభాలతో సంతోషం. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. అభివృద్ధి వైపు ప్రయాణిస్తారు. కుటుంబంలో సంతోషం, సంబురం. విందులు, వినోదాలలో పాల్గొంటారు. మహిళలకు చక్కటి రోజు. ఇష్టదేవతరాధన చేయండి. కర్కాటక రాశి ఫలాలు : కొంచెం ఆనందం,కొంచెం బాధతో కూడిన రోజు. ప్రయత్నాలు చేసినా అనుకున్నంత ఫలితం రాదు. అన్ని రకాల వృత్తుల వారికి పరీక్ష సమయం. ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. వ్యాపారలావాదేవీలు సాఫీగా సాగుతాయి. మనస్సు స్థిరంగా ఉండదు. మహిళలకు చికాకులు. శ్రీ గణపతిని ఆరాధించండి మంచి ఫలితం వస్తుంది.

Today Horoscope february 08 2022 check your zodiac signs

Today Horoscope february 08 2022 check your zodiac signs

సింహరాశి ఫలాలు : ఆనందంగా గడుస్తుంది ఈరోజు. అన్ని రకాల వృత్తుల వారికి శుభంగా ఉంటుంది. మీ తెలివితేటలను ఉపయోగించి ముందుకు పోతారు ఈరోజు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. దూరపు ప్రాంతం నుంచి ఒక శుభవార్త వింటారు. మహిళలకు ఆరోగ్యం. శ్రీ లక్ష్మీదేవి స్తోత్రం చదువుకోండి మంచి జరుగుతుంది.

కన్యారాశి ఫలాలు : అనుకోని చోట నుంచి వత్తిడులు పెరుగుతాయి. వ్యాపార వర్గాలకు ఆందోళన కలిగే రోజు. ఆర్థిక మందగమనం కనిపిస్తుంది. మనస్సులోని ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆరోగ్య విషయం జాగ్రత్త. మహిళలకు మామూలుగా ఉంటుంది. శ్రీదుర్గాదేవి ఆరాధన చేయండి.

తులారాశి ఫలాలు : పరిశ్రమించి విజయం సాధిస్తారు. అనుకున్న పనులు పూర్తి కావడంతో సంతోషంగా గడుపుతారు.
కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. పెద్దలతో పరిచయాలు. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి.విద్యార్థులకు, మహిళలకు మంచి రోజు. ఇష్టదేవతరాధన చేయండి.

వృశ్చికరాశి ఫలాలు : ధైర్యంతో ముందడుగు వేస్తారు. ఆర్థికంగా బలోపేతం అవుతారు. ఆప్పులు తీరుస్తారు. ప్రయాణాలు చేస్తారు. పోరాడి విజయం సాధిస్తారు. విద్యార్థులకు మంచి వార్తలు అందుతాయి. కుటుంబంలో ముఖ్య విషయాలు చర్చిస్తారు. మహిళలకు శుభవార్తలు. శ్రీ హేరంబ గణపతిని ఆరాధించండి.

ధనుస్సురాశి ఫలాలు : చక్కటి ఫలితాలతో ఉత్సాహంగా ఈరోజు గడిచిపోతుంది. ఆనందంగా ఉంటారు. ధన ప్రవాహం పెరుగుతుంది. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. మహిళలకు స్వర్ణలాభాలు. విద్యార్థులు, ఉద్యోగులకు లాభదాయకమైన రోజు. శ్రీలలితా దేవి ఆరాధన చేయండి.

మకరరాశి ఫలాలు : ప్రతికూలంగా ఉంటుంది ఈరోజు. పెట్టుబడులు పెట్టేటప్పుడు ఆచితూచి అడుగులు వేయండి. ఆర్థిక విషయాలలో గందరగోళం. అప్పులు కోసం ప్రయత్నిస్తారు. మహిళలకు ఆర్థిక లాభాలు. శ్రీలక్ష్మీదేవి ఆరాధన చేయండి.

కుంభరాశి ఫలాలు: వివాదాలకు దూరంగా ఉండండి. ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు పొందుతారు. ఆర్థిక విషయాలలో పురోగతి కనిపిస్తుంది. విందులు, వినోదాలలో పాల్గొంటారు. సమాజ సేవలో పాల్గొంటారు. కుటుంబంలో ముఖ్యవిషయాలు చర్చిస్తారు. శ్రీదుర్గాదేవి ఆరాధన చేయండి.

మీనరాశి ఫలాలు : ఉత్సాహంగా ఉంటుంది. మిత్రులతో ఆనందంగా గడుపుతారు. పెద్దల ద్వారా ప్రయోజనాలు పొందుతారు. ఆర్థిక విషయాలలో వృద్ధి కనిపిస్తుంది. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. మహిళలకు ధనలాభ సూచన కనిపిస్తుంది. శ్రీవిష్ణు సహస్రనామాలను పారాయణం చేయండి.

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి