Zodiac Signs : ఫిబ్రవరి 23 బుధవారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే..?

Authored By Prahbas Gilakathula | The Telugu News | Updated on : 22 February 2022, 10:40 pm

మేషరాశి ఫలాలు : చక్కటి ప్రగతి పథంలో నడిచే రోజు ఇది. అన్ని రకాల వ్యాపారులకు మంచి లాభాలు. ఆర్థిక పురోగతి కనిపిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. పాత రిలేషన్స్‌ బలపడుతాయి.మహిళలకు లాభదాయకమైన రోజు. వృషభరాశి ఫలాలు : గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆర్థిక వనరులు పెరుగుతాయి. అప్పులు తీరుస్తారు. క్షేత్రాలు, విహారయాత్రలు చేస్తారు. అన్నింటా విజయం సాధిస్తారు. పెద్దల వల్ల ప్రయోజనాలు పొందుతారు. మహిళలకు ధనలాభాలు. శ్రీ కాలభైరవాష్టకం పారాయణం చేయండి.

మిథునరాశి ఫలాలు : కొద్దిగా ఇబ్బందిపడే రోజు. అనుకోని ఖర్చులు పెరగడం వల్ల ఆర్థిక ఇబ్బందులు. కుటుంబంలో సమస్యలు వస్తాయి. మిత్రుల వల్ల వివాదాలు రావచ్చు. వ్యాపారాలు చేసే వారు కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాల్సిన రోజు. మహిళలకు చికాకులు పెరుగుతాయి. శ్రీ లక్ష్మీగణపతి ఆరాధన చేయండి. కర్కాటకరాశి ఫలాలు : పని భారం పెరుగుతుంది. అనుకోని నష్టాలు వస్తాయి. ఆదాయం మందగిస్తుంది. ప్రతిచోట మీకు పరీక్ష లాగా ఉంటుంది. మీరు కోరుకున్న వన్నీ కాకపోవడం వల్ల చికాకు, నిరాశ కలుగుతుంది. ఆస్తి సంబంధించిన వ్యవహారాలు జాగ్రత్త. మహిళలకు పని భారం. శ్రీ దుర్గాసూక్త పారాయణం చేయండి మంచి ఫలితం వస్తుంది.

Today Horoscope february 23 2022 check your zodiac signs

Today Horoscope february 23 2022 check your zodiac signs

సింహరాశి ఫలాలు : శుభ సమయం ఈరోజు. అనుకున్న పనులు చక్కగా పూర్తిచేస్తారు. అతిథుల రాకతో ఇంట్లో సందడి. కుటుంబంలో శుభకార్య యోచన. అప్పులు తీరుస్తారు. అనుకోని చోట నుంచి లాభాలు వస్తాయి. మహిళలకు స్వర్ణ లాభాలు. శ్రీలక్ష్మీదేవి ఆరాధన చేయండి.

కన్యారాశి ఫలాలు : ఆందోళనతో ఈరోజు గడుస్తుంది. అప్పులు చేయడానికి ప్రయత్నిస్తారు. పనులు నెమ్మదిగా సాగుతాయి. మీ శ్రమకు తగ్గ ఫలితం ఈరోజు రాదు. ధన సంబంధ విషయాలలో ఇబ్బందులు. మహిళలకు అనారోగ్య సూచన కనిపిస్తుంది. గణపతి ఆరాధన చేయండి.

తులారాశి ఫలాలు : విజయవంతంగా పనులు పూర్తిచేస్తున్నారు. విందులు, వినోదాలకు హాజరవుతారు. ఆర్థిక విషయాలు సంతోషకరంగా ఉంటాయి. చాలాకాలంగా ఉన్న సమస్యలు పరిష్కారం అవుతున్నాయి. అప్పులు తీరుస్తారు. మహిళలకు దూర ప్రాంతాల నుంచి

వృశ్చికరాశి ఫలాలు : అనుకోని కష్టాలు వస్తాయి. అప్పులు చేయడానికి ప్రయత్నిస్తారు. ఆర్థిక పరిస్తితి మందగిస్తుంది. వ్యాపారాలు సాధారణంగా ఉండదు. కుటుంబంలో చిన్నచిన్న సమస్యలు. విద్యార్థులు, ఉద్యోగులతకు పని భారం పెరుగుతుంది. మహిళలకు చికాకులు. శ్రీ దత్తాత్రేయ స్వామి ఆరాధన చేయండి.

ధనుస్సురాశి ఫలాలు : మీరు చాలాకాలంగా ఎదురుచూస్తున్న వార్తలు వింటారు. అప్పులు తీరుస్తారు. ఆర్థికంగా మంచి ఫలితాలు సాధిస్తారు. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది. విలువైన వస్తువులు కొంటారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు అనుకున్న చోటికి బదిలీ, ఆర్థికంగా ఉద్యోగులకు బాగుంటుంది. మహిళలకు అనందంగా ఉంటుంది. ఇష్టదేవతరాధన చేయండి.

మకరరాశి ఫలాలు : ఉల్లాసంగా, ఉత్సాహంగా ఈరోజు గడుస్తుంది. ఆర్థిక విషయాలలో పురోగతి కనిపిస్తుంది. అప్పులు తీరుస్తారు. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. విలువైన వస్తువులు కొంటారు. ఐటీ, రియల్‌ రంగంలో వారికి లాభాలు. విద్యార్థులకు విజయం. మహిళలకు శుభమైన రోజు. శ్రీ దుర్గాదేవి ఆరాధన చేయండి.

కుంభరాశి ఫలాలు : ఆదాయానికి మించి ఖర్చులు వస్తాయి. ప్రయాణాలలో విలువైన వస్తువులు జాగ్రత్త. కుటుంబంలో వివాదాలు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. అన్ని రకాల వ్యాపారాలు నిరాశ జనకంగా ఉంటుంది. విద్యార్థులకు, ఉద్యోగాలకు ఈరోజు సాధారణంగా ఉంటుంది. మహిళలకు పని వత్తిడి పెరుగుతుంది. శ్రీ కనకదుర్గాదేవి ఆరాధన చేయండి.

మీనరాశి ఫలాలు : మీరు చేసే పనులలో ఇబ్బందులు వస్తాయి. ఆర్థికంగా మందగమనం. దేవాలయ సందర్శన. కుటుంబంలో వివాదాలకు అవకాశం. అప్పులు చేయాల్సిన పరిస్థితి. పిల్లల వల్ల చికాకులు, ఆరోగ్య బాధలు. మహిళలకు అనుకోని ఇబ్బందులు. రుద్రాభిషేకం చేయించండి మంచి ఫలితం వస్తుంది.కుటుంబసభ్యులతో తగాదాలు. ఆలోచనలు కలసిరావు. పనులు వాయిదా వేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో కొన్ని సమస్యలు. ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి