Zodiac Signs : జనవరి 05 గురువారం ఈరోజు మీ రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే …? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Zodiac Signs : జనవరి 05 గురువారం ఈరోజు మీ రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే …?

 Authored By prabhas | The Telugu News | Updated on :4 January 2023,10:40 pm

మేష రాశి ఫలాలు : ఇప్పటి వరకు ఉన్న ఇబ్బందులు తొలిగిపోతాయి. ఆనుకోని ప్రయాణాలు వస్తాయి. లాభాలు గడిస్తారు. ఆదాయంలో పురోగతి కనిపిస్తుంది. ఆఫీస్లో మీరు ఈరోజు శుభవార్తలు వింటారు. వ్యాపారాల్లో ధన లాభం. మహిళలకు చక్కటి రోజు. ఇష్టదేవతారాధన చేయండి. వృషభ రాశి ఫలాలు : అనుకోని ఆటంకాలు వస్తాయి కానీ పట్టుదలతో పనులను పూర్తిచేస్తారు. ఆర్థికంగా ఇబ్బందులు తొలిగిపోతాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ముఖ్యమైన వివాదాలను పరిష్కారం అవుతాయి. వ్యాపారాల్లో ధనలాబాలు గడిస్తారు. వివాహ ప్రయత్నాలకు అనుకూలం అవుతాయి. మహిళలకు స్వర్ణలాభాలు. శ్రీ రామ రక్షా స్తోత్రం పారాయణం చేయండి.

మిథున రాశి ఫలాలు : కొద్దిగా ఇబ్బందులు వస్తాయి. ఆదాయంలో తగ్గుదల కనిపిస్తుంది. వ్యాపారాలలో నష్టాలు వస్తాయి. అన్ని రకాల వృత్తుల వారికి ఇబ్బందులు. కుటుంబంలో పెద్దల సహాయ సహకారాలు లభిస్తాయి. వాదనలకు దూరంగా ఉండండి. ఎంతో శ్రమ ఆరోగ్యం కోసం జాగ్రత్తలు తీసుకోవాలి. మహిళలకు పని వత్తిడి. శ్రీ లక్ష్మీ గణపతి ఆరాధన చేయండి. కర్కాటక రాశి ఫలాలు : అనుకూలమైన ఫలితాలు సాధిస్తారు. ఆదాయంలో స్వల్ప తేడాలు ఉంటాయి. అనుకోని ఇబ్బందులు వస్తాయి కానీ వాటిని ధైర్యంగా ముందుకుపోతారు. కుటుంబంలో ఆర్థిక పరిస్తితులు ఆశాజనకంగా ఉంటుంది. సాయంత్రం శుభవార్తలు వింటారు. మహిళలకు చక్కటి రోజు. శ్రీ నారాయణ మంత్రాన్ని జపించండి.

Today Horoscope January 05 2023 Check Your Zodiac Signs

Today Horoscope January 05 2023 Check Your Zodiac Signs

సింహ రాశి ఫలాలు : కొత్త కొత్త విషయాలు తెలుస్తాయి. ఆదాయంలో పురోగతి కనిపిస్తుంది. అనుకోని ఇబ్బందులు. సమాజంలో మీకు మంచి పేరు, ప్రతిష్టలు వస్తాయి. ఆఫీస్లో అదనపు బాధ్యతలు మీద పడతాయి. వ్యాపారాల్లో లాభాలు ఉంటాయి. విద్యార్థులు శుభవార్త వింటారు. అన్ని రకాలుగా మిశ్రమ ఫలితాలు.శ్రీ గణపతి ఆరాధన చేయండి.

కన్యారాశి ఫలాలు : వివాదాలకు దూరంగా ఉండాల్సిన రోజు. అనుకోని ఖర్చులు వస్తాయి. ఆదాయంలో తెడాలు వస్తాయి. మిత్రుల సహకారంతో సమస్యలు పరిష్కారం. అవసరాలకు సరిపడా దనం చేతికి అందుతుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. లలితాదేవి ఆరాధన చేయండి.

తులారాశి ఫలాలు : వివాదాలు పరిష్కారం అవుతాయి. ఆదాయంలో పురోగతి కనిపిస్తుంది. మీరు చేసే పనులలో వేగం పెరుగుతుంది. ఇంట్లో సమస్యలు పరిష్కారం అవుతాయి. అన్ని రకాల వృత్తుల వారికి ఇబ్బందులు తొలిగిపోతాయి. ఆఫీస్లో పనిభారం పెరిగినప్పటికీ ఫలితం ఉంటుంది. వివాహ ప్రయత్నాలు అనుకూలం. శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి ఆరాధన చేయండి.

వృశ్చిక రాశి ఫలాలు : పని భారం పెరుగుతుంద. ఆదాయంలో చక్కటి పురోగతి కనపిస్తుంది. వ్యాపారాలలో ఇబ్బందులు తొలిగిపోతాయి. ఆనుకోని ప్రయాణాలు. ఇంటా, బయటా మీకు ఇబ్బందులు తొలిగిపోతాయి. విదేశీ ప్రయత్నాలు ఫలిస్తయి. మహిళలకు స్వర్న లాభాలు. ఇష్టదేవతారాధన చేయండి.

ధనుస్సు రాశి ఫలాలు : అన్నింటా మీకు అనుకూలమైన రోజు. ఇంటా, బయటా మీకు చక్కటి సంతోషకరమైన వాతావరణం. అన్ని రకాల వ్యాపారాలలలో లాభాలు గడిసాత్తరు. కుటుంబంలో సఖ్యత, సంతోషం పెరుగుతాయి. విద్యార్థులకు లాభదాయకమైన రోజు. మహిలలకు ప్రయాణ సూచన. గోసేవ చేయండి.

మకర రాశి ఫలాలు : వివాదాలకు దూరంగా ఉండండి. అన్ని రకాల వ్యాపారులకు లాభాలు. ఆదాయం మాత్రం తగ్గుతుంది. కుటుంబంలో సఖ్యత తగ్గి సమస్యలు రావచ్చు, అనుకోని ప్రయానాలు. వ్యయప్రయసాలు. మహిలకలు చికాకలు పెరుగుతాయి. దుర్గాదేవి ఆరాధన చేయండి.

కుంభ రాశి ఫలాలు : చక్కటి ఫలితాలు అందుకుంటారు. ఆదాయంలో సంతోషకరమైన ఫలితాలు. వ్యాపారాలలో లాభాలు. అనుకోని లాభాలు వస్తాయి. దూర ప్రాంతం నుంచి శుభవార్తలు అందుతాయి. కొత్త పరిచయాలు కలుగుతాయి. వివాహ ప్రయత్నాలకు అనకూలం. అమ్మవారి దేవాలయంలో ప్రదక్షనలు చేయండి.

మీన రాశి ఫలాలు : మిశ్రమంగా ఉంటుంది. ఆదాయంలో తగ్గుదల, అనుకోని ఖర్చులు వస్తాయి. ఉమ్మడి వ్యాపారస్తులకు మాత్రం లాభాలు. ఆఫీస్లో శ్రమ పెరుగుతుంది. కానీ మంచి ప్రశంసలు అందుకుంటారు. అన్ని రకాల వృత్తుల వారికి లాభాదాయకంగా ఉంటుంది. కీలక నిర్ణయాలు పెద్దల సలహా మేరకు తీసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. శ్రీ కాలభైరవాష్టకం పారాయణ చేయండి.

Advertisement
WhatsApp Group Join Now

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది