Zodiac Signs : ఫిబ్రవరి 14 సోమవారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే..?

Authored By Devotional Desk | The Telugu News | Updated on : 13 February 2022, 10:40 pm

మేషరాశి ఫలాలు : అనుకూలమైన రోజు. అన్ని రంగాల వారికి చక్కటి ఫలితాలు వస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది. వ్యాపారాలు బాగుంటాయి. ఇష్టమైన వారి నుంచి శుభవార్తలు అందుతాయి. మహిళలకు ఈరోజు బాగుంటుంది. ఇష్టదేవతరాధన చేయండి. వృషభరాశి ఫలాలు : అనుకున్న పనులు పూర్తిచేస్తారు. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ఉత్సాహంగా ఈరోజు గడుస్తుంది. మహిళలకు అనుకూలం. శ్రీ ఆంజనేయస్వామి ఆరాధన చేయండి.

మిధునరాశి ఫలాలు : ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. అప్పుల కోసం ప్రయత్నాలు చేస్తారు. కొత్త పెట్టుబడులు పెట్టడానికి అనుకూలమైన రోజు. వ్యవహారాలు బెడిసికొడుతాయి. ఆరోగ్యం జాగ్రత్త. మహిళలకు ధనలాభాలు. శ్రీదుర్గాదేవి ఆరాధన చేయండి. కర్కాటకరాశి : శుభకార్యాలకు హాజరవుతారు. అనుకోని లాభాలు వస్తాయి. పాత బాకీలు వసూలు అవుతాయి. విందులు, వినోదాలకు హజరవుతారు. మహిళలకు శుభకరమైనది. అన్ని రంగాల వారికి అనుకూలమైనది. శివారాధన చేయండి.

Today Horoscope february 14 2022 check your zodiac signs

Today Horoscope february 14 2022 check your zodiac signs

సింహరాశి ఫలాలు : ఆటంకాలను అధిగమిస్తారు. అప్పులను తీరుస్తారు. చాలా కాలంగా పెండింగ్ ఉన్న పనులు పూర్తిచేస్తారు. విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. మహిళలకు శుభదినం. శ్రీలక్ష్మీదేవి ఆరాధన చేయండి.

కన్యారాశి ఫలాలు : ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. కుటుంబంలో పరిస్థితులు అనుకూలంగా ఉండవు. ఇతరుల కార్యక్రమాలలో, పనులలో అనవసరంగా జోక్యం చేసుకోకండి. కుటుంబంలో సభ్యుల ఆరోగ్యం జాగ్రత్త. మహిళలకు చికాకులు, పని భారం. శ్రీ శివారాధన చేయండి.

తులారాశి ఫలాలు : అనుకోని చికాకులు. ఆర్థికంగా ప్రయోజనం ఉండని రోజు. వ్యాపారలావాదేవీలు మామలుగా ఉంటాయి. అనవసరంగా ఎవరికి ధనం ఇవ్వకండి. అప్పులు ఇవ్వకండి. కుటుంబంలో, కార్యాలయాలలో చికాకులు, సమస్యలు రావచ్చు. సమయస్పూర్తితో వ్యవహరించాల్సిన రోజు. శివుడని తుమ్మిపూలు, మారేడుదళాలతో అర్చన చేయండి మంచి జరుగుతుంది.

వృశ్చికరాశి ఫలాలు : చక్కటి ఫలితాలతో ఉత్సాహంగా గడిచిపోతుంది ఈరోజు. అనుకూలమైన మిత్రులతో ప్రయోజనాలు పొందుతారు. కుటుంబంలో శుభకార్య ప్రయత్నాలు చేస్తారు. చాలా కాలంగా వసూలు కాని బాకీలు వసూలు అవుతాయి. మహిళలకు స్వర్ణ లాభాలు. ఇష్టదేవతరాధన చేయండి.

ధనుస్సురాశి ఫలాలు : చాలా ఉత్సాహంగా, ఉల్లాసంగా ఈరోజు గడిచిపోతుంది. ఆరోగ్యం బాగుంటుంది. పెద్దల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ఆర్తికంగా మంచి ఫలితాలు. అప్పులు తీరుస్తారు. విద్యార్థులకు, ఉద్యోగులకు చక్కటి రోజు. మహిళలకు లాభాలు. లక్ష్మీ, కుబేర ఆరాధన చేయండి.

మకరరాశి ఫలాలు : అనవసర వివాదలకు ఆస్కారం ఉంది జాగ్రత్త. మీ పని మీరు చేసుకోండి. ఓపికతో గడపాల్సిన రోజుల్లో ఇది ఒకటి. ఆర్థికంగా సాధారణంగా ఉంటుంది. వ్యాపార లావాదేవీలు సాఫీగా సాగుతాయి. అనుకోని వివాదాలకు అవకాశం. ఖర్చులు పెరుగుతాయి. మహిళలకు అనారోగ్య సూచన. శ్రీ గణపతి ఆరాధన చేయండి.

కుంభరాశి ఫలాలు : కొంచెం మంచి, కొంచెం చెడు ఫలితాలతో గడుస్తుంది. ప్రయాణాలు వాయిదా పడుతాయి. అప్పులు వసూలు అవుతాయి. అనవసర ఖర్చులు పెరుగుతాయి. పెద్దల నుంచి కొంచెం ఇబ్బందులు రావచ్చు. మహిళలకు చికాకులు. శ్రీ హనుమాన్ ఆరాధన చేయండి.

మీనరాశి ఫలాలు : విజయాలతో సంతోషంగా ఉంటుంది. సోదర వర్గం సహకారంతో ముందుకుపోతారు. కొత్త పెట్టుబడులకు అనుకూలంగా ఉంది. ఆరోగ్యం బాగుంటుంది. వ్యాపార లావాదేవీలు సాఫీగా సాగుతాయి. అనుకూలమైన రోజు. మహిళలకు సంతోషంగా ఉంటుంది. శ్రీలక్ష్మీదేవి ఆరాధన చేయండి.

ఈ రోజు అనుకున్న పనులలో విజయం సాధిస్తారు. సోదరులతో వివాదాలు రాజీ చేసుకుంటారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. భూ సంబంధిత క్రయ విక్రయాలు లాభిస్తాయి. కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు అమలుపరుస్తారు. వ్యాపారాలకు నూతన పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగ వాతావరణం సంతృప్తికరంగా ఉంటుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సూర్య దేవుని ఆరాధన చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

Devotional Desk

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి