Zodiac Signs : జనవరి 04 బుధవారం ఈరోజు మీ రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే …?

Authored By Prahbas Gilakathula | The Telugu News | Published on: January 3, 2023, 10:40 pm

మేష రాశి ఫలాలు : ఈరోజు చక్కటి ఫలితాలతో ముందుకు సాగిపోతారు. ఆదాయంలో పురోగతి కనిపిస్తుంది. ఈరోజు అనుకోని ప్రయాణాలు చేస్తారు. కుటుంబంలో పరిస్థితులు ప్రశాంతంగా సాగిపోతాయి.ఆఫీస్లో మీకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. అన్ఇనర రకాల వృత్తుల వారికి విజయాలు సాధిస్తారు. మహిళలకు చక్కటి రోజు. శ్రీ రామ రక్షా స్తోత్రం పారాయణం చేయండి, వృషభ రాశి ఫలాలు : కొంత శ్రమతో మీరు పనులను సకాలంలో పూర్తిచేస్తారు. ఆదాయం తగ్గినా మీ అవసరాలకు మాత్రం ధనం చేతికి అందుతుంది. ఆఫీస్లో సమయానుకూలంగా మీరు ప్రవర్తించాల్సిన రోజు. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. ప్రయాణంలో విలువైన వస్తువులు జాగ్రత్త. మహిళలకు చికాకులు. శ్రీ గణపతి ఆరాదన చేయండి.

మిథున రాశి ఫలాలు : ఆటంకాలతో కూడిన రోజు. అనుకోని ప్రయాసలతో కూడిన రోజు. విలువైన వస్తువులు కొంటారు. అనవసర ఖర్చులు కొంటారు. అన్నదమ్ముల నుంచి వత్తిడులు వస్తాయి. విద్యా, ఉపాధి విషయాలలో ఇబ్బందులు వస్తాయి. మహిళలకు సానుకూలత కనిపిస్తుంది,. శ్రీ లక్ష్మీగణపతి ఆరాధన చేయండి. కర్కాటక రాశి ఫలాలు : అనుకోని ఇబ్బందులు వస్తాయి, కానీ ధైర్యంతో ముందుకు పోతారు. అన్ని రకాల వృత్తుల వారికి ఈరోజు శ్రమతో కూడిన రోజు. ఆదాయంలో సాధారణ స్తితి. వ్యాపారాలలో స్వల్ప లాభాలు. కొత్త నిర్ణయాలు తీసుకోవద్దు. మిత్రుల ద్వారా శుభవార్త వింటారు. స్వల్ప అనారోగ్యంతో ఇబ్బందులు. మహిళలకు సాధారణ స్తితి. అమ్మవారి ఆరాధన చేయండి.

Today Horoscope January 04 2023 Check Your Zodiac Signs

Today Horoscope January 04 2023 Check Your Zodiac Signs

సింహ రాశి ఫలాలు : మీరు చేసే పనులలో ఇబ్బందులు వస్తాయి. ఆదాయంలో సాధారణ స్థితి. వ్యాపారాలలో ఇబ్బందులు. అనవసర ఖర్చులు వస్తాయి. వ్యయప్రయాసలతో కూడిన రోజు. ప్రయాణ సూచన కనిపిస్తుంది. విలువైన వస్తువులు జాగ్రత్త. ఆరోగ్యం బాగుంటుంది. శ్రీ రామ తారక మంత్రాన్ని జపించండి.

కన్య రాశి ఫలాలు : కుటుంబంలో చక్కటి వాతావరణం. ఆదాయంలో వృద్ధి. అన్ని రకాల వ్యాపారాలకు లాభాలు వస్తాయి. ఆదాయంలో పెరుగుదల కనిపిస్తుంది. సోదరీ సోదరులతో ఇబ్బందులు తొలిగిపోతాయి. మహిళలకు కొత్త వస్త్రాలు కొంటారు. అన్ని రకాలుగా బాగుంటుంది. శ్రీ సుబ్రమణ్యస్వామి ఆరాధన చేయండి.

తులారాశి ఫలాలు : కొద్దిగా కష్టపడితే ఈరోజు చక్కటి ఫలితాలు సాధిస్తారు. అన్ని రకాల వ్యాపారులకు ఇబ్బందులు తొలిగిపోతాయి. ఆదాయంలో చక్కటి పురోగతి కనిపిస్తుంది. అవసరానికి తగ్గట్టుగా డబ్బు అందుతుంది. సాయంత్రం మిత్రుల నుంచి శుభవార్త వింటారు. మహిళలకు ఇబ్బందులు తొలిగిపోతాయి. శ్రీ రామ జయరామ జయజయ రామ అనే మంత్రాన్ని జపించండి.

వృశ్చిక రాశి ఫలాలు : చాలాకాలం తర్వాత మీకు విశ్రాంతి లభిస్తుంది. పాత బాకీలు వసూలు అవుతాయి. ఆర్థిక ఇబ్బందులు తొలిగిపోతాయి. విద్యార్థులకు ఇబ్బందులు తొలిగిపోతాయి. కుటుంబంలో సంతోష వాతావరణం. ప్రయాణాల వల్ల లాభాలు వస్తాయి. ఆఫీస్లో ప్రోత్సాహం ఉంటుంది. మహిళలకు ధనలాభాలు. శ్రీ లక్ష్మీదేవి ఆరాదన చేయండి.

ధనుస్సు రాశి ఫలాలు : ఈరోజు చక్కటి లాభదాయకమైన రోజు. అన్ని పనులను సకాలంలో పూర్తిచేస్తారు. ధనం మీ అవసరాలకు మించి చేతికి అందుతుంది. వ్యాపారాలలో స్వల్ప లాభాలు. అదృష్టం యోగం కనిపిస్తుంది. ప్యూచర్ ప్లాన్ను వేసుకుంటారు. మహిళలకు విశ్రాంతి దొరుకుతుంది. శ్రీ లలితాదేవి ఆరాధన చేయండి.

మకర రాశి ఫలాలు : కొద్దిగా మధ్యస్తంగా ఉంటుంది. ఆదాయానికి కొత్త మార్గాలను పరిష్కరిస్తారు. ఇంటా, బయటా మీపై బాధ్యతలు పెరుగుతాయి. ఆఫీస్లో ఇబ్బందులు తొలిగిపోతాయి. సాయంత్రం నుంచి విశ్రాంతి,. మానసిక ప్రశాంతత కనిపిస్తుంది. పిల్లల ద్వారా ఇబ్బందులు రావచ్చు. శ్రీ కాలభైరావాష్టకం పారాయణం చేయండి.

కుంభ రాశి ఫలాలు : కొద్దిగా ప్రతికూలత ఉన్నప్పటికీ మీ తెలివితో ముందుకుపోతారు. ఆన్నదమ్ముల నుంచి ఇబ్బందులు తొలిగిపోతాయి. ఆస్తికి సంబంధించి ఒక శుభవార్త వింటారు. కుటుంబంలో ప్రశాంత వాతావరణం. వివాహ సంబంధాలు చూసుకునే వారికి అనుకూలమైన రోజు. ప్రేమ వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. మహిళలకు చక్కటి రోజు. దుర్గాదేవి ఆరాధన చేయండి.

మీన రాశి ఫలాలు : కొంచెం చెడు, మంచితో కూడిన రోజు. అన్నింటా మీకు చికాకులు వస్తాయి. కానీ ఆదాయంలో పురోగతి కనిపిస్తుంది. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులకు అనుకూలం కాదు. పనులను చేయడంలో ఆటంకాలు వస్తాయి. స్నేహితులు లేదా ఇతరులు మిముల్ని మోసం చేసే అవకాశం ఉంది. మహిళలకు చక్కటి రోజు. శ్రీ ఆంజనేయస్వామి ఆరాధన చేయండి.

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp