Today Horoscope : న‌వంబ‌ర్‌ 22 2021 సోమవారం మీ రాశిఫ‌లాలు.. ఈ రెండురాశుల వారు శుభవార్తలు వింటారు..!

Authored By Devotional Desk | The Telugu News | Published on: November 21, 2021, 10:00 pm

మేషరాశి ఫలాలు : ఈరోజు ఇబ్బందులు కలుగుతాయి. కానీ మీ తెలివి తేటలతో వాటిని అధిగమిస్తారు. ఆఫీస్‌లో పనులు ముందుకు సాగవు. కుటుంబ సభ్యులకు అనారోగ్య సూచన. విద్యార్థులు కష్టించినా ఫలితం కనిపించదు. సోమేశ్వర స్వామికి అభిషేకం చేయండి.  వృషభరాశి ఫలాలు :ఈరోజు మంచిరోజు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కుటుంబంలో ఆశ్చర్యక రమైన సంఘటనలు చోటుచేసుకుంటాయి. ఆఫీస్లో పెద్దల పరిచయాలు. వ్యాపారులకు లాభాలు. వైవాహిక జీవితంలో సమస్యలు తొలగుతాయి.

మిథునరాశి ఫలాలు : ఈరోజు ప్రతికూల వాతావరణం ఉంటుంది. ఓపికతో మెలగాల్సిన రోజు. ఆఫీస్‌లో
వివాదాలకు అవకాశం ఉంది జాగ్రత్త. వ్యాపారులకు ఆర్థిక ఇబ్బందులు. పనులు మందకొడిగా సాగుతాయి. విద్యార్థులు బాగా కష్టపడి చదవాల్సిన రోజు. శివాభిషేకం లేదా మారేడు దళాలలతో అష్టోతర పూజ చేయించుకోండి.  కర్కాటకరాశి ఫలాలు : ఈరోజు సంతోషం, ఫుల్‌ ఎనర్జీతో పనులు పూర్తిచేస్తారు. కుటుంబంలో ముఖ్య విషయాలు చర్చిస్తారు. ఆఫీస్‌లో వ్యవహారాలలో విజయం. స్నేహితులతో లేదా బంధువుల శుభవార్తా శ్రవణం. ఆకస్మిక ప్రయాణాలు. శ్రీదుర్గాదేవి సూక్తం పారాయణం చేయండి.

today horoscope in telugu

today horoscope in telugu

సింహరాశి ఫలాలు : ఈరోజు పెద్దల సలహాల ద్వారా ప్రయోజనాలు పొందుతారు. ఆర్థిక స్తితి బాగుంటుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఆకస్మిక ధనలాభం. వ్యాపారాలు లాబాల బాటలో సాగుతాయి. ఆఫీస్‌లో కొత్త వార్తలు వింటారు. వైవాహికంగా మంచి రోజు. ఇష్టదేవతరాధన చేయండి.

కన్యరాశి ఫలాలు : ఈరోజు ప్రతికూలమైన రోజు. అనుకోని సమస్యలు వస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య విబేధాలు. రుణాలు చేయాల్సిన స్థితి. వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి. ఈరోజు మీకు ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆఫీస్‌లో గందరగోళం. విద్యార్థులకు మంచిరోజు. అమ్మవారికి కుంకుమ పూజ చేయండి.

తులారాశి ఫలాలు : ఈరోజు మిశ్రమ ఫలితాలు వస్తాయి. అనుకోని ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. బంధువుల నుంచి కొత్త విషయాలు తెలుస్తాయి. వ్యాపార విషయాల్లో, ఒప్పందాలలో ఆటంకాలు. కుటుంబ సభ్యులకు అనారోగ్యం. విద్యార్థులకు ఈరోజు సామాన్యంగా ఉంటాయి. రుద్రాభిషేకం చేయించుకోండి.

వృశ్చికరాశి ఫలాలు : ఈరోజు విజయాలు పొందుతారు. పాత మిత్రులను కలుస్తారు. వ్యాపారాలు మంచిగా సాగుతాయి. ఆర్థికస్థితి బాగుంటుంది. విద్యార్థులకు కార్యసిద్ధి. పెద్దలతో పరిచయాలు. వైవాహికంగా మంచి రోజు ఆనందంగా గడుపుతారు. శివారాధన చేయండి.

ధనుస్సురాశి ఫలాలు : ఈరోజు గృహంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. కుటుంబంలో గౌరవం పెరుగుతుంది. ఆఫీస్లో పై అధికారులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. వ్యాపారాలు లాబాలు గడిస్తారు. ఇష్టమైనవారిని కలుస్తారు. విద్యార్థులు మంచి ఫలితాలను పొందుతారు. శ్రీరామ తారకాన్ని జపించండి,

మకరరాశి ఫలాలు :ఈరోజు పనులు మందుకు సాగవు. కుటుంబంలో అనుకోని సమస్యలు వస్తాయి. ఓపికతో పెద్దల సలహాలను పాటించండి. ఆర్థికంగా బాగుండదు. ధనం కోసం రుణాలు చేస్తారు. విద్యార్థులకు ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు, మందగిస్తాయి. వైవాహికంగా బాగుంటుంది. శ్రీసూక్త విధానంలో అమ్మవారి పూజ చేయండి.

కుంభరాశి ఫలాలు : ఈరోజు పరిస్థితులు పెద్దగా అనుకూలించదు. ఆఫీస్‌లో పనులు నిదానంగా సాగుతాయి. ఆర్థికంగా ఇబ్బందులు కలుగుతాయి. అప్పులు చేయకండి. ఎవరిని నమ్మి పెట్టుబడులు పెట్టకండి. ప్రయాణాలు తప్పనిసరి అయితేనే చేయండిఆఫీస్‌లో బాధ్యతలు పెరుగుతాయి. శివాలయంలో దీపారాధన, పూజ చేయండి మంచి పలితాలు వస్తాయి.

మీనరాశి ఫలాలు : ఈరోజు మీరు ఉత్సాహంగా పనిచేస్తారు. ఆఫీస్‌లో పై అధికారుల ప్రశంసలు. పెద్దల ద్వారా ముఖ్య విషయాలు తెలుసుకుంటారు. ఆర్థికంగా మంచిరోజు. విద్యార్థులు శుభవార్తలు వింటారు. కార్యజయంవైవాహికంగా సంతోషం కలిగించే రోజు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. శివారాధన చేయండి.

Devotional Desk

No bio available for this author.

  1. "Ysrcp : కడప గడ్డపై వైసీపీకి ఘోర పరాభవం.. ఒక్క నామినేషన్ కూడా పడకపోవడం వెనుక అసలు నిజాలివే..!"

  2. "Rashmika Mandanna : తెలంగాణ కోడలిగా బతుకమ్మ ఆడిన రష్మిక.. నెట్టింట రచ్చ లేపుతున్న నేషనల్ క్రష్ పిక్స్..!"

  3. "Punganur Municipal Elections : పుంగనూరులో తోకముడిచిన పెద్దిరెడ్డి? మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి దెబ్బకు వైసీపీ ఖేల్ ఖతం..!"

  4. "Charlotte Telugu Sambaralu 2026 : షార్లెట్‌లో తెలుగు సంబరాలు 2026 ఘనంగా.. మిషిగన్‌లో నాట్స్ కొత్త చాప్టర్ ప్రారంభం"

  5. "NATS : అమెరికా తెలుగు సమాజానికి నాట్స్ కొత్త నాయకత్వం.. సాయి గంగులకు కీలక బాధ్యతలు"

  6. "Flipkart Big Billion Days : రూ.9 వేలలోపు ఫోన్లు.. 5Gపై అదిరే డీల్స్"

  7. "Anupama Parameswaran : అనుపమ పరమేశ్వరన్ కెరీర్‌కు అగ్నిపరీక్ష.. ఆ రెండు సినిమాలే ఆమె భవితవ్యాన్ని తేలుస్తాయా..?"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp