Today horoscope : న‌వంబ‌ర్‌ 02 2021 మంగ‌ళవారం మీ రాశిఫ‌లాలు

Authored By Devotional Desk | The Telugu News | Published on: November 2, 2021, 6:00 am

మేషరాశి ఫలాలు : ఈరోజు ఇబ్బందులు. ఆకస్మిక ఇబ్బందులు. ఆనారోగ్య సూచనలు. కుటుంబ సభ్యులతో వివాదాలు రావచ్చు ఓపికతో ఉండండి. ఆర్థిక ఇబ్బందులు రావచ్చు. రుణ ప్రయత్నాలు చేస్తారు. విద్యార్థులు బాగా శ్రమించాల్సి ఉంటుంది. శ్రీ మంగళ పార్వతీ ఆరాధన చేయండి. వృషభరాశి ఫలాలు : ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. అప్పుల బాధలు. పాత బాకీలు వసూలు. ఆఫీస్‌లో శ్రమ తప్పదు. కుటుంబ సభ్యులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. ప్రయాణాలు చేస్తారు.ఆర్థిక విషయాలలో జాగ్రత్తలు. విద్యార్థులు మంచి ఫలితాలు వస్తాయి. శ్రీ దుర్గాదేవి ఆరాధన చేయండి.

మిథునరాశి ఫలాలు : ఈరోజు అత్యంత అనుకూలంగా ఉంటుంది. మీరు చేసే పనులలో విజయం సాధిస్తారు. బంధువుల లేదా స్నేహితుల నుంచి శుభవార్తలు వింటారు. వ్యాపారులకు ధనలాభం. పాత బాకీలు వసూలవుతాయి. విద్యార్థులు మంచి ఫలితాలను పొందుతారు. శ్రీరామ రక్ష స్తోత్రం పారాయణం చేయండి. కర్కాటకరాశి ఫలాలు : ఈరోజు ఇబ్బందులు. అనారోగ్య సూచనలు. వ్యాపారాలు నష్టాల బాటలో నడుస్తాయి. కుటుంబంలో సమస్యలు రావచ్చు జాగ్రత్త. ఆఫీస్‌లో అకారణంగా వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. శ్రమకు తగ్గ ఫలితం లభించదు. శ్రీ కాలభైరవాష్టకం పారాయణం చేయండి.

today horoscope in telugu

today horoscope in telugu

సింహరాశి ఫలాలు :ఈరోజు సంతోషంతో గడుపుతారు. శుభకార్య నిర్వహణ. పాత బాకీలు వసూలు అవుతాయి. వ్యాపారాలు లాభాల బాటలో నడుస్తాయి. విందులు, వినోదాలకు హాజరవుతారు. ఆఫీస్‌లో పై అధికారుల ప్రశంసలు అందుకుంటారు.విద్యార్థులక అనుకూల కాలం. దేవాలయం దర్శించండి.

కన్యరాశి ఫలాలు : ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది. ఆశించిన మేరకు పనులు పూర్తికావు. అనవసర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఆఫీస్‌లో శ్రద్దతో పనిచేయాలి. బంధువుల నుంచి ఇబ్బందులు ఎదురుకావచ్చు. అప్పులు చేయాల్సిన పరిస్థితి. ధనం విషయంలో జాగ్రత్తగా ఉండండి. శ్రీ లక్ష్మీదేవి, కుబేరులను ఆరాధించండి.

తులారాశి ఫలాలు : ఈరోజు సమస్యల నుంచి గట్టెక్కుతారు. మంచి వార్తలు వింటారు. బంధువుల నుంచి సహకారం లభిస్తుంది. వ్యాపారంలో లాభాలు రావచ్చు. ధనం కోసం ఎదురుచూడకుండా చేతి నిండా ఉంటుంది. ఆఫీస్‌లో అనుకూలమైన రోజు. విద్యార్తులు మంచి ఫలితాలను పొందుతారు. శ్రీ శివ పూజ చేయండి.

today horoscope in telugu

today horoscope in telugu

వృశ్చికరాశి ఫలాలు : ఈరోజు ఉత్సాహభరితంగా గడుపుతారు. ఆర్థికంగా పరిపుష్టి కలుగుతుంది. బంధువుల నుంచి బహుమతులు అందుకుంటారు. కుంటుంబానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు.విద్యార్థులకు చదువుకు సంబంధించిన ఆటంకాలు తొలగుతాయి. శ్రీ దుర్గాదేవి దగ్గర దీపం పెట్టండి.

ధనుస్సురాశి ఫలాలు : ఈరోజు మిశ్రమ ఫలితాలు అందుకుంటారు. ఆర్థిక సమస్యలు రావచ్చు. దూర ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. వ్యాపారాలు ఇబ్బందులు పడుతారు. ఆఫీస్‌లో బాగా శ్రమ పడాల్సిన రోజు. శ్రీ లక్ష్మీదేవి ఆరాధన చేయండి.

మకరరాశి ఫలాలు : ఈరోజు శ్రమతో కూడిన రోజు. వ్యాపారులకు నష్టాలు రావచ్చు. పనులు ముందుకు సాగవు. ఆఫీస్‌లో ఆశించిన ఫలితం ఉండదు. రుణయత్నాలు చేస్తారు. కుటుంబ సభ్యులకు అనారోగ్యం. విద్యార్థులు బాగా శ్రమించాల్సిన రోజు. శ్రీ సుబ్రమణ్యస్వామి ఆరాధన చేయండి.

Daily horoscope in telugu

Daily horoscope in telugu

కుంభరాశి ఫలాలు : ఈరోజు ఫుల్ ఎనర్జీతో పనిచేస్తారు. సంతోషంతో కూడిన రోజు. కానీ అనవసర విషయాలతో సమయం వృథా చేస్తారు. కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఆఫీస్‌లో ప్రమోషన్‌కు చాన్స్ ఉంది. విద్యార్థులకు శుభవార్తలు వింటారు. శ్రీ రామ తారకాన్ని జపించండి.

మీనరాశి ఫలాలు : ఈరోజు బాగుంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కుటుంబానికి సంబంధించి ఆశ్చర్యకరమైన విషయం తెలుస్తుంది. విద్యార్థులు, ఉద్యోగస్తులకు కార్యజయం. దేవాలయాలను సందర్శిస్తారు. వ్యాపారాలలో ఆనందం. లాభాలు రావచ్చు. ప్రయాణాలు కలసి వస్తాయి. వివాహం అయిన వారికి అత్తమామల నుంచి ఆర్థికప్రయోజనాలు చేకూరుతాయి.ఇష్టదేవతారధన చేయండి.

Devotional Desk

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp