Horoscope : మార్చి 25 రాశిఫ‌లాలు.. ఈ రాశి వారికి అధిక లాభాలు

Advertisement
Published by
Advertisement

Horoscope : మార్చి 25 – ఫాల్గుణ మాసం – గురువారం – ఏకాదశి. శ్రీ శార్వరి నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిరఋతువు, ఫాల్గుణమాసం, శుక్లపక్షం, తిథి: ఏకాదశి ఉదయం 9.48 వరకు తదుపరి ద్వాదశి, నక్షత్రం: ఆశ్లేష రాత్రి 10.49 వరకు తదుపరి మఘ, వర్జ్యం: ఉదయం 11.48 నుండి పగలు 1.22 వరకు, అమృత ఘడియలు: రాత్రి 9.15 నుండి 10.49 వరకు, దుర్ముహూర్తం: ఉదయం 10.20 నుండి 11.09 వరకు, పునర్ దుర్ముహూర్తం: పగలు 3.13 నుండి 4.02 వరకు.
రాహుకాలం: పగలు 1.54 నుండి 3.25 వరకు ఉంటుంది.

Advertisement

Horoscope మేషరాశి : ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది !

ఈరోజు అనుకూలంగా లేదు. అవసరానికి డబ్బులు చేతికి అందక మనోవేదనకు గురవుతారు. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో చిన్నచిన్న వేధింపులు కలుగుతాయి. నూతన వ్యక్తులను నమ్మడం వల్ల మోసపోతారు. ఆహార నియమాలు పాటించకపోవడం వల్ల అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. అనుకున్న పనులను తొందరగా పూర్తి చేయక వాయిదా పడతాయి. ఇబ్బందులు కలుగుతాయి. వ్యసనాలకు దూరంగా ఉండండి. కుటుంబంలో సమస్యలు ఎదురవుతాయి. విద్యార్థులు చదువు విషయాన్ని అశ్రద్ధ చేస్తారు. వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు కలుగుతాయి. ఈ రోజు శివారాధన చేయండి. దగ్గర్లో ఉన్న శివాలయానికి వెళ్లి దర్శించుకుని శివుడికి అభిషేకం చేయించుకోండి.

Advertisement

Horoscope వృషభ రాశి : రుణబాధలు తగ్గిపోతాయి !

ఈ రోజు ఆనందకరంగా ఉంటుంది. కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. రుణబాధలు తగ్గిపోతాయి. చేపట్టిన పనులను సంతోషంగా చక్కగా అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో బాధ్యతయుతంగా ఉంటారు. వ్యాపారంలో అధిక ఆర్థిక లాభాలు కలుగుతాయి. ఉన్నత వ్యక్తుల పరిచయాలను ఏర్పర్చుకుంటారు. విద్యార్థులు సాంకేతిక విద్య మీద శ్రద్ధ చూపుతారు. స్త్రీలు పని భారం తగ్గించుకుని సంతోషంగా ఉంటారు. ఈరోజు కనకధారా స్తోత్ర పారాయణం చేసుకోండి.

మిధున రాశి : వ్యసనాలకు దూరంగా ఉండండి !

ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి ప్రయత్నిస్తారు. విద్యార్థులు రాబోయే రోజుల గురించి ఆలోచించి చదువు శ్రద్ధ కోల్పోతారు. స్త్రీలకు కుటుంబ సమస్యలు ఏర్పడతాయి. ప్రశాంతత కోల్పోతారు. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో పనిభారం ఎక్కువ అవుతుంది. వ్యాపారాల్లో పెట్టుబడులు అనుకూలించక కష్టాలు కలుగుతాయి. ప్రయాణ ఆటంకాలు కలుగుతాయి. చిన్నచిన్న ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. వ్యసనాలకు దూరంగా ఉండండి. ఈరోజు నవగ్రహ స్తోత్ర పారాయణం చేసుకోండి. దగ్గర్లో ఉన్న ఆలయానికి వెళ్లి నవగ్రహాలకు 11 ప్రదక్షిణలు చేయండి.

కర్కాటక రాశి : పెట్టుబడులు అనుకూలిస్తాయి !

ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు ఎదురైనా కష్టపడి ఆత్మస్థైర్యంతో అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. వ్యాపారాల్లో పెట్టుబడులు అనుకూలిస్తాయి. అనుకున్న దాని కంటే అధిక లాభాలు కలుగుతాయి. నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పరచుకుంటారు. ధనప్రాప్తి కలుగుతుంది. ఆనందంగా ఉంటారు. దంపతులిద్దరూ అన్యోన్యంగా ఉంటారు. వస్తువుల క్రయ విక్రయాలు అనుకూలిస్తాయి. కుటుంబ సభ్యులతో కలిసి మెలిసి సఖ్యతగా ఆనందంగా ఉంటారు. విద్యార్థులు పెద్ద వారి మాటలను గౌరవించి కష్టపడి చదువుకుంటారు. స్త్రీలు కుటుంబ బాధ్యతలను పెంచుకుంటారు. విహార యాత్రలు చేస్తారు.
ఈరోజు అష్టలక్ష్మి స్తోత్రం పారాయణం చేసుకోండి.

సింహరాశి : స్నేహితులు కూడా శత్రువులు అవుతారు !

ఈరోజు సంతోషకరంగా లేదు. అనుకున్న పనులు వాయిదా పడతాయి. మనోవేదనకు గురవుతారు. అనవసరపు ఖర్చులు ఎక్కువ అవుతాయి. ఇబ్బందులు కలుగుతాయి. మీలో ఉన్న చికాకు వల్ల మీరంటే ఇష్టపడే వారిని దూరం చేసుకుంటారు. వ్యాపారాల్లో కష్టానికి తగ్గ ఫలితం లేకపోవడంవల్ల మనోవేదనకు గురవుతారు. స్నేహితులు కూడా శత్రువులు అవుతారు. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో శ్రమ ఎక్కువ. అయినా ఫలితం లేక పోవడం వల్ల మనోవేదనకు గురవుతారు. విద్యార్థులు చదువు విషయంలో ఏకాగ్రత కోల్పోతారు. స్త్రీలు విలువైన వస్తువులను పోగొట్టుకుంటారు. మనోవేదనకు గురవుతారు. ఈరోజు అష్టాదశ శక్తిపీఠ స్తోత్ర పారాయణం చేసుకోండి.

కన్యారాశి : అధిక లాభాలు !

ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో ప్రమోషన్లు పొందుతారు. వ్యాపారాల్లో వడిదుడుకులు దూరం అవడం వల్ల అధిక లాభాలు కలుగుతాయి. దంపతులిద్దరూ ఒకరికొకరు సహాయం చేసుకుంటూ అన్యోన్యంగా ఉంటారు. స్త్రీలు లాభం పొందుతారు. సంతోషంగా ఉంటారు. విద్యార్థులు భవిష్యత్ గురించి ఆలోచించి కష్టపడి చదువుకుంటారు. స్థిరాస్తులు అనుకూలిస్తాయి. వివాహ సంబంధ విషయాలు అనుకూలిస్తాయి. ఈరోజు బాలాత్రిపురసుందరి అమ్మవారిని ఆరాధించండి.

horoscope

తులారాశి : ప్రయాణంలో ఇబ్బందులు ఏర్పడతాయి !

ఈరోజు అనుకూలంగా లేదు. సంపాదన తక్కువ, ఖర్చు ఎక్కువ అవుతుంది. అనవసర ఖర్చులు అధికమవుతాయి. ధననష్టం కలుగుతుంది. బంధువుల నుంచి విభేదాలు కలుగుతాయి. మీలో ఉన్న కోపం వల్ల కుటుంబ సభ్యులతో అభిప్రాయబేధాలు ఏర్పరచుకుంటారు. విద్యార్థులు స్నేహితులతో సమయాన్ని గడిపితే చదువు విషయంలో శ్రద్ధ కోల్పోతారు. వ్యాపారాల్లో ఆశించిన లాభాలు లేకపోవడం వల్ల మనోవేదనకు గురవుతారు. స్త్రీలకు పని ఒత్తిడి ఎక్కువవుతోంది. ప్రశాంతత కోల్పోతారు. ప్రయాణంలో ఇబ్బందులు ఏర్పడతాయి. వాహన ప్రయాణాలు నిర్లక్ష్యం చేయడం వల్ల ప్రమాదాలు ఏర్పడతాయి. ఈరోజు శ్రీ భ్రమరాంబిక అమ్మవారిని ఆరాధించండి.

వృశ్చిక రాశి : నూతన పెట్టుబడులు అనుకూలిస్తాయి !

ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. మీకు మీరే ఆలోచించుకొని మంచి వారిగా మారిపోతారు. పిల్లల విషయంలో శ్రద్ధ చూపుతారు. నీతి నిజాయితీకి, ఆచార సాంప్రదాయాలకు పద్ధతులకు ప్రాధాన్యతనిస్తారు. గతంలో దూరం చేసుకున్న వాళ్లతో తిరిగి స్నేహం ఏర్పరచుకుంటారు. విద్యార్థులు కష్టపడి చదువుకుని క్రొత్త క్రొత్త విషయాలను నేర్చుకుంటారు. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో ఉన్నతమైన హోదాను పొందుతారు. స్త్రీలు పెద్ద వారిని గౌరవిస్తారు. దైవారాధన చేస్తారు. ఆనందంగా ఉంటారు. వ్యాపారాల్లో నూతన పెట్టుబడులు అనుకూలిస్తాయి. అధిక లాభాలు కలుగుతాయి. ఈ రోజు అన్నపూర్ణ అష్టకం పారాయణం చేసుకోండి.

ధనస్సు రాశి : అనుకోని అవమానాలు ఎదురవుతాయి !

ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. మీలో ఉన్న మొండి పట్టుదల వల్ల, కోపం వల్ల నష్టపోతారు. అనుకోని అవమానాలు ఎదురవుతాయి. చేపట్టిన పనులు ఆలస్యమై వాయిదా పడతాయి. మనోవేదనకు గురవుతారు. కుటుంబంలో ఖర్చులు అధికమవుతాయి. తొందరపడి ఇతరులను నమ్మడం వల్ల మోసపోతారు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. తక్కువ మాట్లాడడం మంచిది. మీలో ఉన్న కోపం వల్ల స్నేహితులు దూరం అవుతారు. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో సమయం పాటించకపోవడం వల్ల పై అధికారుల ఒత్తిడి ఏర్పడుతుంది. విద్యార్థులు అనవసర విషయాలను పట్టించుకోని చదువు విషయంలో శ్రద్ధ కోల్పోతారు. ఈరోజు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేసుకోండి.

మకర రాశి : సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు !

ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. స్నేహితులతో కలిసి మెలిసి ఆనందంగా సఖ్యతగా ఉంటారు. కుటుంబ సభ్యులను పెద్దవారిని తల్లిదండ్రులను గౌరవిస్తారు. వారు చెప్పిన మాటలను సూచనలను పాటిస్తారు. సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు. దైవ చింతన చేస్తారు. అపారమైన భక్తి కలిగి ఉంటారు. మీలో ఉన్న బద్దకాన్ని తొలగించుకొని అనుకున్న పనులను సరైన సమయానికి పూర్తిచేస్తారు. మీలో ఉన్న వాక్చాతుర్యంతో ఎదుటి వారిని ప్రోత్సహిస్తారు. ముఖ్యమైన విషయాల్లో రాబోయే రోజుల గురించి దీర్ఘాలోచన చేస్తారు. నిర్ణయాలు తీసుకుంటారు. విద్యార్థులు కష్టపడి చదువుకొని పోటీ పరీక్షల్లో ఉన్నతశ్రేణి మార్కులు పొందుతారు. వ్యాపారాల్లో భాగస్వాముల వల్ల అధిక లాభాలు కలుగుతాయి. ఈరోజు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారిని ఆరాధించండి.

కుంభరాశి : వ్యసనాలకు దూరంగా ఉండండి !

ఈరోజు ప్రయోజనకరంగా లేదు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలని తప్పుడు మార్గంలో వెళ్లడం వల్ల నష్టం కలుగుతుంది. ఇబ్బందులు ఎదురవుతాయి. అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. వాహన ప్రయాణ విషయంలో అశ్రద్ధ చేయడం వల్ల ప్రమాదాలు ఏర్పడతాయి. వ్యసనాలకు దూరంగా ఉండండి. విద్యార్థులు ఒత్తిడికి లోనై చదువు విషయంలో ఏకాగ్రత కోల్పోతారు. వ్యాపారాల్లో ఆటంకాలు ఎదురైనా స్వల్ప నష్టాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో తోటి ఉద్యోగులతో ఇబ్బందులు ఏర్పడతాయి. ఈరోజు విష్ణుసహస్రనామ పారాయణం చేసుకోండి.

మీనరాశి : ధనయోగం కలుగుతుంది !

ఈ రోజు బాగుంటుంది. ముఖ్యమైన విషయాల్లో ఆలోచించి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. ప్రయాణ అనుకూలత ఏర్పడుతుంది. ఆదాయం ఎక్కువ, ఖర్చు తక్కువ అవుతుంది. ధనయోగం కలుగుతుంది. ఉన్నత వ్యక్తుల పరిచయాలు ఆనందాన్ని కలిగిస్తాయి. కొత్త ఇంటిని కొనుగోలు చేస్తారు. ఆచార సాంప్రదాయాలకు, ధర్మానికి పద్ధతులకు ప్రాధాన్యతనిస్తారు. సంపూర్ణ ఆరోగ్యాన్ని కలిగి ఉంటారు. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో కోరుకున్న ప్రాంతాలకు బదిలీ అవుతారు. విద్యార్థులు కష్టపడి చదువు కుంటారు. ఉన్నత కళాశాలల్లో ప్రవేశాలు పొందుతారు. దంపతులిద్దరూ అన్యోన్యంగా ఉంటారు. స్త్రీలు విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. వ్యాపారాల్లో మంచి అవకాశాలు వస్తాయి. అధిక ఆర్థిక లాభాలు కలుగుతాయి. ఈరోజు శ్రీ అలివేలు మంగ సమేత శ్రీ వేంకటేశ్వర స్వామిని ఆరాధించండి.

Advertisement

Recent Posts

Rajinikanth : రాజకీయాల్లోకి వచ్చుంటే సీఎం అయ్యేవాడిని.. రజినీకాంత్ సంచలన వ్యాఖ్యలు!

Rajinikanth :  సూపర్ స్టార్ Rajinikanth మరోసారి రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “నేను రాజకీయాల్లోకి రానని ఎప్పుడో స్పష్టంగా…

3 hours ago

Linguda : లింగుడా ఆకుకూరలో దాగి ఉన్న అద్భుత ప్రయోజనాలు.. షుగర్, జాయింట్ పెయిన్‌కు సూపర్ ఫుడ్..!

Linguda  : ప్రకృతిలో లభించే కొన్ని ఆహార పదార్థాలు ఆరోగ్యానికి అద్భుత ప్రయోజనాలు అందిస్తాయని నిపుణులు చెబుతుంటారు. అలాంటి వాటిలో…

4 hours ago

Fenugreek Seeds : మెంతులు శరీరంలో వేడి పెంచుతాయా..? తగ్గిస్తాయా..? అసలు నిజం ఇదే!

Fenugreek Seeds : మెంతులు భారతీయ వంటకాలలో విరివిగా ఉపయోగించే ముఖ్యమైన పదార్థాల్లో ఒకటి. వీటిని ఆరోగ్యానికి ఎంతో మేలు…

8 hours ago

Bottle Gourd Juice : సొరకాయ జ్యూస్‌తో నిజంగానే పొట్ట కొవ్వు తగ్గుతుందా..? నిపుణులు చెప్పిన నిజాలు ఇవే!

Bottle Gourd Juice : ప్రస్తుతం బరువు తగ్గడం, ముఖ్యంగా పొట్ట చుట్టూ పేరుకుపోయే కొవ్వును తగ్గించుకోవడం కోసం చాలామంది…

2 days ago

Petrol : భారత్‌లో అత్యధికంగా పెట్రోల్ వాడేది ఏ రాష్ట్రం..? షాకింగ్ గణాంకాలు వైరల్!

Petrol  : భారత్‌లో పెట్రోల్ వినియోగంపై తాజాగా వెలువడిన గణాంకాలు ఆసక్తికర చర్చకు దారితీశాయి. దేశంలో ఒక్కో వ్యక్తి ప్రాతిపదికన…

3 days ago

PM Modi : ఖర్చు ఆపమని కాదు.. తెలివిగా ఖర్చు చేయమన్న మోదీ.. కేంద్రం క్లారిటీ!

PM Modi : ప్రధానమంత్రి Narendra Modi ఇటీవల చేసిన “స్మార్ట్ స్పెండింగ్” పిలుపు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బంగారం…

3 days ago

Farmers Good News : రైతులకు గుడ్ న్యూస్.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం.. !

Farmers Good News : కేంద్ర ప్రభుత్వం రైతులు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధిపై కీలక నిర్ణయాలు తీసుకుంది. తాజాగా…

3 days ago

Donald Trump : చైనాలో ట్రంప్ కి అవ‌మానం.. ప్రపంచ రాజకీయాల్లో కొత్త చర్చ!

Donald Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు Donald Trump చైనా పర్యటనకు సంబంధించిన వార్తలు ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాల్లో…

3 days ago

Heart Health : హార్ట్ స్ట్రాంగ్‌గా ఉండాలంటే ఇవి చేయండి.. గుండె ఆరోగ్యానికి సింపుల్ ఫిట్‌నెస్ టిప్స్!

Heart Health : ప్రస్తుతం గుండె జబ్బులు ప్రపంచవ్యాప్తంగా ప్రధాన ఆరోగ్య సమస్యగా మారుతున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా యువతలో…

4 days ago

Working Hours : ఎక్కువసేపు కూర్చునే పని చేస్తున్నారా..? అయితే మీరు డేంజ‌ర్‌లో ప‌డ్డ‌ట్టే..?

Working Hours : ప్రస్తుతం చాలా మంది ఉద్యోగులు రోజుకు 8 నుంచి 12 గంటల వరకు కంప్యూటర్ ముందు…

4 days ago

AP Rajya Sabha : ఏపీ రాజ్యసభ రేసులో కొత్త ట్విస్ట్.. టీడీపీ-జనసేన అభ్యర్థులపై కీలక నిర్ణయం!

AP Rajya Sabha : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి రాజ్యసభ ఎన్నికల హడావిడి మొదలైంది. రాష్ట్రంలో ఖాళీ కానున్న రాజ్యసభ…

4 days ago

Anushka Shetty : ఫస్ట్ లవ్‌పై మనసు విప్పిన అనుష్క.. అత‌ని గురించి చెప్పిన మాటలు వైరల్

Anushka Shetty : దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న Anushka Shetty మరోసారి వార్తల్లో…

4 days ago