Home » Entertainment » Vijay Deverakonda Launched Rowdy Boys Movie Event
Entertainment

Vijay Deverakonda : చ‌ర‌ణ్ అన్న నిన్ను చూసి ఎవ‌ర్రా ఈ పిల్ల అని అడిగాడు.. విజ‌య్‌దేవ‌ర‌కొండ‌

Authored By
mallesh
The Telugu News | Published on: October 21, 2021, 9:50 pm
Advertisement

Vijay Deverakonda : ‘హుషారు’ ఫేమ్ డైరెక్టర్ హర్ష డైరెక్షన్ లో వస్తున్న యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్ ‘రౌడీ బాయ్స్’ ఫిల్మ్ కాగా, ఈ సినిమాపై ఆల్రెడీ భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి. ఈ చిత్రం ద్వారా టాలీవుడ్ ఫేమస్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఫ్యామిలీ నుంచి అశిష్ హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్నారు. శిరీష్ తనయుడు అయిన అశిష్ హీరో కాగా, ఈ మూవీలో అనుపమా పరమేశ్వర్ హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్ ఆకట్టుకుంటుండగా, తాజాగా ఓ సాంగ్‌ను రౌడీ హీరో విజయ్ దేవరకొండ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా అనుపమా పరమేశ్వరన్ గురించి మాట్లాడారు.‘రౌడీ బాయ్స్’ చిత్రం నుంచి ‘ప్రేమే అక్షరమైతే’ సాంగ్ రిలీజ్ ఈవెంట్‌కు విజయ్ దేవరకొండ గెస్ట్‌గా వచ్చి మాట్లాడారు.

Advertisement

Vijay Deverakonda launched rowdy boys Movie Event

డైరెక్టర్ హర్ష తనకు ‘హుషారు’ సినిమా కంటే ముందు నుంచి తెలుసని, తనకు చాలా కథలు చెప్పేవాడని పేర్కొన్నాడు. ఇకపోతే ‘రౌడీ బాయ్స్’ మూవీ యూనిట్‌కు బెస్ట్ విషెస్ చెప్తూనే ఈ సినిమా హిట్ గ్యారంటీగా కావాలని తాను ఆకాంక్షిస్తున్నట్లు విజయ్ చెప్పాడు. ఈ క్రమంలోనే మలయాళ కుట్టి అనుపమా పరమేశ్వరన్‌కు బెస్ట్ కాంప్లిమెంట్స్ ఇచ్చాడు. అనుపమను చూసిన ప్రతీ సారి తనకు ‘ప్రేమమ్’ సినిమాలోని ‘మేరీ’ గుర్తుకొస్తుందని అన్నాడు. అయితే, అనుపమ ఇప్పుడు చాలా మారిపోయిందని, కెరీర్‌లో బాగా ఎదిగిందని చెప్పాడు. పాటకు సంబంధించిన విజ్యువల్స్ చూసి చరణ్ అన్న ఎవర్రా ఈ పిల్ల అని అడిగాడని పేర్కొన్నాడు. రాక్ స్టార్ దేవీ శ్రీప్రసాద్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందించారు.

Advertisement

Vijay Deverakonda : ‘రౌడీ బాయ్స్’ హిట్ గ్యారంటీ అన్న ‘లైగర్’ విజయ్..

Vijay Deverakonda launched rowdy boys Movie Event

ఈ సినిమా వచ్చే నెల 19న విడుదల కాబోతున్నట్లు ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రకటించారు. ఈ సినిమాలో లగడపాటి శ్రీధర్ తనయుడు విక్రమ్ నెగెటివ్ రోల్ ప్లే చేయగా, సినిమాపై భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి. రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రజెంట్ పాన్ ఇండియా ఫిల్మ్ ‘లైగర్’లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ డైరెక్ట్ చేస్తున్నాడు.

Advertisement

 

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి