Today horoscope : అక్టోబ‌ర్ 13 2021 బుధ‌వారం మీ రాశిఫ‌లాలు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Today horoscope : అక్టోబ‌ర్ 13 2021 బుధ‌వారం మీ రాశిఫ‌లాలు

 Authored By prabhas | The Telugu News | Updated on :13 October 2021,6:40 am

Today horoscope మేష రాశి : ఈరోజు మీకు ఆఫీస్‌లో పని వత్తిడి. కోపం కంట్రోల్‌లో ఉంచుకోవాల్సిన రోజు. మీ పిల్లల ద్వారా ఆర్థిక ప్రయోజనాల ద్వారా ప్రయోజనాలు పొందుతారు. ఇంటికి అతిథులు వస్తారు. విద్యార్థులు ఈరోజు చదువుపై శ్రద్ధపై పెట్టలేరు. మీ బంధువులు ఈ రోజు మీ వైవాహిక జీవితానికి కొన్ని ఇబ్బందులు తెచ్చిపెట్టే అవకాశం ఉంది. ఈరోజు హనుమాన్‌ చాలీసా పారాయణం చేయండి. వృషభ రాశి : ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. కుటుంబంలో, సమాజంలో కొంత వరకు వత్తిడిని ఎదురుకుంటారు. అనుకోని విధంగా ధనం మీ చేతికి అందుతుంది. సంఘంలో పెద్దలతో పరిచయాలు. ఆఫీస్‌లో పని వత్తిడి ఎక్కువగా ఉంటుంది. తోటి ఉద్యోగులతో జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులు మంచి అవకాశాలు వస్తాయి. వ్యాపారులకు మంచిగా ఉంటుంది. వైవాహిక జీవితం సాఫీగా సంతోషంగా సాగుతుంది. శివుడికి రుద్రాభిషేకం చేయించుకోండి.

మిథున రాశి : ఈరోజు సంతోషం, ఆనందం మీకు లభిస్తుంది. ఆందోళనలకు దూరంగా ఉంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల కోసం ధనాన్ని వెచ్చిస్తారు. బంధువుల నుంచి వత్తిడులు, ఆహ్వానాలు వస్తాయి. వారి వల్ల మీకు సహాయం అందుతుంది. ఇంట్లో సమస్యలకు పెద్దలను నిందించకండి. వైవాహిక జీవితంలో సంతోషం కోసం ఓపికను పెంచుకోవాల్సిన రోజు. విద్యార్థులకు మంచిరోజు. శ్రీ దుర్గాదేవి ఆరాధన చేయండి మంచి ఫలితాలు వస్తాయి. కర్కాటకరాశి : ఈరోజు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. విశ్రాంతి తప్పనిసరి అవసరమయ్యే రోజు. ఇంట్లో పెద్దల సలహాలతో ధనాన్ని ఖర్చు చేయండి. పెట్టుబడలు పెట్టేటప్పుడు తప్పనిసరిగా నిపుణుల సలహాలు తీసుకోండి. ప్రేమించే వారిని బాధపెట్టే పనులు ఈ రోజు చేయకండి. మానసిక ప్రశాంతత కోసం ప్రయత్నిస్తారు. భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. విద్యార్థులు మంచి అంశాలను నేర్చుకుంటారు. శ్రీ సరస్వతి దేవి ఆరాధన చేయండి.

today horoscope in telugu

today horoscope in telugu

సింహరాశి : చాలా కాలంగా మీరు వేచిచూస్తున్న పనులు పూర్తయ్చే అవకాశం ఉంది. అనుకోని రీతిలో ముఖ్యస్తులను మీరు కలుస్తారు. సాయంత్రం సమయంలో శుభవార్త వింటారు. ఈ వార్త కుటుంబంలోని వారికి ఆనందాన్ని కలిగిస్తుంది. అమ్మ వారి తరుపు నుంచి ధనలాభం కలుగుతుంది. వైవాహికంగా బాగుంటుంది. వృత్తి జీవితంలో వృద్ది కన్పిస్తుంది. విద్యార్థులకు శ్రమతో మంచి ఫలితాలు. శ్రీ దుర్గాస్తోత్రం పారాయణం చేయండి. కన్యా రాశి : ఈరోజు మీ కుటుంబ సభ్యులు మీ నుంచి చాలా ఆశిస్తారు. పొదుపు చేయడం వల్ల ఈరోజు మీకు మంచి జరుగుతుంది. ఆర్థిక విషయాలలో లాభాలు వస్తాయి. మధురమైన క్షణాలను ఈరోజు పొందుతారు. విద్యార్థులు బాగా చదువుకుంటారు. మంచి ఫలితాలు పొందుతారు. వైవాహికంగా మంచి రోజు. వ్యాపారాలు లాభాల బాటలో నడుస్తాయి. ప్రయాణాలు కలసి వస్తాయి. శ్రీ కాళీకా అమ్మవారిని ఆరాధించండి.

తులారాశి : ఈరోజు మీ ప్రవర్తన వల్ల అందరినీ ఆకర్షిస్తారు. కొత్త వ్యాపారాలు, ఉమ్మడి వ్యాపారాలు మంచిగా కలసి వస్తాయి. కొత్త ప్రాజెక్టులు అంటే కొత్త పనుల విషయంలో మాత్రం ఆలోచించి వాటిలోకి దిగండి. మీ ప్రియమైనవారు మీరు చెప్పే విషయాలు వినకపోవడం వల్ల విచారం కలుగుతుంది. విద్యార్థులు బాగా శ్రమించాల్సిన రోజు. వైవాహికంగా సంతోషం ఉంటుంది. మంచి ఆర్థిక జీవితం కోసం శ్రీలక్ష్మీదేవికి కుంకుమార్చన చేయించండి. వృశ్చికరాశి : ఈరోజు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఆహార పదార్థాల విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. మీరు కొత్త వస్తువులు అంటే ఫోన్‌ లేదా ఇతర ఎలక్ట్రానిక్స్‌ వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. కుటుంబంలో శాంతిని కాపాడుతారు. ప్రియమైన వారితో కలసి బయటకు వెళ్తారు. వైవాహిక జీవితంలో ఆనందం. విద్యార్థులకు మంచి రోజు. నవగ్రహాలకు ప్రదక్షణలు చేయండి.

today horoscope in telugu october 13 wednesday 2021

today horoscope in telugu october 13 wednesday 2021

ధనస్సు రాశి : ఈరోజు హుషారుగా గడుపుతారు. వ్యాపారస్తులకు లాభాలు వస్తాయి. షేర్‌ మార్కెట్, రియల్ ఎస్టేట్ రంగాలలో వారికి అనుకూలం. ప్రేమికులకు అనుకూలమైన రోజు. మీ కార్యాలయలాలలో వచ్చే ఆటంకాలను పట్టించుకోకుండా మీ లక్ష్యాలవైపు దృష్టి పెట్టండి. విజయం మీ సొంతం అవుతుంది. మౌనం ఈరోజు మీకు ఆయుధంగా పనిచేస్తుంది. జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. శ్రీలలితా సహస్రనామాలను పారాయణం లేదా వినడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి

మకరరాశి : ఈరోజు ఉత్సాహంగా, ఉల్లాసంగా గడుపుతారు. కార్యాలయాలలో ఆనందంగా పనిచేస్తారు. తక్కువ సమయంలో ఎక్కువ పనిచేస్తారు. అప్పులు ఎవరికి ఇవ్వకండి. ఆర్థిక విషయలలో లాభాలు కనిపిస్తున్నాయి. విదేశీ యానం చేయాలనుకునే వారు ప్రయత్నాలు చేయడం మంచిది. వాహనాలను జాగ్రత్తగా నడపండి. అనారోగ్య సూచనలు ఉనానయి జాగ్రత్త. జీవిత భాగస్వమితో సంతోషంగా గడుపుతారు. గోసేవ చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.

కుంభరాశి : ఈరోజు చక్కటి ఫలితాలు వస్తాయి. మధుర క్షణాలతో ఈరోజు గడుస్తుంది. ప్రయాణాలు కలసిరావు. ఆర్థికంగా బాగుంటుంది. కుటుంబ సభ్యులతో సరదాగా, సంతోషంగా గడుపుతారు. ఈరోజు మీరు చేసే కార్యాలతో మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. విద్యార్థులు పట్టుదలతో ముందుకు పోతారు. వ్యాపారాలు లాభాల బాటలో నడుస్తాయి. జీవిత భాగస్వామి మీకు తోడుగా నిలుస్తుంది. శ్రీ దుర్గాదేవి ఆరాధన చేయండి. మీనరాశి : ఈరోజు ఆర్థిక సమస్యలు తొలిగిపోతాయి. ఆనందంగా గడుపుతారు, మంచి శక్తితో పనిచేస్తారు. ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. ప్రేమికులు జాగ్రత్తగా ఉండాల్సిన రోజు. ఉమ్మడి వ్యాపారాలకు, పెట్టుబడులకు ఈరోజు దూరంగా ఉండండి. విద్యార్థులు మంచి ఫలితాలను సాధిస్తారు. జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. శ్రీ లలితా దేవి ఆరాధన చేయండి.

Advertisement
WhatsApp Group Join Now

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది