today horoscope in telugu
అక్టోబర్ 22 శుక్రవారం మీ రాశిఫలాలు మేష రాశి ఫలాలు : ఈరోజు మంచి లాభాలు పొందుతారు. అనుకోని మార్గాల ద్వారా ధనం వస్తుంది. సంతోషకరమైన జీవితం కోసం గట్టి పట్టుదలతో పనులు చేయండి. బంధువులను కలవడానికి మంచి రోజు. ఈరోజు విందులు వినోదాలలో పాల్గొంటారు. విద్యార్థులకు మంచి అవకాశాలు వస్తాయి. వ్యాపారులు లాభాలు గడిస్తారు. కుటుంబంలో ఆనందం. వైవాహికంగా బాగుంటుంది. ఇష్టదేవతరాధన చేయండి. వృషభరాశి ఫలాలు : ఈరోజు సరిపోయినంత ధనం మీ వద్ద ఉంటుంది. మానసిక శాంతి పొందుతారు. ఆరోగ్యం బాగుంటుంది. ప్రేమికులకు మంచి శుభవార్తలు వస్తాయి. ఆఫీస్‌లో పై అధికారుల ప్రశంసలు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. వైవాహికంగా బాగుంటుంది. దుర్గా దేవి స్తోత్రం పారాయణం చేయండి.
today horoscope in telugu
మిథునరాశి ఫలాలు : ఈరోజు కొత్త ఒప్పందాలు కొలిక్కి వస్తాయి. ధనం సంపాదిస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. ఉల్లాసంగా పనిచేస్తారు. కార్యాలయాల్లో మంచి వార్తలు వింటారు. ప్రేమికులకు అందమైన రోజు. వ్యాపారులకు ధనప్రవాహం. ఇంటి కోంస ఖర్చులు చేస్తారు. బంధువుల ద్వారా సంతోషం. విద్యార్థులకు మంచి అవకాశాలు. ఇష్టదేవతరాధన చేయండి. కర్కాటక రాశి ఫలాలు : ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. కష్టపడుతారు.కానీ మంచి ఫలితాలు వస్తాయి. ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయి. ప్రేమలో వివాదాలకు దూరంగా ఉండండి.విజయం మీ సొంతం. వైవాహిక జీవితం సాఫీగా సాగుతుంది. విద్యార్థులకు మంచి అవకాశాల కోసం శ్రమించాల్సిన సమయం. సరస్వతి దేవి ఆరాధన చేయండి.
సింహ రాశి ఫలాలు : ఈరోజు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడుతారు. ధనాన్ని సంపాదిస్తారు. కుటుంబ సభ్యులు లేదా స్నేహితులు మీకు సహాయం చేస్తారు. ఆఫీస్‌లో సీనియర్ల నుంచి సహకారం లభిస్తుంది. ప్రేమికలకు ఇబ్బంది కలిగే రోజు జాగ్రత్త. విద్యార్థులు మంచి ఫలితాలు పొందుతారు. వైవాహికంగా ఆనందం మీ సొంతం. అమ్మవారి దేవాలయంలో ప్రదక్షణలు చేసి తీర్థం తీసుకోండి.
కన్యా రాశి ఫలాలు : ఈరోజు మిత్రుల సహకారం లభిస్తుంది. ధనాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. రానున్న రోజుల్లో ధన సమస్యలు రాకుండా జాగ్రత్త పడండి. కుటుంబ సభ్యులతో సమయం గడపండి. పిల్లలు మీకు సంతోషాన్ని కలిగిస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. సోదర సోదరీలు మీ సహాయం కోసం ఈరోజు వస్తారు. భాగస్వామితో వివాదాలకు దిగకండి.విద్యార్థులు మంచి ప్రయోజనాలు పొందుతారు. లలితా దేవి ఆరాధన చేయండి.
today horoscope in telugu
తులా రాశి ఫలాలు : ఈరోజు చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. పాజిటివ్ థింకింగ్ తో పనులు చేయండి. మీ విలువైన వస్తువులు జాగ్రత్త. ప్రయాణాలు జాగ్రత్తగా చేయండి. కుటుంబ సబ్యులతో కలసి ముఖ్య విషయాలు చర్చిస్తారు. అప్పులు ఎవరికి ఇవ్వకండి. ప్రేమికులు మనసు విప్పి బాధలు చెప్పుకోవాల్సిన రోజు. వైవాహికంగా సాఫీగా సాగుతుంది. విద్యార్థులకు మంచిరోజు. శ్రీ విష్ణు సహస్రనామాలను చదవండి లేదా వినండి.
వృశ్చిక రాశి ఫలాలు : ఈరోజు ఇతరులకు సహాయం చేయడంతో మీకు సంతోషం, మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆరోగ్యం కోసం వ్యాయామం చేయాల్సిన రోజు. ఆర్థికసమస్యలు వస్తాయి. కానీ వాటిని మీ పెద్దలు లేదా స్నేహితుల సహాయంతో గట్టెక్కుతారు. పిల్లల విషయంలో కఠినంగా ఉండకండి. వారి తప్పులను మన్నించండి. విద్యార్థులు బాగా శ్రమించాలి. కుటుంబం, వైవాహిక జీవితంలో వివాదాలకు ఈరోజు తావు ఇవ్వకండి. శ్రీ లక్ష్మీ అష్టోతరం చదవండి. దీపారాధన చేయండి.
ధనుస్సు రాశి ఫలాలు : ఈరోఉ విందులు, వినోదాలలో పాట్గొంటారు. ఉల్లాసంగా గడుపుతారు. ఆర్తిక విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ సభ్యులతో ధన విషయంలో వివాదం రావచ్చు. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఈరోజు పట్టుదలతో పనులు చేయండి. కొత్త పనులు, ప్రాజెక్టులు ముందడుగు వేయడానికి అనుకూలమైన రోజు. విద్యార్థులకు మంచి రోజు. దుర్గాదేవి దగ్గర దీపారాధన చేయండి.
today horoscope in telugu
మకర రాశి ఫలాలు : ఈరోజు కోపతాపాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యం కోసం శ్రమించండి. అంటే వ్యాయామం, ఆహార నియమాలను పాటించండి. ఆర్థికంగా పర్వాలేదు. వ్యాపారులకు పెద్దగా లాభాలు రావు కానీ నష్టం ఉండదు. ఇంట్లో మరింత ప్రశాంతత. వృత్తిలో అభివృద్ది. ఈ రోజు మీ భాగస్వామితో ఆనందంగా, ఉల్లాసంగా గడుపుతారు. విద్యార్థులకు మంచి ఫలితాలు రావచ్చు. శ్రీ పార్వతీ దేవి ఆరాధన చేయండి.
కుంభ రాశి ఫలాలు : ఈరోజు పక్కవారి ప్రభావం మీ మీద ఎక్కువగా ఉంటుంది. ధనలాభాలు సామాన్యంగా ఉంటాయి.వ్యాపారాలు మామూలుగా నడుస్తాయి. స్నేహితలు ద్వారా కొత్త పరిచయాలు కలుగుతాయి సాయంత్రం అద్భుతంగా గడుస్తుంది. ప్రేమ గురించి జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ సభ్యులతో శుభకార్య ప్రయత్నాలను ప్రారంభిస్తారు. మీ జీవిత భాగస్వామితో ముఖ్యవిషయాలు చర్చించండి. విద్యార్థులు శ్రమించాలి. దగ్గరలోని దేవాలయం దర్శించి ప్రదక్షణలు చేయండి.
మీన రాశి ఫలాలు : ఈరోజు అన్ని అనుకూలం. ఆరోగ్యం బాగుంటుంది. ధన విషయంలో మాత్రం జాగ్రత్తలు తీసుకోకుంటే నష్టాలు వస్తాయి. కొత్త పనులు చేసేటప్పుడు ఆచితూచి వ్యవహరించటం మంచిది. కుటుంబ సభ్యులతో కాలాన్ని గడపడం సంతోషం. ఆఫీస్‌లో పై అధికారుల నుంచి శుభవార్తలు వింటారు. ప్రమోషన్‌కు అవకాశం. విద్యార్థులు అనుకూలమైనరోజు. వైవాహికంగా సాఫీగా,సంతోషంగా సాగిపోయే రోజు. శ్రీలలితాదేవి ఆరాధన చేయండి.
Banakacherla Project : బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ వివాదంపై పరిష్కారానికై కేంద్ర ప్రభుత్వం ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని…
YCP : ఆంధ్రప్రదేశ్‌లో తమ బలాన్ని తిరిగి సాధించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల పాతిక మందితో…
Samantha - Naga Chaitanya : టాలీవుడ్ స్టార్ జంటగా పేరు తెచ్చుకున్న నాగ చైతన్య – సమంత ప్రేమించి…
Little Hearts Movie : "90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో…
Rajagopal Reddy : తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బహిరంగంగా…
Allu Arha : ఐకాన్ స్టార్ Allu Arjun అల్లు అర్జున్ ముద్దుల కూతురు అల్లు అర్హ తెగ సందడి…
Modi : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ donald trump విధించిన టారిఫ్‌లపై భారత ప్రధాని నరేంద్ర మోదీ ఘాటుగా…
Trump : రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమయ్యాయి. ఈ…
This website uses cookies.