Today Horoscope : న‌వంబ‌ర్‌ 21 2021 ఆదివారం మీ రాశిఫ‌లాలు.. ఈ రెండురాశుల వారు శుభవార్తలు వింటారు..!

Authored By Devotional Desk | The Telugu News | Updated on : 20 November 2021, 10:00 pm

Today Horoscope న‌వంబ‌ర్‌ 21 2021 ఆదివారం మీ రాశిఫ‌లాలు మేషరాశి ఫలాలు : ఈరోజు అనుకోని లాభాలు వస్తాయి. ధనం కోసం మీరు చేసే ప్రయత్నాలు నెరవేరుతాయి. సమస్యలు తొలగిపోతాయి. ఆఫీస్‌లో బదిలీకి అవకాశం ఉంది. విద్యార్థులకు అనుకూలమైన రోజు. వినాయక ఆరాధన చేయండి. వృషభరాశి ఫలాలు : ఈరోజు మంచి రోజు. ధనలాభాలు వస్తాయి. వ్యాపారాలు బాగుంటాయి. కుటుంబంలో అనుకోని శుభ కార్యక్రమాలకు ప్లాన్‌ చేస్తారు. ఇంటికి సంబంధించి విలువైన కొనుగోలు చేస్తారు. విద్యార్థుల గుర్తింపు లభిస్తుంది. శుభవార్తలు వింటారు. ఇష్టదేవతరాధన చేయండి.

Today Horoscope మిథునరాశి ఫలాలు : ఈరోజు అనుకోని సమస్యలు రావచ్చు. ఆఫీస్‌లో బదలీలకు అవకాశం ఉంది. అనుకోని ప్రయాణాలు చేస్తారు. అనుకోని ధన సంబంధ సమస్యలు రావచ్చు. కుటుంబ సభ్యులకు స్వల్ప అనారోగ్య బాధలుంటాయి. విద్యార్థులు శ్రమించాల్సిన రోజు. శ్రీ సూర్యనారాయణ స్వామి ఆరాదన చేయండి. కర్కాటకరాశి ఫలాలు : ఈరోజు వివాదాలకు దూరంగా ఉండండి. అనుకోని మార్గాల ద్వారా లాభాలు వస్తాయి. బంధువుల నుంచి ఇబ్బందులు రావచ్చు జాగ్రత్త. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. విద్యార్థులకు మంచి ఫలితాలు రావచ్చు. వ్యాపారులు సాధారణంగా ఉంటాయి. శ్రీ కాలభైరవాష్టకం పారాయణం చేయండి.

today horoscope in telugu

today horoscope in telugu

Today Horoscope సింహరాశి ఫలాలు : ఈరోజు ఇబ్బందులు పోతాయి. పెద్దల సహకారం లభిస్తుంది. ఆఫీస్లో మీకు శత్రు బాధలు దూరమవుతాయి. కుటుంబ సబ్యులకు ఆరోగ్యం బాగుంటుంది. ఆకస్మిక ధనలాభం. విద్యార్థులు మంచి రోజు. ఆదిత్య హృదయం పారాయణం చేయండి.

Today Horoscope కన్యరాశి ఫలాలు : ఈరోజు వివాహం అయిన వారికి పిల్లల నుంచి ఇబ్బందులు. వారి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఆర్థికంగా సాధారణంగా ఉంటుంది. వ్యాపారులు జాగ్రత్తగా నిర్వహించాల్సిన సమయం. విద్యార్థులు మంచి ఫలితాలు పొందుతారు. ఇష్టదేవతారాధన చేయండి.

తులారాశి ఫలాలు : ఈరోజు అనుకోని శ్రమ. పని వత్తిడి. ఆఫీస్‌లో మీకు పై అధికారుల నుంచి వత్తిడి. వివాదాలకు దూరంగా ఉండండి. వ్యాపారంలో ఇబ్బందులు. విద్యార్థులకు మంచి ఫలితాల కోసం శ్రమించాల్సిన రోజు. వైవాహిక జీవితంలో సమస్యలు రావచ్చు. శ్రీరామ రక్ష స్తోత్రం పారాయణం చేయండి.

వృశ్చికరాశి ఫలాలు : ఈరోజు మానసిక ప్రశాంతత లభిస్తుంది. అనుకోని లాభాలు రావచ్చు. ఈరాశి స్త్రీలు ఆరోగ్యం కోసం జాగ్రత్త తీసుకోవాల్సిన రోజు. అప్పుల కోసం ప్రయత్నాలు చేస్తారు. ఆఫీస్‌లో సహోద్యోగుల దగ్గర జాగ్రత్తగా ఉండటం మంచిది. నవగ్రహాలకు ప్రదక్షణలు చేయండి.

ధనుస్సురాశి ఫలాలు : ఈరోజు శుభవార్తలు వింటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ధనం చేతికి అందుతుంది. సంతోషం పెరుగుతుంది. కుటుంబ సంతోషంగా ఉంటుంది. ఆఫీస్‌లో పేరు ప్రతిష్ఠలు లభిస్తాయి. విద్యార్థులు శుభవార్తలు వింటారు. దుర్గాదేవి ఆరాదన చేయండి.

మకరరాశి ఫలాలు : ఈరోజు సంతోషం నిండిన రోజు. ఆర్థిక పరిస్థితులు లాభకరంగా ఉంటాయి. ఆఫీస్‌లో
ముఖ్యమైన కార్యాలు వేగంగా పూర్తిచేస్తారు. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. విద్యార్థులు మంచి ఫలితాలను సాధిస్తారు. శివాలయంలో పూజ చేయండి.

కుంభరాశి ఫలాలు : ఈరోజు నీరసంగా ఉంటారు. ఆరోగ్యం కోసం జాగ్రత్తలు తీసుకోవాలి. రియల్‌ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. ఆఫీస్‌లో సోమరితనాన్ని వదిలి పనిచేయండి.కుటుం సభ్యులకు మీ సమయం ఇచ్చి సంతోషం నింపండి. శ్రీ భ్రమరాంభ మల్లికార్జునస్వామి ఆరాధన చేయండి.

మీనరాశి ఫలాలు : ఈరోజు అనేక మంచి విషయాలు జరుగుతాయి. కుటుంబ పెద్దల ద్వారా ఆర్థిక సమస్యలు ఆలస్యంగా తొలగిపోతాయి. ఆఫీస్‌లో మంచి వార్తలు వింటారు. సంతానం వల్ల మీరు మనోల్లాసాన్ని పొందుతారు. విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. ఇష్టదేవతరాధన చేయండి.

Advertisement

Devotional Desk

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి