Home » Devotional » Today Horoscope February 10 2022 Check Your Zodiac Signs
Devotional

Zodiac Signs : ఫిబ్రవరి 10 గురువారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే..?

Authored By
Devotional Desk
The Telugu News | Published on: February 9, 2022, 10:40 pm
Advertisement

మేషరాశి ఫలాలు : శుభ ఫలితాలతో కూడిన రోజు. ఆనందంగా సాగుతుంది. చాలా కాలం నుంచి ఎదురుచూస్తున్న అవకాశాలు, ఉద్యోగాలు, లాభాలు మీకు ఈరోజు లభించే అవకాశం ఉంది. వ్యాపారాలలో అభివృద్ది. ఆర్థిక సంతృప్తి లభిస్తుంది. మహిళలకు మంచి ఫలితాలు. శ్రీలక్ష్మీదేవి ఆరాధన చేయండి. వృషభరాశి ఫలాలు : మిశ్రమంగా ఉంటుంది. అనుకోని వివాదాలు వస్తాయి. ఆరోగ్య భంగం. ఆర్థిక మందగమనం. ప్రయాణాలు అనుకూలిస్తాయి. విద్యార్థులు, ఉద్యోగులకు పర్వాలేదు అన్నవిధంగా ఉంటుంది. మహిళలకు అనుకూలంగా ఉంటుంది ఈరోజు. శ్రీకాలభైరావాష్టకం పారాయణం చేయండి.

Advertisement

మిధునరాశి ఫలాలు : చక్కటి శుభమైన రోజు. అనుకోని చోట నుంచి లాభాలు వస్తాయి. విందులు, వినోదాలకు హాజరవుతారు. కుటుంబ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. పాలు, కూరగాయలు, ఫార్మ, మెడికల్, కుల వృత్తుల వారికి లాభదాయకమైన రోజు. మహిళలకు స్వర్ణలాభం. ఇష్టదేవతరాధన చేయండి. కర్కాటకరాశి ఫలాలు : మీ తెలివితేటలకు పరీక్ష పెట్టే రోజు. విద్యార్థుల శ్రమకు అనుకూలమైన రోజు. అన్ని రకాల పనులు సకాలంలో పూర్తిచేస్తారు. ఆర్థిక వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి. బంధువుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. పెద్దల సహకారంతో ముందుకుపోతారు. శ్రీసాయిబాబా ఆరాధన చేయండి.

Today Horoscope february 10 2022 check your zodiac signs

Advertisement

సింహరాశి ఫలాలు : ప్రతికూలంగా ఫలితాలు వుంటాయి ఈరోజు. ఆర్థిక విషయాలు నిరుత్సాహంగా ఉంటాయి. వ్యాపార లావాదేవీలలో జాగ్రత్తగా వ్యవహిరించండి. బంధువులు లేదా మిత్రులతో విభేదాలు రావచ్చు. అనారోగ్య సూచన. మహిళలకు చికాకులు. శ్రీ సుబ్రమణ్య స్వామి ఆరాధన చేయండి.

కన్యారాశి ఫలాలు : కొంచెం అనకూలంగా, కొంచెం ప్రతికూలంగా ఉంటుంది. ఆర్థిక విషయాలు మందకొడిగా ఉంటాయి. అనారోగ్య సూచనలు కనిపిస్తాయి. ఐటీ, రియల్‌ రంగం వారు ఓపికతో పనిచేయాల్సిన రోజు. కుటుంబంలో అనుకోని చిక్కులు. మహిళలకు పని భారం వత్తిడి. శ్రీలక్ష్మీగణపతి ఆరాధన చేయండి.

Advertisement

తులారాశి ఫలాలు : ఉత్సాహంగా పనులు పూర్తిచేస్తారు. కుటుంబంలో శుభకార్య ప్రయత్నం. విద్యార్థులకు మంచి ఫలితం. ఆర్థిక పురోగతి, వ్యాపారాలు లాభాల బాటలో నడుస్తాయి. ఆదాయం కోసం కొత్త ప్రయత్నాలు చేస్తారు. మహిళలకు శుభదినం. శ్రీలక్ష్మీదేవి ఆరాధన చేయండి.

వృశ్చికరాశి ఫలాలు : శుభకరమైన రోజు. ఆర్థిక విషయాలలో చక్కటి ఫలితాలు. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. అన్ని రంగాల వారికి విజయాలు వస్తాయి. మిత్రుల సహకారంతో వ్యవహారాలలో ముందడుగు. కుటుంబంలో సంతోషం. ఇష్టదేవతరాధన చేయండి.

ధనుస్సురాశి ఫలాలు : ఇబ్బందికరమైన రోజు. వివాదాలకు దూరంగా ఉండాల్సిన రోజు. ఆర్థిక విషయాలలో సమస్యలు రావచ్చు. అప్పుల కోసం ప్రయత్నిస్తారు. మీ ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలలో మందకొడితనం కనిపిస్తుంది. దూర ప్రయాణాలు చేస్తారు. మహిలలకు అనుకోని వివాదాలు. శ్రీ దత్త కవచం పారాయణ చేయండి.

మకరరాశి ఫలాలు : శ్రమ భారం పెరుగుతుంది. కనిపించని శత్రువుల ద్వారా ఇబ్బందులు,. వివాదాలకు దూరంగా ఉండాల్సిన రోజు. పెద్దల సలహాలను పాటించండి లేకుంటే ఇబ్బందులు. దేవాలయాలను సందర్శించే అవకాశం ఉంది. విద్యార్థుల శ్రమకుతగ్గ ఫలితం కనిపించదు. మహిళలకు చికాకులు. శ్రీవేంకటేశ్వర స్వామి ఆరాధన చేయండి.

Advertisement

కుంభరాశి ఫలాలు : మంచి ఫలితాలు వస్తాయి. ఆనందంగా ఈరోజు గడిచిపోతుంది. అనుకోని చోట నుంచి లాభాలు వస్తాయి. ఆదాయం కోసం కొత్త మార్గాలను వెదుకుతారు. విజయాలను సాధిస్తారు. ఉద్యోగులకు అనుకూలమైన రోజు. మహిళలకు శుభ ఫలితాలు. ఇష్టదేవతారాధన చేయండి.

మీనరాశి ఫలాలు : కొంత ప్రతికూల వాతావరణం కనిపిస్తుంది. ఆర్తిక విషయాలలో మందకొడి తనం కనిపిస్తుంది. వ్యాపారాలు నిర్వహించే వారు జాగ్రత్తగా మసులుకోవాల్సిన రోజు. అన్ని రకాల వృత్తుల వారికి పని వత్తిడి కనిపిస్తుంది. అప్పుల కోసం ప్రయత్నం చేస్తారు. వివాదాలకు దూరంగా ఉండండి. శ్రీకాలభైరావాష్టకం చదువుకోండి.

Devotional Desk

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి